తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

రూ.15వేలలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు ఇవే! - Samsung Galaxy M21

Best Mobile Under 15000: స్మార్ట్​ఫోన్​ కొనాలనుకునే వారికి ప్రస్తుతం చాలా ఆప్షన్​లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లు కూడా తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి. ఇలా ప్రస్తుతం మార్కెట్లో రూ.15వేలకే అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్​ఫోన్ల ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం..

smartphones under 15000
best mobile under 15000 in india 2022

By

Published : Apr 25, 2022, 12:22 PM IST

Best Mobile Under 15000: తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ల కోసం చాలా మంది చూస్తుంటారు. అలాంటి వారినే దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరల్లో పలు కంపెనీలు కొన్ని మొబైల్స్‌ను విడుదల చేశాయి. ఫీచర్లతోపాటు బడ్జెట్‌ పరంగా ది బెస్ట్‌ అనిపించుకున్నాయి. మరి ఆ స్మార్ట్‌ఫోన్ల వివరాలు? వాటి ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం..

పోకో ఎం4 ప్రో (Poco M4 Pro)

పోకో ఎం4 ప్రో

పోకో ఎం4 ప్రో 5జీ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డాట్‌ డిస్‌ప్లే ఇచ్చారు. మిడిటెక్‌ డైమన్‌సిటీ 810 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6జీబీ ర్యామ్‌+ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఫోన్లను కంపెనీ తయారు చేసింది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనకవైపు 50ఎంపీ, 8ఎంపీ ఆల్ట్రా వైడ్‌ సెన్సర్‌ను ఇచ్చారు. ముందువైపు సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరాను అమర్చారు. దీని ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం21 (Samsung Galaxy M21)

శాంసంగ్‌ గెలాక్సీ ఎం21

శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌లో ఎం21 స్మార్ట్‌ఫోన్‌ ధర కూడా 15వేలలోపే ఉంది. 6.4 అంగుళాల పుల్‌ హెచ్‌డీ+ క్వాలిటీ అమోలోడ్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ వాడారు. వెనుకభాగంలో 48ఎంపీ+8ఎంపీ+5ఎంపీ కెమెరాలు, ముందుభాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 6,000 బ్యాటరీ సామర్థ్యంతో ఉన్న ఫోన్‌ 15వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌ ధర రూ. 12,999గా ఉంది.

రెడ్‌మీ నోట్‌ 11 (Redmi Note 11)

రెడ్‌మీ నోట్‌ 11

రెడ్‌మీ నోట్‌ 11 స్మార్ట్‌ఫోన్లలో 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే వాడారు. క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఓఎస్‌తో ఫోన్‌ పనిచేస్తుంది. దీని వెనుకవైపు 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ సెన్సర్‌ కెమెరాలు, ముందువైపు సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరాను అమర్చారు. 33వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000 బ్యాటరీ సామర్థ్యంతో ఫోన్‌ పనిచేస్తుంది. దీని ధరను రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ఇంచుమించు ఒకే ఫీచర్లతో రెడ్‌మీ నోట్‌ 10కూడా 15వేలలోపే లభిస్తుంది. దీని ధర రూ.13,999గా ఉంది.

మోటో జీ40 ఫ్యుజన్‌ (Moto G40 Fusion)

మోటో జీ40 ఫ్యుజన్‌

మోటోరోలా కంపెనీ తయారు చేసిన మోటీ జీ40 ఫ్యుజన్‌ 6.8 అంగుళాల డిస్‌ప్లేతో పెద్దగా కనిపిస్తోంది. క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732జీ ప్రాసెసర్‌ను వాడారు. ఫోన్‌ వెనుకభాగంలో 64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ కెమెరాలు, ముందుభాగంలో 16ఎంపీ కెమెరాను అమర్చారు. 6,000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 20వాట్‌ టర్బో పవర్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఉంది. దీని 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ. 14,699గా ఉంది.

రియల్‌మీ 9ఐ (Realme 9i)

రియల్‌మీ 9ఐ

రియల్‌మీ 9 సిరీస్‌లో రెండు ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి. రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్లలో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు. క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు 50ఎంపీ+2ఎంపీ+2ఎంపీ కెమెరాలు, ముందువైపు 16ఎంపీ కెమెరాను అమర్చారు. 33వాట్‌ డార్ట్‌ ఛార్జ్‌ టెక్నాలజీతో ఛార్జింగ్‌ సపోర్ట్‌, 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంది. దీని ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. ఇదే కాకుండా రియల్‌మీ9 (Realme 9 5G) కూడా 15వేలలోపే ఉంది. దీని ధర రూ. 14,999

ఒప్పో కే10 (Oppo K10)

ఒప్పో కే10

ఒప్పో కే10 సిరీస్‌ ఫోన్లలో 6.59 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. ఇందులో క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ను వాడారు. వెనుకవైపు 50ఎంపీ ట్రిపుల్‌ కెమెరా, ముందుభాగంలో 16ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 5,000 బ్యాటరీ సామర్థ్యం ఉంది. దీని ధర రూ.14,990గా ఉంది.

ఇదీ చూడండి:రూ.20 వేలలో స్మార్ట్​ఫోన్​​ కొనాలా? ఈ 10 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

ABOUT THE AUTHOR

...view details