ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్న మాదిరిగానే యూట్యూబ్‌కీ అకౌంట్ ఉండాలి. ఇప్పటికే మీరు జీమెయిల్ వాడుతున్నట్లయితే https://www.youtube.com లింక్‌ని ఓపెన్ చేసి ‘యూట్యూబ్ ఛానల్’ క్రియేట్ చేసుకోవచ్చు. ఛానల్‌కి సంబంధించిన మొత్తం కమ్యూనికేషన్ జీమెయిల్ అకౌంట్ నుంచే జరుగుతుంది. ఛానల్‌ని క్రియేట్ చేసే క్రమంలో దానికి పేరు పెట్టాలి. మీరు ఏ రంగానికి సంబంధించిన వీడియోలు చేస్తున్నారో దానికి సరిపడేలా పేరు పెడితే బాగుంటుంది. ‘కస్టమైజ్ ఛానల్’ ఆప్షన్‌తో మరింత అదనపు సమాచారాన్ని జోడించొచ్చు ఛానల్ లోగో.. ఇతర గ్రాఫిక్స్‌నీ సెట్ చేసుకోవచ్చు.
ఇలా అప్‌లోడింగ్..
ఛానల్ హోం పేజీలోని ‘యూట్యూబ్ స్టూడియో’ (బీటా)ని సెలెక్ట్ చేసి ‘అప్‌లోడ్’ వీడియో ఆప్షన్‌తో చిత్రీకరించిన వాటిని ఛానల్‌లోకి అప్‌లోడ్ చేయొచ్చు అలాగే, వీడియోలకు తగిన ప్రైవసీని సెట్ చేసుకునే వీలుంది. అందరూ చూసేలా వీడియోల్ని ‘పబ్లిక్ మోడ్’లో ఉంచుకోవచ్చు అప్‌లోడ్ చేసినప్పటికీ ఎవ్వరికీ కనిపించొద్దు అనుకుంటే ప్రైవేట్ మోడ్‌లో పెట్టుకోవచ్చు గూగుల్ ఫొటోస్‌లో ఉన్న వీడియోలను ఛానల్‌లోకి ఇంపోర్ట్ చేసుకునే వీలుంది. అప్‌లోడ్ చేశాక ప్రతి వీడియోకి తగిన సమాచారాన్ని (టైటిల్, డిస్‌క్రిప్షన్, ట్యాగ్స్...) జత చేయొచ్చు అడ్వాన్స్ సెట్టింగ్స్‌తో అదనపు వివరాల్ని జోడించొచ్చు అప్‌లోడ్ చేసే వీడియోల్ని పిల్లలు చూడొద్దు అనుకుంటే పరిధుల్ని పెట్టుకునే వీలుంది. మొత్తం అప్‌లోడ్ ప్రాసెస్ ముగిశాక వీడియోలను యూఆర్‌ఎల్ లింక్‌లతో షేర్ చేయొచ్చు.
ట్రాక్ చేయొచ్చు
అప్‌లోడ్ లేదా షేర్ చేసిన వీడియోలను ఎంత మంది చూశారు? ఎంత సమయం వీక్షించారు?.. వంటి ఇతర వివరాల్ని ట్రాక్ చేసేందుకు ‘యూట్యూబ్ స్టూడియో’ ఉపయోగపడుతుంది. మీరు చిత్రీకరించే వీడియోలకు ఆదరణ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇదే మార్గం. ఎంత మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు? ఎక్కువ ఆదరణ పొందిన వీడియోలేంటి? రియల్ టైమ్ యాక్టివిటీ.. అన్నీ స్టూడియోలోనే మేనేజ్ చేయొచ్చు. ఇక కామెంట్స్ విభాగంలో వీడియోలకు వచ్చే స్పందనల్ని రివ్యూ చేయొచ్చు. కావాలంటే స్పందించొచ్చు కామెంట్స్‌లోనూ స్పామ్ రూపంలో అనవసరమైన వాటిని తొలగించొచ్చు.
అప్పుడే డబ్బులు..
పాపులారిటీతో పాటు కాస్త పైసలు కూడా సంపాదించే ఉద్దేశంలో యూట్యూబ్ ఛానల్ పెడితే గూగుల్ పాలసీకి అర్హత సాధించాలి. కనీసం ఏడాదిలో 4,000 గంటల నిడివి వీడియోలను వీక్షకులు చూడాలి. దాంతో పాటు 1000పైనే సబ్‌స్క్రైబర్లు ఉండాలి. అప్పుడు గూగుల్ యాడ్‌సెన్స్‌ని ఛానల్‌కి లింక్ చేయాలి. దీంతో ఛానల్‌లో ప్రసారమయ్యే ప్రకటనలు, ఇతర కంటెంట్‌తో యూట్యూబ్ ఛానల్ పైసలు తెచ్చిపెడుతుంది.
ఎడిటింగ్ ఎలా?
చిత్రీకరణ తర్వాత వీడియోలకు మెరుగులు దిద్దేందుకు ఎడిటింగ్ టూల్స్ ఏం వాడుతున్నారు? ఐఓఎస్ యూజర్లు ‘ఐమూవీ యాప్’ని వాడొచ్చు ఆండ్రాయిడ్ యూజర్లు ‘వీడియోషో వీడియో ఎడిటర్, వివా వీడియో’ యాప్‌లను ప్రయత్నించొచ్ఛు డెస్క్‌టాప్‌లో ఎడిట్ చేసేందుకు ‘అడోబ్ ప్రీమియర్’ని వాడొచ్ఛు ఉచిత సాఫ్ట్‌వేర్‌లను ప్రయత్నిద్దాం అనుకుంటే ‘బ్లెండర్, షాట్‌కట్’ ఉన్నాయి. www.blender.org, www.shotcut.org