తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Phones Under 25000 : రూ.25వేలకే బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్లు.. ఫీచర్స్​ అదుర్స్​.. మీరూ ఓ లుక్కేయండి!

Best Smartphones Under 25000 : తక్కువ బడ్జెట్​లో అదిరిపోయే ఫీచర్స్​తో బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్​ల కోసం వెతుకుతున్నారా..? అయితే వీటిని తమ వినియోగదారుల కోసం కేవలం రూ.25 వేలకే అందుబాటులో ఉంచాయి ప్రముఖ మొబైల్​ కంపెనీలు. మరి ఆ కంపెనీలు అందిస్తున్న మోడళ్లు ఏంటి, వాటి స్పెక్స్​ అండ్​ ఫీచర్స్​ సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Best smartphones under Rs 25,000
రూ.25వేలకే బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్లు.. ఫీచర్స్​ అదుర్స్​.. ఆలస్యమెందుకు..?

By

Published : Aug 3, 2023, 7:16 PM IST

Best Smartphones Under 25000 : కొందరు ఫోన్ల కొనుగోలుకు సంబంధించి బడ్జెట్​ విషయంలో అస్సలు ఆలోచించరు. కొన్ని ఏళ్లపాటు వాడే గ్యాడ్జెట్​ కావడం వల్ల వేలు పోసి మరీ కొంటుంటారు. ఈ క్రమంలో డబ్బులు కొంత ఎక్కువైనా సరే అదిరిపోయే ఫీచర్స్, లాంగ్​ లైఫ్​ స్పాన్​​తో పాటు బ్రాండెడ్​ కంపెనీల ఫోన్ల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి వారి కోసమే పలు ప్రముఖ​ మొబైల్​ కంపెనీల నుంచి​ బ్రాండెడ్​ మొబైల్​ ఫోన్​లు​ అందుబాటులో ఉన్నాయి. అది కూడా కేవలం రూ.25వేల బడ్జెట్​లోనే వీటిని తమ వినియోగదారులకు అందిస్తున్నాయి.

లావా అగ్ని 2 5జీ ఫీచర్స్..
Lava Agni 2 5G : లావా అందిస్తున్న అత్యుత్తమ స్మార్ట్​ఫోన్​లలో Lava Agni 2 5G ఒకటి. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో ఈ ఫోన్​ను విడుదల చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మల్టీ టాస్కింగ్​ చేసుకునే ర్యామ్​ను అమర్చారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల కర్వ్​డ్​ అమోలెడ్ డిస్‌ప్లే ఈ మొబైల్​లో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. 67వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​తో కేవలం 16 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్​ చేసుకోవచ్చు. దీన్ని రూ.22,000 నుంచి రూ.25,000 లోపే అందిస్తోంది లావా. మల్టీమీడియా వినియోగానికి, గేమింగ్‌కు ఈ మోడల్​ను సరైన ఎంపికగా చెప్పవచ్చు. దీంతో పాటు ఫోన్​లోని కెమెరా సెటప్​​ను అద్భుతంగా తీర్చిదిద్దారు. రియర్​, సెల్ఫీ మోడ్​లో ఫొటోలు, వీడియోలను మంచి క్లారిటీతో క్యాప్చర్ చేయవచ్చు. నాజుగ్గా ఉండే ఈ మోడల్​ లైఫ్​స్పాన్​ కూడా దీర్ఘకాలంగా ఉంటుంది. దీంతో మీరు ఓ ప్రీమియం ఫోన్​ను వాడుతున్న అనుభూతిని పొందుతారు.

