Buying used iPhone : మొబైల్ మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ ఒకటి. కొత్త ఫోన్ కొనలేని వారు వీటిపై అభిమానంతో సెకెండ్ హ్యాండ్లో కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల భారీ స్థాయిలో డబ్బు ఆదా అవటంతో పాటు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌లపై గ్యారెంటీ ఉంటుంది. సెకెండ్ హ్యాండ్ ఐఫోన్లు తీసుకోవడం వల్ల కొన్ని లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.
సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనడం వల్ల కలిగే లాభాలు
1. డబ్బు ఆదా అవుతుంది : సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ తీసుకోవడం వల్ల మొదటగా భారీ స్థాయిలో డబ్బు ఆదా అవుతుంది. కొత్త మొబైల్‌తో పోలిస్తే.. వేలల్లో నగదు మిగులుతుంది. ఫోన్ కండిషన్, మోడల్, ఇతర వివరాలను అనుసరించి ధర ఉంటుంది. దీనితో పాటు ఆ ఫోన్ ఎక్కడ తీసుకున్నారు అనే దానిపైనా ఆధారపడి ఉంటుంది. థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ కన్నా.. యాపిల్ స్టోర్స్‌లో రీఫర్బిష్డ్ ఫోన్ కాస్త ధర ఎక్కువగా ఉంటుంది.
2. పర్యావరణ హితం : ఆల్రెడీ వాడిన ఫోన్ ఉపయోగించడం వల్ల మీరు.. ఎలక్ట్రానిక్ వేస్ట్ తయారు చేయకుండా కాపాడిన వారవుతారు. ఎందుకంటే.. ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగా ఐఫోన్లను రీసైకిల్ చేయరు. వేస్ట్ ఫ్రం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ (డబ్ల్యూఈఈఈ) ఫోరం ప్రకారం.. గతేడాది 5.3 బిలియన్ (530 కోట్ల) మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వేస్ట్‌గా మారాయి.
3. పాత మోడళ్లు వాడొచ్చు : మంచి పాత మోడళ్లను వాడే అవకాశం సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొనటం వల్ల సాధ్యమవుతుంది. ఉదాహరణకు గతంలో బాగా ఆదరణ పొందిన ఐఫోన్ 10, 11 మోడళ్లు 2023 జూన్‌లో దొకరడం చాలా కష్టం.
4. ధరలు తగ్గుతాయి : సెకెండ్ హ్యాండ్లో తీసుకోవడం వల్ల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు 2020లో ఐఫోన్ 12 విడుదలైనప్పుడు దాని ధర 599 డాలర్లు. అదే ఫోన్‌ను అమెజాన్‌లో ఇప్పుడు తీసుకోవాలనుకుంటే సుమారు 330 డాలర్లు లేదా అంతకంటే తక్కువే ఉంటుంది.