తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఈ మొబైల్స్​ ధర 15వేల లోపే.. ఫీచర్లు మాత్రం అదరహో! - samsung galaxy f22 price

స్మార్ట్​ఫోన్​ కొనాలనుకునే వారికి ప్రస్తుతం చాలా ఆప్షన్​లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భారీ ఫీచర్లు ఉన్న ఫోన్లు కూడా తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో రూ.15 వేల లోపు(mobiles under 15000) ఉన్న అత్యుత్తమ బడ్జెట్ స్మార్ట్​ఫోన్ల ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం..

BEST MOBILE PHONES UNDER 15000 IN INDIA
రూ.15 వేలలో ఉత్తమ స్మార్ట్​ఫోన్లు ఇవే!

By

Published : Aug 10, 2021, 1:58 PM IST

ఒకప్పుడు స్మార్ట్​ఫోన్ కొనాలంటే భారీగా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీల మధ్య పోటీ పెరిగి బడ్జెట్ ధరలో భారీ ఫీచర్లతో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత భారత మార్కెట్లో రూ.15 వేల లోపు(mobiles under 15000) ధర కలిగిన ఫోన్లకు ఎక్కువ డిమాండ్​ ఉంది. ఎందుకంటే ఈ ధర సాధారణ వ్యక్తి కూడా వెచ్చించగలిగేది కాబట్టి! అందువల్ల ఈ విలువ లోపు పలు మొబైల్​ తయారీ సంస్థలు కెమెరా, ఫాస్ట్​ ప్రాసెసర్​, లాంగ్​లైఫ్​ బ్యాటరీ వంటి ఉత్తమ ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. అలా ఇటీవల విడుదలై.. మార్కెట్లో ఉన్న ఉత్యుత్తమ స్మార్ట్​ఫోన్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.

1) శాంసంగ్​ గెలక్సీ ఎఫ్​22 - రూ.12,499

శాంసంగ్​ గ్యాలక్సీ ఎఫ్​22

6.40 అంగుళాల డిస్​ప్లే(720x1600 పిక్సెల్​)

మీడియాటెక్​ హేలియో జీ80 ప్రాసెసర్​

4జీబీ ర్యామ్​, 64జీబీ స్టోరేజ్​

6000 ఎం​ఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ

బ్యాక్​ కెమెరా-(48+8+2+2 మెగా పిక్సెల్స్)

ఫ్రంట్​ కెమెరా - 13 మెగా పిక్సెల్స్​​

2) రియల్​మీ నార్జో 30 - రూ.12,499

రియల్​మీ నార్జో 30

6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే (1080x2400 పిక్సెల్)

మీడియా టెక్ హీలియో జీ95 ప్రాసెసర్​

ట్రిపుల్ రియర్​ కెమెరా (48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)

16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

30 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​

4 జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.12,499

6 జీబీ ర్యామ్​/128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.14,499

3) రెడ్​మీ నోట్​ 10 - రూ.13,499

రెడ్​మీ నోట్​ 10

6.43 అంగుళాల సూపర్ అమోలెడ్​ డిస్​ప్లే (1080x2400 పిక్సెల్స్​)

క్వాల్కమ్​ ఎస్​డీఎం678, ఆక్టా కోర్ ప్రాసెసర్​

క్వాడ్ రియర్ కెమెరా (48ఎంపీ+8ఎంపీ+2 ఎంపీ+ 2ఎంపీ)

13 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా

5000 ఎంఏహెచ్​ బ్యాటరీ

33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​

4 జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.13,499

6 జీబీ ర్యామ్​/128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.14,999

4) రెడ్​మీ నోట్​ 10ఎస్​ - రూ.14,999

రెడ్​మీ నోట్​ 10ఎస్

6.43 అంగుళాల అమోలెడ్​ డిస్​ప్లే (1080x2400 పిక్సెల్స్​)

మీడియా టెక్ హీలియో జీ95 ప్రాసెసర్

క్వాడ్​ రియర్​ కెమెరా (64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)

13 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా

5000 ఎంఏహెచ్​ బ్యాటరీ

33 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​

6జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.14,999

5) మోటో జీ30 64 జీబీ - రూ.10,999

మోటో జీ30

6.5 అంగుళాల హెచ్​డీప్లస్​ డిస్​ప్లే (720x1600 పిక్సెల్స్​)

క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 662 ప్రాసెసర్​

క్వాడ్​ రియర్ కెమెరా సెటప్​ (64 ఎంపీ+ 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)

13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా​

5000 ఎంఏహెచ్​ బ్యాటరీ

20 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​

4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.10,999

ఇదీ చూడండి..భారీ కెమెరాతో మోటోరోలా నయా స్మార్ట్​​ఫోన్లు

ABOUT THE AUTHOR

...view details