శామ్​సంగ్​ గెలాక్సీ ఎమ్​33 5జీ స్పెక్స్​ అండ్​ ఫీచర్స్..
Samsung Galaxy M33 5G : శామ్‌సంగ్​ గెలాక్సీ ఎమ్​33 5జీలోని ప్రత్యేకత ఏంటంటే.. 5ఎన్​ఎమ్​ ఎక్సినోస్​ 1280 ఎస్​ఓసీతో దీని బ్యాటరీని జత చేశారు. రూ.25 వేలలోపే లభిస్తున్న ఈ మోడల్​లో 6000 ఎంఏహెచ్ సామర్థ్యం గల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్​ను ఇస్తున్నారు. ఇదే ధర శ్రేణిలోని మిగతా ఫోన్లలో ఇలాంటి బ్యాటరీ ప్రత్యేకత లేదు. Samsung Galaxy M33 5Gలో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.60 అంగుళాల సూపర్​ అమోలెడ్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఈ ధర శ్రేణిలో అత్యుత్తమ డిస్​ప్లేను అందిస్తున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది శామ్​సంగే. అంతేకాకుండా ఇందులోని OneUI సాఫ్ట్‌వేర్​, కెమెరా క్వాలిటీ, పనితీరు యూజర్​కు గొప్ప అనుభవాన్ని అందిస్తుంది. మొత్తంగా లాంగ్​లాస్టింగ్​ బ్యాటరీలైఫ్​, సూపర్​ క్వాలిటీ ఫోటోలు వీడియోలు, బడ్జెట్​ ఫ్రెండ్లీలో ఫోన్​ కోసం వెతుకుతున్న వారికి Samsung Galaxy M33 5G ఒక్క చక్కటి ఎంపిక.

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 3 లైట్​ 5జీ స్పెక్స్​ అండ్​ ఫీచర్స్..
OnePlus Nord CE 3 Lite 5G : అత్యంత తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్​తో స్మార్ట్​ఫోన్​ అనుభవాన్ని పొందే ఫోన్​ ఆప్షన్స్​లో వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 3 లైట్​ 5జీ మోడల్ ఒకటి. వన్​ప్లస్​ ప్రీమియం గ్యాడ్జెట్​ నార్డ్ 3 మోడల్​లో ఉన్న డిజైన్‌ను ఇందులో చూడవచ్చు. ముఖ్యంగా వెనక నుంచి ఈ రెండు సరిపోలి ఉంటాయి. గ్రీన్​ కలర్​ ఈ మోడల్​కు మరింత స్టైలిష్​ లుక్​ను జోడించింది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల ఎల్​సీడీ డిస్​ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రత్యేకతలు ఫాస్ట్​ యూజర్​ అనుభవాన్ని కలిగిస్తుంది. 67వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ ఇందులోని మరో స్పెషాల్టి. ఆక్సిజన్​ 13.1 ఓఎస్​పై ఇది పనిచేస్తుంది. దీని ఇంటర్​ఫేస్​ను కూడా యూజర్​ ఫ్రెండ్లీగా తయారు చేశారు. మొత్తంగా మీరు తక్కువ ఖర్చుతో ఆకట్టుకునే పనితీరును కోరుకుంటే OnePlus Nord CE 3 Lite 5G మీకు బెస్ట్​ ఆప్షన్​గా ఉంది. 8జీబీ ర్యామ్​ వెర్షన్​తో వచ్చిన దీని ధర రూ.22,000గా ఉంది.

పోకో X5 ప్రో 5జీ స్పెక్స్​ అండ్​ ఫీచర్స్..
Poco X5 Pro 5G : ఆకట్టుకునే డిజైన్​తో ఉండే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్​లలో Poco X5 Pro 5G ఒకటి. ఎల్లో, ఆరిజిన్​ బ్లూ, ఆస్ట్రల్​ బ్లాక్​ కలర్స్​లో ఇది అందుబాటులో ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒకేసారి మల్టీ టాస్కింగ్​ చేసే విధంగా అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తుంది. 108 మెగాపిక్సల్​ కలిగిన కెమెరాలు మంచి లైటింగ్​లో అద్భుతమైన పిక్చర్స్​ను క్యాప్చర్​ చేస్తాయి. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 6.67 అంగుళాల స్మూత్​ డిస్​ప్లే కలిగిన ఈ మోడల్​ మల్టీమీడియా ప్రియులకు గొప్ప విజువల్స్​ క్వాలిటీని అందిస్తుంది. మంచి బేస్​ సౌండ్​ను అందించే స్టీరియో స్పీకర్లను ఇందులో వాడారు. దీంతో ఆడియో క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా వినిపిస్తుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా IP53 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుంచి ఇది అదనపు రక్షణను కల్పిస్తుంది. మొత్తంగా రూ.25,000లోపు స్టైలీష్​, హై-పెర్ఫార్మెన్స్​, మీడియా-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్​ కోసం చూస్తున్న వారికోసం Poco X5 Pro 5G అద్భుతమైన ఎంపిక. గ్యాడ్జెట్​ పనితీరు, మల్టీమీడియా ఫీచర్స్​, స్టైల్​ తదితర అంశాల్లో ఈ మోడల్​ యూజర్​ అవసరాలను తప్పక తీరుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details