Best Smartphone Cleaning Tips : నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి జీవనంలో స్మార్ట్‌ఫోన్ ఓ భాగమైపోయింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వీటిని వాడుతున్నారు. అయితే ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది స్మార్ట్‌ఫోన్(SmartPhones)లను నిరంతరాయంగా ఉపయోగిస్తుంటారు. కానీ వాటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయడంలో అశ్రద్ధ వహిస్తుంటారు. దాంతో ఫోన్లో ఉండే స్పీకర్ నుంచి ఛార్జింగ్ పోర్ట్ వరకు విపరీతంగా దుమ్ము, ధూళి, ఇతర మలినాలు పేరుకుపోతాయి. ముఖ్యంగా స్పీకర్లో బ్యాక్టీరియా, క్రీములు భారీ మొత్తంలో పేరుకుపోవడం వల్ల మీ మొబైల్ స్పీకర్ త్వరగా పాడైపోతుంది. అలాగే ఫోన్ మాట్లాడేటప్పుడు మీ వాయిస్ సరిగ్గా వినపడకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
How to Clean Smartphone Screen in Telugu :అయితే మీ స్మార్ట్‌ఫోన్‌ను రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవడం ద్వారా అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. చాలా మంది ఇది పెద్ద ప్రాసెస్‌గా భావిస్తారు. అదేమి లేదు ఈజీగా స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేసుకునే కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటి ద్వారా చాలా సులువుగా తక్కువ సమయంలో ఫోన్‌ను శుభ్రపర్చుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Mobile Cleaning Tips in Telugu :మీ స్మార్ట్‌ఫోన్ ఇయర్ స్పీకర్‌ను శుభ్రం చేయడానికి ఆల్కహాల్‌లో ముంచిన మైక్రోఫైబర్ క్లాత్‌తో స్పీకర్‌ను జాగ్రత్తగా తుడవండి. ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచే వరకు జాగ్రత్తగా, సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత ఇంకా ఏదైనా దుమ్ము ఉంటే దానిని తీయడానికి ఓపెనింగ్ వద్ద మెల్లగా ఊదండి. ఆపై ఆ ప్రాంతాన్ని మళ్లీ తుడవండి. ఇలా కాకుండా మీరు మీ ఫోన్ స్పీక్ర్ను కింద పేర్కొన్న విధంగానూ సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చు. అయితే దీనికి డిష్ వాషింగ్ ద్రవం, మృదువైన బ్రిస్టల్ టూత్ బ్రష్, వాడిన టూత్ బ్రష్ లాంటివి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా స్మార్ట్‌ఫోన్ స్పీకర్ క్లీన్ చేసుకోవాలో చూద్దాం..
How to buy Second Hand Phone Legally? : సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా.. ఈ విషయం తెలుసా..?!
How to Clean Smartphone Speaker in Telugu :
- మొదట మీరు ఫోన్ స్పీకర్ శుభ్రపరిచే ముందు మీ చేతులను హ్యాండ్ వాష్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత టవల్‌తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఆపై మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి.
- ముందుగా మీరు మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయాలి. ఎప్పుడు ఫోన్ ఆన్‌లో ఉన్నప్పుడు దానిని క్లీన్ చేయకపోవడం మంచిది. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాక ప్రాసెస్ స్టార్ట్ చేయండి.
- ఇప్పుడు మీరు వాడిన లేదా కొత్త టూత్ బ్రష్ తీసుకోండి. చిన్నగా ఉండే బ్రష్(ప్లిలల టూత్ బ్రష్) తీసుకుంటే క్లీన్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది.
- మీ ఫోన్ స్పీకర్ పోర్ట్‌ను గుర్తించి ఆ ప్రాంతంలో మీరు ఎంచుకున్న టూత్ బ్రష్‌తో ఎక్కువ బలవంతంగా రుద్దకుండా సున్నితంగా స్క్రబ్ చేయండి. అన్ని ధూళి కణాలు పూర్తిగా క్లియర్ అయ్యే వరకు పోర్ట్ ప్రాంతాన్ని బ్రష్ చేయండి.
- అన్ని మలినాలు తొలగిపోయాయని చెక్ చెసుకున్న తర్వాత ఓసారి మీ ఫోన్‌ను సున్నితంగా కదిలించండి. అలా చేయడం ద్వారా ఇంకా ఏదైనా దుమ్ము, ధూళి మిగిలిపోతే దానిని తొలగించవచ్చు. ఇది తప్పనిసరిగా చేయాలి.
- పైన పేర్కొన్న విధంగా క్లీన్ చేశాక మీరు చేయాల్సిన తదుపరి పని ఫోన్‌ను శుభ్రంగా క్లాత్‌తో తుడవడం. దాని ద్వారా ఫోన్ గ్లాస్ మీద ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ అవుతుంది.
- అయితే దానికిముందు ఒక చుక్క డిష్‌వాషింగ్ లిక్విడ్‌ని నీటితో కలిపి మీరు వాడే క్లాత్‌ను అందులో ముంచి వాటర్ లేకుండా దానిని పిండి ఆపై ఫోన్‌ను శుభ్రంగా తుడవాలి. డిష్‌వాషింగ్ లిక్విడ్ మలినాలను పూర్తిగా తొలగిస్తుంది.
- ఇలా మీ ఫోన్‌ను తుడిచాక ఆపై మెత్తటి పొడి క్లాత్‌తో తడి క్లాత్‌తో తుడిచిన ప్రాంతంలో క్లీన్‌గా మరోసారి తుడవాలి. అలా చేయడం ద్వారా ఇంకా ఏదైనా డస్ట్ ఉంటే క్లియర్ అవుతుంది.
- అలాగే మీ స్మార్ట్‌ఫోన్‌కు ఉండే హెడ్‌ఫోన్ జాక్‌ని క్లీన్ చేసుకోవాలి. ఒక సన్నని కాటన్ బడ్ని తీసుకొని జాక్ హోల్ లోపలకి పెట్టి ప్రతివైపు కిందికి పైకి తిప్పాలి. అలాగే దానిని బయటకు తీసేటప్పుడు తిప్పుతూ తీయండి. మొత్తం మలినాలు పోయేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగించండి.
- మీ ఫోన్ స్పీకర్ ఉపరితలాన్ని క్లీన్ చేసేటప్పుడు మెత్తటి వస్త్రాన్ని ఉపయోగించి శుభ్రపరచడం అలవాటు చేసుకోండి. అలాగే, స్పీకర్‌ను దుమ్ము ధూళి నుంచి రక్షించడానికి రూపొందించబడిన నాణ్యమైన ఫోన్ కేస్‌ను కొనుగోలు చేయండి.
- ఇలా సింపుల్‌గా పైన పేర్కొన్న విధంగా ప్రతి వారం లేదా నెలవారీగా మీ ఫోన్‌ను శుభ్రం చేసుకోవడం ద్వారా స్పీకర్, హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్ట్, ఫోన్ స్క్రీన్, కెమెరా(Camera)లాంటివి కొత్తగా ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
Amazon Great Indian Festival 2023 : స్మార్ట్‌ఫోన్స్‌పై 49%, ల్యాప్‌టాప్స్‌పై 45% వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కిరాక్ డీల్స్!
How to Activate DND in Mobile Networks : స్పామ్ కాల్స్ వేధిస్తున్నాయా..? వాటి నోరు మూసేయండిలా!
What Not to Do on Your Office Computer : ఆఫీస్ ఫోన్, కంప్యూటర్ వాడుతున్నారా?.. ఈ పనులు అస్సలు చేయకండి!