బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు, వాటి విశేషాలు 5జీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చంతా. 5జీ టెక్నాలజీతో మనిషి జీవన శైలి మరింత మారిపోనుందని టెక్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే 5జీ నెట్‌వర్క్ భారత్‌లో రావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యమైంది. మరికొన్ని రోజుల్లో ఈ టెక్నాలజీ భారతీయులకు చేరువ కానుంది. ఆ అవకాశం అందిపుచ్చుకునేందుకు మొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడళ్లు దించుతున్నాయి. వాటిలో రూ.40వేలలోపు ధరతో.. మంచి ఫీచర్లు అందించే టాప్ -5 మొబైళ్లు ఏంటో చూద్దాం.
వన్ ప్లస్ 9R
మొదటగా చెప్పుకోవాల్సింది.. వన్‌ప్లస్ 9R గురించి. ఈ మొబైల్స్ గేమర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. 6.55 ఇంచుల డిస్‌ప్లేతో 8GB, 128GB మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పాటు.. 4500mah బ్యాటరీ సామర్థ్యం అందిస్తున్నారు. 16 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అదనపు ఆకర్షణ. పబ్‌జీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్స్ ఆడేవారికి ఈ ప్రాసెసర్ బాగా ఉపయోగపడుతుంది. దీని ప్రస్తుతధర మార్కెట్‌లో దాదాపు రూ.40వేలుగా ఉంది.
భారీ ప్రాసెసర్‌తో ఐకూ ఫోన్..
ఐకూ 7 లెజెండ్(iQOO 7 Legend).. ఈ మధ్య మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న మొబైల్ ఇది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 4000mah బ్యాటరీ.. 6.62 ఇంచుల టాప్ నాచ్ డిస్‌ప్లేతో పాటు ఫుల్‌హెచ్‌డీ పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంది. 48 మెగా పిక్సల్ రియర్ కెమెరాతో పాటు 13 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ సెన్సర్ అమర్చారు. ప్రసుత్తం.. ఆండ్రాయడ్ వెర్షన్ 11తో ఇది పని చేస్తుంది. ఇన్ని రకాల ఫీచర్లతో.. 40 వేల రూపాయల్లో లభించే ఫొన్లలో ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
ఎంఐ 11 ఎక్స్ ప్రో..
ఎంఐ 11 ఎక్స్ ప్రో (Mi 11X pro)..క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో ఇది పని చేస్తుంది. 8GB + 128GB, 8GB+256GB వేరియంట్లలో లభిస్తుంది. 6.67 ఇంచుల డిస్‌ప్లే.. బ్యాటరీ సామర్థ్యం 4520mah. 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే దాదాపు 2 గంటలలోపే ఫుల్‌ఛార్జ్ అవుతుంది. సాధారణంగా ఫుల్‌ఛార్జ్ చేస్తే రోజు మొత్తం ఉపయోగించ వచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. రూ.40వేలతో .. 5జీ సపోర్ట్‌తో షియోమీ ఫోన్లు ఉపయోగించాలనుకునే వారికి ఇది ఉత్తమం.
రెనోకు మంచి స్పందన..
ఒప్పొ విడుదల చేసిన రెనో సిరీస్ మొబైళ్లకు టెక్ ప్రియుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. ఈ తరుణంలో 2021లో ఒప్పొ నుంచి ఒప్పొ రెనో 5 ప్రో విడుదలైంది. 6.5 అంగుళాల, 90HZ ఆమోల్డ్ డిస్‌ప్లేతో లభిస్తోంది. 8GB + 128GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. 64 మెగాపిక్సల్ రియర్ కెమెరాతో పాటు 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు. 4350mah బ్యాటరీ సామర్థ్యంతో పాటు 65 వాట్ల సూపర్ ప్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే.. బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్‌కు బలం.
రూ.30 వేలలోపు బెస్ట్ ఫోన్!
రియల్‌మీ X7 ప్రొ మెుబైల్ 5జీకి సపోర్ట్‌తో విడుదలైంది. 120HZ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే.. 65 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే.. 4500mah బ్యాటరీ అమర్చారు. ప్రస్తుతం రూ.30 వేలల్లో లభ్యమవుతున్న ఈ మొబైల్.. 8GB+128GB వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఉండే ప్రాసెసర్లు గేమింగ్ యూజర్లకు బాగా నచ్చుతుంది. ప్రాసెసర్లు, కెమెరా, డిజైన్ వంటి ఫీచర్స్ చూస్తే.. రూ.30 వేలలో ఈ మొబైల్ ఉత్తమం.
ఇవే కాక వన్‌ప్లస్ నార్డ్ సీఈ, రియల్ మీ నార్జో 30, పోకో M3 ప్రొ, వీవో V21 5జీ.. వంటి మొబైళ్లు కూడా 5జీ సపోర్ట్‌తో విడుదలయ్యాయి. రూ. 20వేలలోపు ధరల్లో 5జీ ఫోన్ కొనాలనుకునే వారు వీటిపై కూడా ఓ లుక్కేయొచ్చు.
ఇవీ చదవండి: