Best Phones Under 20000: భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం సంస్థలు అడుగులు వేస్తున్నాయి. అందుకు తగినట్టే ఇప్పటికే అనేక మొబైల్ తయారీ సంస్థలు 5జీ సపోర్ట్ చేసే అనేక మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అద్భుతమైన ఫొటోలు తీసుకునేందుకు వీలు కల్పించేలా వెనుకవైపు కనీసం 3 కెమెరాలు, రోజంతా పనిచేసేంత సామర్థ్యమున్న బ్యాటరీ, మరెన్నో ఫీచర్లతో కొనుగోలుదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. రూ.20వేల బడ్జెట్లో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 స్మార్ట్‌ఫోన్స్ వివరాలు చూస్తే..
OnePlus Nord CE 2 Lite:
- వన్‌ప్లస్ నుంచి రూ.20వేలకన్నా తక్కువ ధరతో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్.
- ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్, స్నాప్‌డ్రాగన్ 695 5జీ చిప్సెట్, 120హెర్జ్ ఎఫ్‌హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్.
- ఈ మొబైల్‌కు వెనుకవైపు 64 మెగా పిక్సల్ కెమెరాతోపాటు రెండు 2 మెగా పిక్సల్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సల్ కెమెరా ఇచ్చింది వన్‌ప్లస్.
- 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ మొబైల్లో ఉంటుంది.
- రూ.20వేలకు 6జీబీ/128జీబీ వేరియంట్ మాత్రమే లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ ర్యామ్ కావాలంటే బడ్జెట్‌ను కాస్త పెంచాల్సిందే.
Redmi Note 11 Pro/ Pro+:
- 6.67 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ 120హెర్జ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో వస్తుంది రెడ్మీ నోట్ 11 ప్రో.
- రెడ్మీ నోట్ 11 ప్రో 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేయదు.
- వెనుక వైపు 108 ఎంపీ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంటాయి. ముందువైపు 16 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది.
- ఇంట్లోని స్మార్ట్ అప్లయన్సెన్స్ కంట్రోల్ చేసేందుకు వీలుగా రెడ్మీ నోట్ 11 ప్రోలో షావోమీ ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది.
- 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ పీడీ, క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 రెడ్మీ నోట్ 11 ప్రో ప్రత్యేకతలు.
- 5జీని సపోర్ట్ చేసే స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్తో రెడ్మీ నోట్ 11 ప్రో+ కూడా అందుబాటులో ఉంది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.20,999.