తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మొబైల్స్​లో 'కాల్​ రికార్డింగ్'​ ఇక అసాధ్యం! గూగుల్ కొత్త రూల్స్!! - call recording new rules in india

Call recording apps ban: ఆండ్రాయిడ్ ఫోన్స్​లో కాల్​ రికార్డింగ్ యాప్స్ వాడుతున్నారా? అయితే.. ఇక అవేవీ పనిచేయవు. యూజర్ల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్​ అన్నింటినీ నిలిపేయాలని నిర్ణయించింది గూగుల్. అయితే.. కాల్ రికార్డింగ్​కు కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. అవేంటంటే...

call recording apps ban
మొబైల్స్​లో 'కాల్​ రికార్డింగ్'​ ఇక అసాధ్యం! గూగుల్ కొత్త రూల్స్!!

By

Published : Apr 21, 2022, 7:12 PM IST

Call recording apps ban: గూగుల్​ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్​లో థర్డ్​ పార్టీ కాల్ రికార్డింగ్​ యాప్స్ అన్నింటికీ సపోర్ట్ నిలిపివేసేందుకు సిద్ధమైంది. అంటే.. వాయిస్ కాల్​ మాట్లాడుతున్నప్పుడు, ఆన్​లైన్​ కాన్ఫరెన్స్​లో పాల్గొంటున్నప్పుడు ఆ సంభాషణను రికార్డ్ చేయడం ఇక కుదరదు. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశముంది.

ఎందుకిలా?: మెజార్టీ స్మార్ట్​ఫోన్లలో ఉండే ఆండ్రాయిడ్ ఓఎస్​ను తయారు చేసే గూగుల్​ సంస్థ.. కాల్ రికార్డింగ్​కు ఎప్పుడూ వ్యతిరేకమే. అవతలి వ్యక్తికి చెప్పకుండా సంభాషణ రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్నది గూగుల్ వాదన. అందుకే కాల్ రికార్డింగ్ యాప్స్​ కట్టడికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.

ఆండ్రాయిడ్ 6 ఓస్​ తెచ్చినప్పుడు ఈ యాప్స్​పై తొలిసారి వేటు వేసింది గూగుల్. కాల్ రికార్డింగ్​కు వీలు కల్పించే ఏపీఐని తొలగించింది. అయితే.. యాప్ డెవలపర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. సరికొత్తగా మళ్లీ కాల్ రికార్డింగ్ యాప్స్​ తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్​​ 9 ఓఎస్​లో వాటికీ కళ్లెం వేసింది గూగుల్. అయితే.. ఆండ్రాయిడ్ యాక్సెసబిలిటీ ఏపీఐని ఉపయోగించి కొందరు యాప్ డెవలపర్స్​ మళ్లీ కాల్ రికార్డింగ్ ఆప్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిపై వేటు వేస్తోంది గూగుల్.

కాల్ రికార్డింగ్ ఇక అసాధ్యమా?: గూగుల్ వర్గాల ప్రకారం.. మే 11 నుంచి థర్డ్​ పార్టీ యాప్స్​ ద్వారా కాల్​ రికార్డింగ్​ కుదరదు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ డిఫాల్ట్​గా ఇచ్చే డయలర్​(ఉదాహరణకు ఎంఐ డయలర్) ద్వారా మాత్రమే కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అయితే.. గూగుల్ డయలర్​ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే.. అవతలి వ్యక్తికి కూడా తెలిసేలా 'ఈ కాల్ రికార్డ్ అవుతుంది' అని అలర్ట్ వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details