Best Laptops For Students In India 2023 : లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న ప్రతిసారీ.. విద్యావిధానంలో సమూలమైన మార్పులు వస్తున్నాయి. విద్యార్థులు ఒకప్పుడు కేవలం పుస్తకాలను మాత్రమే చదివేవారు. హోంవర్కులు కూడా మాన్యువల్‌గానే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారుతోంది. ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి. హోంవర్కులు కూడా ల్యాప్‌టాప్స్‌లో చేయాల్సి వస్తుంది. అందుకే క్రమంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరుగుతోంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన మంచి ల్యాప్టాప్స్/ కంప్యూటర్స్ అందించాల్సి వస్తోంది. ఇంత వరకు బాగానే ఉంది. మరి బెస్ట్ ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవడం ఎలా?
వాస్తవానికి విద్యార్థుల అవసరాలు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా స్కూల్, కాలేజ్ విద్యార్థుల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అలాగే సైన్స్, ఆర్ట్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల అవసరాలు కూడా భిన్నంగా ఉంటాయి. అందుకే ఆయా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ల్యాప్టాప్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
ల్యాప్‌టాప్ కొనేముందు ఏమేం చూడాలి?
How Select Best Laptops :ల్యాప్‌టాప్‌లో విద్యార్థికి అవసరమైన అధునాతన ఫీచర్లు అన్నీ ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు స్క్రీన్ సైజ్ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే స్క్రీన్ సైజ్ చిన్నగా ఉంటే, అది కంటిపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. అలాగే..
- ల్యాప్‌టాప్ బరువు తక్కువగా ఉండాలి.
- బ్యాటరీ లైఫ్ బాగుండాలి.
- స్టోరేజ్ కపాసిటీ ఎక్కువగా ఉండాలి.
- ఎక్కువ కాలం మన్నిక రావాలి. అంటే కనీసం 3-4 సంవత్సరాలు వర్క్ చేయాలి.
- మంచి ప్రాసెసర్ ఉండాలి.
- బ్రాండెడ్ ల్యాప్టాప్స్ తీసుకోవాలి. ఉదాహరణకు యాపిల్, హెచ్‌పీ, డెల్, Asus లాంటి బ్రాండెడ్ ల్యాప్టాప్స్ తీసుకోవాలి.
- ధర కూడా అందుబాటులో ఉండాలి.
Top 12 Laptops For Students : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న.. విద్యార్థులకు ఉపయోగపడే టాప్-12 ల్యాప్టాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Dell 15 Laptop, Intel core i5 : కాలేజ్ విద్యార్థులకు ఈ డెల్ ల్యాప్‌టాప్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.53,490 వరకు ఉంది.
2. Lenovo IdeaPad 3 :దీనిలో హెచ్డీ క్వాలిటీ కెమెరా ఉంది. కనుక ఆన్లైన్ క్లాసుల కోసం ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. దీని ధర సుమారుగా రూ.36,990 వరకు ఉంటుంది.
3. Acer Aspire Lite 11th Gen : ప్రీమియం లుక్‌తో.. లైట్ వెయిట్, స్టన్నింగ్ హెచ్డీ క్వాలిటీ డిస్ప్లే కలిగిన ల్యాప్‌టాప్ ఇది. ఆన్లైన్ క్లాస్‌లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.30,990 వరకు ఉంటుంది.
4. Xiaomi Notebook Pro Max : విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో, ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ కలిగిన ఈ ల్యాప్‌టాప్ కాలేజ్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇది ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీని ధర సుమారు రూ.50,999 వరకు ఉంటుంది.
5. Lenovo V15 Intel Celeron : తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్ ఇది. స్కూల్ విద్యార్థులకు ఇది సరిపోతుంది. దీని ధర రూ.23,399 వరకు ఉంటుంది.