తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Best Ways to Detect Unknown Tracker on Your Android : మీ ఫోన్​ను ఎవరైనా ట్రాక్ చేస్తున్నారా? ఇలా పట్టేయండి! - మీ ఆండ్రాయిడ్​లో తెలియని ట్రాకర్స్ కనిపెట్టండిలా

Best Ways to Detect Unknown Tracker on Your Android : మీ ఫోన్​ను మీకు తెలియకుండా ఎవరైనా ట్రాక్ చేస్తున్నారనే అనుమానం ఉందా? నో టెన్షన్! చాలా సింపుల్​గా ఈ టెక్నిక్స్​తో మీ ఆండ్రాయిడ్ ఫోన్​ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో ఈజీగా తెలుసుకోండి!

Best Ways to Detect Unknown Tracker on Your Android
Best Ways to Detect Unknown Tracker on Your Android

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 2:17 PM IST

Best Ways to Detect Unknown Tracker on Your Android in Telugu :టెక్నాలజీతో జీవితాలు ఎంత స్మార్ట్‌గా మారిపోయాయో.. మోసాలు, ప్రమాదాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. మన ఫోన్ మన చేతిలోనే ఉంటుంది.. ఆపరేటింగ్ మాత్రం వేరే ఎవరో చేస్తుంటారు. మనం ఎక్కడికో వెళ్తుంటాం.. మన వెంట నడవకుండానే ఎవరో మన ఫోన్ ను ట్రాక్ చేయడం ద్వారా మనల్ని ఫాలో అవుతుంటారు! ఇంకా కొందరైతే ఫోన్​లోనే పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంకింగ్ వివరాలు, ఫొటోలు, వీడియోలు అన్నింటినీ సేవ్ తీసుకుంటారు. వివిధ అవసరాల నిమిత్తం స్మార్ట్​ఫోన్​ల(Smart Phones)లలో రకరకాల థర్డ్ పార్టీ యాప్స్ ఇన్​స్టాల్ చేసుకోవడం ద్వారా.. ఈ సమస్య వస్తుంది.

How to Detect Unknown Tracker on Your Android in Telugu : థర్డ్‌ పార్టీ యాప్స్‌.. మీ ఫోన్​కు సంబంధించిన సమాచారం అవసరం లేకున్నా ఆండ్రాయిడ్ డేటాను ట్రాక్‌ చేస్తుంటాయని, దీని వల్ల యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతుందని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఈ నేపథ్యంలో మీ ఫోన్​ను మీకు తెలియకుండా ఎవరైనా ట్రాక్(Phone Tracking) చేస్తున్నారో అని అనుమానంగా ఉందా? అది ఎలా తెలుస్తుందని ఆందోళన చెందుతున్నారా? మరేం ఫర్వాలేదు.. కొన్ని సింపుల్​ ట్రిక్స్​తో.. మిమ్మల్ని వెంటాడేవారిని ఇట్టే పట్టేయొచ్చు.

How to find Unknown Tracker Through Android Unkown Trackers Alerts :

Android అన్‌కౌన్ ట్రాకర్స్ హెచ్చరికల ద్వారా తెలుసుకోండిలా..

  • మొదట మీరు మీ Android ఫోన్‌లో సెట్టింగ్‌లకు వెళ్లి Safety and Emergency నావిగేట్ అవ్వాలి.
  • ఆ తర్వాత Safety and Emergency విభాగంలో Unknown Tracker Alertsఅనే దాంట్లోకి వెళ్లాలి.
  • ఆపై సమీపంలోని ట్రాకర్‌లను గుర్తించే టోగుల్ ఎనేబుల్​లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే దాని ఆన్​లో పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత సమీపంలోని ఏవైనా ట్రాకర్‌ల కోసం మాన్యువల్‌గా సెర్చ్​ చేయడానికి Scan Now అనే ఆప్షన్​పై నొక్కాలి.
  • అప్పుడు మీ చుట్టూ లొకేట్ అయిన ట్రాకర్‌ను గుర్తించడానికి Play Soundని నొక్కాలి.
  • ఆ తర్వాత మీరు ట్రాకర్, యజమాని వివరాలను ట్యాప్ చేసి పొందడానికి మీ ఫోన్‌లోని NFC చిప్‌ని ఉపయోగించవచ్చు.
  • ఇక చివరగా మీకు ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, మీ భద్రత కోసం ట్రాకర్‌ను నిలిపివేయడానికి సూచనలను అనుసరించండి.

