తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

జియో e-సిమ్​తో బోట్ స్మార్ట్​వాచ్ - ఇక మొబైల్​తో పనే లేదు! ధర ఎంతంటే? - latest boat smartwatch 2023

BoAt Lunar Pro LTE Smartwatch Launch In Telugu : ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్​ జియో భాగస్వామ్యంతో.. బోట్​ సంస్థ 'లూనార్​ ప్రో ఎల్​టీఈ' స్మార్ట్​వాచ్​ను త్వరలో లాంఛ్ చేయనుంది. దీని స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్, ధర తదితర వివరాలు మీ కోసం.

boAt Lunar Pro LTE smartwatch features
boAt Lunar Pro LTE smartwatch launch

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 3:50 PM IST

BoAt Lunar Pro LTE Smartwatch Launch : భారతదేశానికి చెందిన ఆడియో & వేరబుల్స్ బ్రాండ్​ 'బోట్​' (boAt) లూనార్ ప్రో ఎల్​టీఈ స్మార్ట్​వాచ్​ను త్వరలో లాంఛ్ చేయనుంది. దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భాగస్వామ్యంతో ఈ కటింగ్​-ఎడ్జ్​ స్మార్ట్​వాచ్​ను తీసుకురానుండడం విశేషం.

గేమ్ ఛేంజర్​!
'ఈ బోట్​ లూనార్​ ప్రో ఎల్​టీఈ స్మార్ట్​వాచ్​లో జియో ఈ-సిమ్​ను ఇన్​సర్ట్​ చేసుకోవచ్చు. దీని వల్ల యూజర్లు తమ వెంట స్మార్ట్​ఫోన్​ తీసుకెళ్లకున్నా అన్​లిమిటెడ్​ కనెక్టివిటీని పొందవచ్చు. అది ఎలా అంటే, ఈ బోట్​ స్మార్ట్​వాచ్​తో జియో ఈ-సిమ్​ను కనెక్ట్ చేసుకుని.. కాల్ చేయవచ్చు లేదా రిసీవ్ చేసుకోవచ్చు. మెసేజ్​లను కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ గురించి, సిగ్నెల్ స్ట్రెంగ్త్​ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కనుక ఈ స్మార్ట్​వాచ్ కచ్చితంగా​ ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది' అని బోట్ కంపెనీ చెబుతోంది.

బోట్​ లూనార్​ ప్రో ఎల్​టీఈ స్పెక్స్​
Boat Lunar Pro LTE Specifications :

  • బ్లూటూత్​ వెర్షన్​ - V5.2
  • కాలింగ్​- ఈ-సిమ్​ సెల్యూలార్​ (జియో & ఎయిర్​టెల్ సిమ్​లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అది కూడా 4జీ నెట్​వర్క్​కు మాత్రమే.)
  • వర్కింగ్ టైమ్ - 5 రోజుల వరకు పనిచేస్తుంది.
  • స్టాండ్​ బై టైమ్​- 30 రోజులు
  • స్క్రీన్ టైప్​ - అమోలెడ్​
  • స్క్రీన్ సైజ్​ - 1.39 అంగుళాలు
  • బ్యాటరీ కపాసిటీ - 577 mAh
  • వాటర్ రెసిస్టెన్స్ - ఐపీ68
  • సెన్సార్స్ - హార్ట్​ రేట్ సెన్సార్​, బ్లడ్​-ఆక్సిజన్ సెన్సార్​, బిల్ట్​-ఇన్ జీపీఎస్​
  • స్పోర్ట్స్ మోడ్స్​​- 100+ స్పోర్ట్స్ మోడ్స్ దీనిలో ఉన్నాయి.
  • ఫీచర్స్ - బ్లూటూత్​ కాలింగ్​, యాప్ నోటిఫికేషన్స్​
  • ఆండ్రాయిడ్​ & ఐవోఎస్​ వెర్షన్​ - ఆండ్రాయిడ్​ 7 అండ్ అబౌవ్ & ఐవోఎస్​ 12.0 అండ్ అబౌవ్​

స్పోర్ట్స్ సెన్సార్స్!
Boat Lunar Pro LTE Sports Sensors :ఈ బోట్​ లూనార్​ ప్రో ఎల్​టీఈ స్మార్ట్​వాచ్​లో బిల్ట్​-ఇన్​ జీపీఎస్ సిస్టమ్​ ఉండడం వల్ల మీరు పయనించిన రూట్​ను ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్​వాచ్​లో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్​లు ఉంటాయి. కనుక రన్నింగ్​, సైక్లింగ్​, హైకింగ్ లాంటి యాక్టివిటీస్​ను కూడా చాలా చక్కగా ట్రాక్ చేసుకోవచ్చు.

హెల్త్ మోనటరింగ్ టూల్స్!
Boat Lunar Pro LTE Health Monitoring Tools :ఈ బోట్​ స్మార్ట్​వాచ్​లో హార్ట్​ రేట్​, బ్లడ్-ఆక్సిజన్ మోనిటర్, స్లీప్​ ట్రాకర్​, ఫిట్​నెస్ ట్రాకర్​ లాంటి చాలా హెల్త్​ మోనటరింగ్ టూల్స్ ఉంటాయి. హెల్త్, ఫిట్​నెస్​ ఫ్రీక్స్​కు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

Boat Lunar Pro LTE Price :బోట్ కంపెనీ ఈ నయా లూనార్​ ప్రో ఎల్​టీఈ స్మార్ట్​వాచ్​ ధరను వెల్లడించలేదు. అయితే మరికొన్ని వారాల్లోనే దీనిని సేల్​కు తెచ్చే అవకాశం ఉంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్​ బ్యాటరీ లైఫ్ పెరగాలా? ఈ 14 సూపర్​ టిప్స్​ పాటిస్తే చాలు!

అదిరే ఫీచర్లతో రెడ్​మీ 13సీ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంఛ్​ - ధర ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details