ప్లే స్టోర్‌లో ప్రమాదకరమైన మాల్‌వేర్ యాప్‌లను గుర్తించి ఎప్పటికప్పుడు గూగుల్ నిషేధం విధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మరో ఐదు యాప్‌లను తొలగించింది. ఇవి స్పైవేర్ యాప్‌లుగా పనిచేస్తూ మొబైల్‌లోని ఇతర యాప్‌ల నుంచి డేటాను తస్కరిస్తున్నాయట. ఇవి మీ మొబైల్‌లో ఉంటే అన్ ఇన్‌స్టాల్ చేసేయండి.
ఈ యాప్స్ ఉన్నాయా?
PIP Pic Camera Photo Editor: పీఐపీ పిక్ కెమెరా ఫొటో ఎడిటర్ యాప్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్. ఇందులోని మాల్‌వేర్ ఫేస్‌బుక్ లాగిన్ వివరాలను దొంగలిస్తోందట. దీనిని పది లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం.
Wild & Exotic Animal Wallpaper: వైల్డ్ అండ్ ఎక్సోటిక్ యానిమల్ వాల్‌పేపర్ యాప్‌లో మాస్క్వెరేడింగ్ అనే యాడ్‌వేర్ ఉంటుంది. ఇది మొబైల్‌లోని ఇతర యాప్‌ల ఐకాన్‌ను, పేరును మారుస్తుంది. దానివల్ల సమస్యలు వస్తాయి. ఇక ఈ యాప్‌ను 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారట.
Zodi Horoscope – Fortune Finder: జోడి హారోస్కోప్ - ఫార్చ్యూన్ ఫైండర్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోకి ప్రవేశించిన మాల్‌వేర్ ఫేస్‌బుక్ ఖాతా వివరాలను తస్కరిస్తోంది. దీన్ని కూడా 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారట.
PIP Camera 2022: కెమెరాను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు 'పీఐపీ కెమెరా 2022' యాప్‌ను వాడుతుంటారు. ఈ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించగానే అందులోని మాల్‌వేర్ ద్వారా ఫేస్‌బుక్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తోంది. ఈ యాప్‌ను 50 వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం.