'యాపిల్' ప్రియులకు అదిరిపోయే వార్త. సరికొత్త మాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లను సంస్థ ఆవిష్కరించింది(apple macbook pro). మాక్‌బుక్‌ను అప్‌గ్రేడ్ చేయడం దాదాపు ఐదేళ్లలో ఇదే తొలిసారి. పాత మాక్బుక్స్లో ఇంటెల్ చిప్‌సెట్‌ను వినియోగించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో ఎమ్1 ప్రో, ఎమ్1 మ్యాక్స్ చిప్సెట్లు ఉపయోగించారు. మాక్‌బుక్ 14-ఇంచ్, 16-ఇంచ్ సైజుల్లో అందుబాటులో ఉండనుంది.
మాక్‌బుక్ ప్రో 2021 ఫీచర్లు(apple macbook pro 2021)...
మాక్‌బుక్ ప్రో 14-ఇంచ్, 16-ఇంచ్‌కు కొత్త డిజైన్‌ను ఇచ్చారు. మాగ్‌సేఫ్ ఛార్జింగ్ టెక్నాలిజీని వీటిల్లో పొందుపరిచారు(apple macbook pro 2021). టచ్బార్ను తొలిగించి, మెకానికల్ కీస్ ద్వారా ఆపరేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు(macbook pro features). వీటిల్లో కార్డ్ రీడర్ స్లాట్, నాలుగు థండర్బౌల్ట్ 4 పోర్టులు, హెచ్డీఎమ్ పోర్ట్ ఉన్నాయి.
కొత్త మాక్బుక్స్లో 1080పీ కెమెరా సెన్సార్లు ఉన్నాయి. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ప్రో మోషన్ డిస్ప్లే వీటి సొంతం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన డిస్ప్లేల్లో ఇదొకటని యాపిల్ వెల్లడించింది(apple new macbook).
మాక్‌బుక్ ప్రో 2021 ధర(macbook pro price in india)..
మాక్‌బుక్ ప్రో 14- ఇంచ్(ఎమ్1 ప్రో):- 8 కోర్ సీపీయూ, 14 కోర్ జీపీయూ, 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్- ధర రూ. 1,94,900