తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Boat Smart Ring : మీ హెల్త్​, ఫిట్​నెస్​ ట్రాక్​ చేసే అద్భుత ఉంగరం.. బోట్ కంపెనీ ఆవిష్కరణ! - లేటెస్ట్​ స్మార్ట్ రింగ్స్​

Boat Smart Ring : టాప్​ ఇండియన్​ బ్రాండ్​ బోట్​ సరికొత్త స్మార్ట్​ రింగ్​ను ఆవిష్కరించింది. దీని ద్వారా మీ హార్ట్​ రేటు, నిద్ర సమయం లాంటి ఆరోగ్య విషయాలను, ఫిట్​నెస్​లను ట్రాక్​ చేసుకోవచ్చు. అలాగే మహిళలు తమ రుతుచక్రాన్ని కూడా సరిచూసుకోవచ్చు. ఈ స్మార్ట్​ పరికరాన్ని అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ లాంటి ఈ-కామర్స్​ వెబ్​సైట్​ల్లో అందుబాటులోకి తేనున్నట్లు బోట్​ కంపెనీ తెలిపింది. పూర్తి వివరాలు మీ కోసం..

Boat unveils smart ring with heart rate monitoring
boat smart ring

By

Published : Jul 21, 2023, 7:30 PM IST

Boat Smart Ring : భారతీయ కంపెనీ బోట్ తాజాగా​ సరికొత్త స్మార్ట్​ రింగ్​ను ఆవిష్కరించింది. చేతి వేలికి ధరించే ఈ స్మార్ట్​ పరికరంతో మీ ఆరోగ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని (ఫిట్​నెస్​)ను అత్యంత కచ్చితత్వంతో ట్రాక్​ చేసుకోవడానికి వీలవుతుందని కంపెనీ చెబుతోంది.

ప్రీమియం లుక్​తో..
Boat smart ring fitness tracker : సెరామిక్​, మెటల్​ మెటీరియల్​తో చేసిన ఈ స్మార్ట్​ రింగ్​ చూడడానికి మంచి ప్రీమియం లుక్​తో ఉంటుంది. దీనితో మీ హార్ట్​ రేటు, ఎస్​పీO2 ట్రాకింగ్​, స్లీప్​ మోనిటరింగ్​ చేసుకోవచ్చు. మొత్తంగా మీ ఆరోగ్యాన్ని, ఫిట్​నెస్​ను ట్రాక్​ చేసుకోవచ్చు. అలాగే ఈ బోట్​ స్మార్ట్​ రింగ్​తో.. మీ శరీర ఉష్ణోగ్రతను కొలవవచ్చు. స్మార్ట్​ వాచ్​లో లాగా ఈ స్మార్ట్​ రింగ్​తో కూడా మీరు నడుస్తున్నప్పుడు, పరుగెడుతున్నప్పడు స్టెప్​లను ట్రాక్​ చేసుకోవచ్చు. అలాగే వర్కౌంట్స్​ చేస్తున్నప్పుడు ఎన్ని కేలరీలు ఖర్చు అయ్యింది కూడా తెలుసుకోవచ్చు.

Boat smart ring for woman : మహిళల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ రింగ్​ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా రుతుచక్రం ట్రాక్​ చేయడానికి లేదా ప్రిడిక్ట్​ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడతుంది.

వాటర్​ ప్రూఫ్​తో..
Boat smart ring features : బోట్​ స్మార్ట్ రింగ్​ 5ఏటీఎం ప్రెజర్​ వరకు వాటర్​ రెసిస్టెన్స్​ కలిగి ఉంటుంది. అలాగే చెమట నుంచి కూడా రెసిస్టెన్స్​ కలిగి ఉంటుంది. అందువల్ల నీటిలో ఈత కొట్టినా, హెవీ వర్కౌంట్​ చేసినా, ఈ స్మార్ట్​ పరికరానికి ఏమీ కాదు.

అదిరిపోయే యూజర్​ ఎక్స్​పీరియన్స్​
Boat smart ring health tracker : ఈ బోట్​ స్మార్ట్​ రింగ్​ మంచి యూజర్​ ఎక్స్​పీరియన్స్​ను అందిస్తుందని​ కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ రింగ్​ను బోట్​ రింగ్​ యాప్​తో సింక్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్​ సహాయంతో మీ హెల్త్ డేటాను విజువల్ రూపంలో ట్రాక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ యాక్టివిటీస్​, హెల్త్ ట్రాక్​, ప్రోగ్రెస్​ ట్రాక్​ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

పోటాపోటీగా..
Boat smart ring vs Samsung health tracker : శాంసంగ్​ ఇటీవల గెలాక్సీ రింగ్​ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బోట్ కంపెనీ తన బ్రాండ్​తో స్మార్ట్​ రింగ్​ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్కెట్​లో స్మార్ట్​ రింగ్​లకు ఉన్న క్రేజ్​ను సూచిస్తోంది.

ధర ఎంతంటే?
Boat smart ring price : బోట్ స్మార్ట్​ రింగ్ స్పెసిఫికేషన్స్​, ధర, విడుదల తేదీ​ గురించి ఇప్పటి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కానీ ఇప్పటి వరకు ఈ కంపెనీవారు తమ ప్రొడక్టులన్నింటినీ బడ్జెట్​ రేంజ్​లోనే తీసుకువచ్చారు. కనుక ఈ బోట్​ స్మార్ట్ రింగ్​ను కూడా అందుబాటు ధరలోనే తీసుకువచ్చే అవకాశం ఉంది. ఒకసారి లాంఛ్ అయిన తరువాత ఈ బోట్ స్మార్ట్​ రింగ్​.. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ సహా బోట్​ ఆన్​లైన్​ స్టోర్​లోనూ అందుబాటులో ఉంచనున్నారు.

బడ్జెట్​ ధరల్లోనే!
boat products : ప్రముఖ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్​ బ్రాండ్​ బోట్​ ఇప్పటి వరకు సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండేలా.. బడ్జెట్​ ధరల్లోనే స్మార్ట్​వాచ్​లు, ఇయర్​బడ్స్​, హెడ్​ఫోన్స్​, స్పీకర్స్​ను భారత మార్కెట్​లో లాంఛ్ చేసింది. వీటికి వినియోగదారుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. అందుకే ఇప్పుడు మార్కెట్​​ ట్రెండ్​లో ఉన్న స్మార్ట్​ రింగ్​లపై బోట్​ కంపెనీ దృష్టి సారించింది.

ABOUT THE AUTHOR

...view details