గత కొంత కాలంగా ఫిట్నెస్ ట్రాకర్స్ లేదా స్మార్ట్ బ్యాండ్స్(Smart band) ఉపయోగం చాలా పెరిగింది. బడ్జెట్ ధరల్లో ఫిట్నెస్ ట్రాకర్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు అనుగుణంగా మార్కెట్లో పలు కంపెనీలు బ్యాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
భారత్‌లో షియోమీ, హానర్, అమేజ్‌ఫిట్.. ఇలా పలు బ్రాండ్లు ఈ విభాగంలో పోటీ పడుతున్నాయి. ప్రీమియం ఫోన్లు తయారీ కంపెనీ వన్ ప్లస్ కూడా ఫిట్నెస్ బ్యాండ్‌ను విడుదల చేసింది.
స్మార్ట్ బ్యాండ్లు కేవలం ఫిట్నెస్ను ట్రాకింగ్ చేయటమే కాకుండా నిద్ర నాణ్యత, హృదయ స్పందనను మానిటర్ చేయటం, ఫోన్ నోటిఫికేషన్స్‌ను చూపించటం లాంటివి చేస్తున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కూడా వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
మరి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్, బడ్జెట్ స్మార్ట్ బ్యాండ్ల గురించి ఇప్పుడు చూద్దాం.
ఎంఐ స్మార్ట్ బ్యాండ్
ఫిట్నెస్ బ్యాండ్లలో అందుబాటు ధరల్లో మంచి బ్యాండ్ ఇది. డిస్ప్లే, హృదయ స్పందన ట్రాకింగ్, అప్డేటెడ్ ఛార్జింగ్ సెటస్, బరువు తక్కువ ఉండటం, మంచి బ్యాటరీ లైఫ్ ఈ బ్యాండ్‌కు అనుకూలతలు.
ఫీచర్లు
- 1.1 అంగుళాల ఆమోలోడ్ డిస్ప్లే
- కంపాటిబిలిటీ: ఐఓఎస్, ఆండ్రాయిడ్
- బ్యాటరీ: 14 రోజులు (ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే)
- ఐపీ రేటింగ్ : 5 ఏటీఎం వాటర్ ప్రూఫ్
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5.0 ఎల్ఈ
- ఎస్పీ O2: లేదు
- ధర : రూ 2,499
హనర్ బ్యాండ్ 6
ఇది హానర్ వాచ్ ఈఎస్‌ను పోలి ఉంటుంది. కానీ వాటితో పోల్చితే.. డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. డిజైన్ పరంగా చూసుకుంటే తక్కువ బరువు ఉంటుంది. జీపీఎస్ లేమి, స్లీప్ ట్రాకింగ్‌లో లోపాలు ఈ బ్యాండ్ మైనస్ పాయింట్లని చెప్పుకోవచ్చు.
ఫీచర్లు
- 1.47 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే
- కంపాటిబిలిటీ : ఐఓఎస్, ఆండ్రాయిడ్
- బ్యాటరీ: 14 రోజులు (ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే)
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5
- ఐపీ రేటింగ్ : 5 ఏటీఎమ్ వాటర్ ప్రూఫ్
- ఎస్పీ O2 : ఉంది.
- ధర : రూ. 3,999