Android Phones Security Risk : ఆండ్రాయిడ్ యూజర్స్​కు అలర్ట్​.. ఫేక్​ టెలిగ్రామ్​, సిగ్నల్​ యాప్స్​తో​.. జర జాగ్రత్త!

How to Detect Unknown AirTag on Your Android use Tracker Detect App :

ట్రాకర్ డిటెక్ట్ యాప్ ఉపయోగించి మీ ఫోన్​లో అన్‌ నౌన్ ఎయిర్​ట్యాగ్ తెలుసుకోండిలా..

  • మొదట మీరు Google Play స్టోర్ నుంచి ట్రాకర్ డిటెక్ట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి.. నిబంధనలు, షరతులకు అంగీకరించాలి.
  • అలాగే యాప్ అమలు కావడానికి అవసరమైన బ్లూటూత్ పర్మిషన్ అనుమతించాలి.
  • ఆ తర్వాత సమీపంలోని ఏదైనా ఎయిర్‌ట్యాగ్‌ని గుర్తించడానికి స్కాన్​పై నొక్కాలి. అది మీ ఫోన్​ను సమర్థవంతంగా ట్రాక్ చేస్తుంది.
  • అప్పుడు ఏదైనా తెలియని ఎయిర్‌ట్యాగ్ మీకు దగ్గరగా ఉంటే.. మీరు దానిని సెర్చ్ చేయడానికి, నిలిపివేయడానికి 10 నిమిషాల తర్వాత ప్లే సౌండ్​ని రింగ్ చేయవచ్చు.
  • ఇలా సింపుల్​గా మీరు మీ ఫోన్​లో తెలియని ట్రాకర్​ను కనుగొనవచ్చు.

ఎయిర్‌గార్డ్ ఎయిర్‌ట్యాగ్ ప్రొటెక్షన్ యాప్ ద్వారా అన్‌ నౌన్ ట్రాకర్స్ తెలుసుకోండిలా..

How to Detect Unknown Tracker on Android use AirGuard AirTag Protection App :AirGuard అనేది Apple ట్రాకర్ డిటెక్ట్ యాప్‌నకు ముందు విడుదలైనటువంటి యాప్. ఇది కేవలం ఎయిర్‌ట్యాగ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర స్మార్ట్ ట్యాగ్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. ఇది మీ Android ఫోన్‌లో వినియోగదారు గోప్యత, భద్రతకు బాగా యూజ్ అవుతుంది.

  • మీ ఫోన్‌లో ముందుగా Google Play Store నుంచి AirGuard యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
  • ఆ తర్వాత యాప్​ను లాంఛ్ చేసి.. Welcome స్క్రీన్​ను స్క్రోల్ చేస్తూ Required permissions అనే దానిని అనుమతించి యాప్ అమలును ప్రారంభించాలి.
  • అనంతరం యాప్ డ్యాష్‌బోర్డ్ నుంచి స్కాన్ ట్యాబ్‌కు మారాలి. ఆపై సమీపంలోని స్మార్ట్ ట్రాకర్‌లు, ఇతర పరికరాలను గుర్తించడానికి Bluetooth Permission Allow చేయాలి.
  • ఆ తర్వాత మీరు Play బటన్​ను రింగ్ చేయడం ద్వారా సమీపంలోని ఎయిర్‌ట్యాగ్‌ అక్కడ లొకేట్ అవుతుంది.

ఈ యాప్ ద్వారా ట్రాకర్ లాగ్‌ చివరి స్థానం వరకు డిస్​ప్లే అవుతుంది. ఇది మీ పొరుగువారి ట్యాగ్ కాదని నిర్ధారించుకోవడానికి యాప్ వేర్వేరు స్థానాల్లో ట్యాగ్‌ని 3 సార్లు గుర్తించినట్లయితే హెచ్చరికను కూడా ఇస్తుంది. అలాగే ఈ యాప్ మీ చుట్టూ ఉన్న ఇతర రకాల స్మార్ట్ బ్లూటూత్ ట్రాకర్‌లను కూడా ట్రాక్ చేయగలదు.

How to Turn off Business Ads in Google Maps : గూగుల్ మ్యాప్స్​లో యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా?.. ఇలా ఆపేయండి!

How To Find A Lost Or Stolen Phone In 2023 : మీ స్మార్ట్​ఫోన్​ను పోగొట్టుకున్నారా?.. సింపుల్​గా కనిపెట్టేయండిలా!

How To Check My Device Is Hacked Or Not : మీ ఫోన్​ హ్యాక్​​ అయ్యిందని అనుమానంగా ఉందా?.. ఒక్క నిమిషంలో కనిపెట్టేయండి!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details