Best Smartwatch Under 2000 :నేటి యువత స్మార్ట్‌వాచ్‌లు ధరించడానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ఈ స్మార్ట్‌వాచ్‌లు చూడడానికి మంచి స్టైలిష్ లుక్‌లో ఉండడమే కాదు.. ఫిట్నెస్, హెల్త్ ట్రాకింగ్లకు కూడా బాగా ఉపయోగపడతున్నాయి. మరి ఈ పండుగ సీజన్లో మీరు కూడా బడ్జెట్లో మంచి స్మార్ట్‌వాచ్ కొనాలని ఆశిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో టాప్ బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్‌లు రూ.2000 బడ్జెట్లోనే లభిస్తున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
BoAt Wave Call Smart Watch Features :
ఈ బోట్ స్మార్ట్‌వాచ్‌లో 1.69 అంగుళాల ఫుల్ హెచ్డీ టచ్ డిస్ప్లే ఉంది. ఈ వాచ్ డీప్ బ్లూ, యాక్టివ్ బ్లాక్, కరేబియన్ గ్రీన్, మౌవ్ అనే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ముఖ్యంగా దీనిలో బిల్ట్-ఇన్-స్పీకర్, బ్లూటూత్ ఫీచర్స్ ఉన్నాయి. బోట్ కంపెనీ దీనినే 'వేవ్ కాల్' ఫీచర్ అంటోంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్యాటరీ లైఫ్ 2 రోజులు ఉంటుంది. అయితే బ్లూటూత్ కాల్స్ చేయకపోతే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ బోట్ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్ మోనిటర్, స్లీప్ ట్రాకర్, SP2O ట్రాకర్ లాంటి ఎన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే రన్నింగ్, సైక్లింగ్, క్లైంబింగ్, యోగా లాంటి ఎన్నో స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.
BoAt Wave Call Smart Watch Price :
ఈ బోట్ స్మార్ట్‌వాచ్ ధర మార్కెట్లో రూ.7,990 వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో 80% డిస్కౌంట్‌తో, కేవలం రూ.1,599కే లభిస్తోంది.
Noise ColorFit Pulse Spo2 Smart Watch Specs :
ఈ నోయిస్ స్మార్ట్‌వాచ్‌లో 1.4 అంగుళాల ఫుల్ హెచ్డీ టచ్ డిస్ప్లే ఉంది. దీని బ్యాటరీ లైఫ్ 10 రోజులు ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లు రెండింటికీ కంపాటిబిలిటీ కలిగి ఉంది. ఈ నోయిస్ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్ మోనిటర్, స్లీప్ ట్రాకర్, SP2O ట్రాకర్ సహా ఎన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
Noise ColorFit Pulse Spo2 Smart Watch Price :
నోయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్ ధర మార్కెట్లో రూ.4,999 వరకు ఉంటుంది. కానీ అమెజాన్‌లో ఇది ప్రస్తుతం రూ.2,199కే అందుబాటులో ఉంది.
Zebronics Drip Smart Watch Features :
ఈ జెబ్రోనిక్స్ స్మార్ట్‌వాచ్ లైట్‌వెయిట్ మెటల్ బాడీతో వస్తుంది. దీనిలోని వాయిస్ అసిస్టెంట్.. ఐఓఎస్ సహా, ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిలోని 250mAh బిల్ట్-ఇన్ బ్యాటరీని ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 రోజులు పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో హార్ట్ రేట్, Spo2, స్లీప్ మానిటర్ సహా అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి.