Apple Security Flaw 2023 : యాపిల్ యూజర్లకు అలెర్ట్. యాపిల్ ప్రొడక్టుల్లో ముఖ్యంగా ఐఫోన్నుంచి యాపిల్ వాచ్ వరకు అన్నింటిలో అనేక భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) గుర్తించింది. ఈ సెక్యూరిటీ లోపాలను ఉపయోగించుకుని, సైబర్ నేరగాళ్లు చాలా సులువుగా సదరు డివైజ్‌లను హ్యాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
సాఫ్ట్‌వేర్‌లో లోపాలు?
Apple Software Security Risks : యాపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ కాంపోనెంట్ సర్టిఫికేట్ వ్యాలిడేషన్, కెర్నల్, వెబ్‌కిట్ కాంపోనెంట్ల్లో లోపాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు.. ఐఫోన్ నుంచి యాపిల్ వాచ్‌ల వరకు అన్నింటినీ హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఎలా అంటే.. హ్యాకర్లు యాపిల్ యూజర్లకు ఒక రిక్వెస్ట్‌ను పంపిస్తారు. ఇది సాధారణమైన అంశమే కదా అని ఓపెన్ చేస్తే.. ఇక అంతే సంగతులు. మీ డివైజ్ యాక్సెస్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. దీనితో మీ డివైజ్‌లోని సున్నితమైన డేటా మొత్తం సైబర్ నేరగాళ్లు చేజిక్కించుకుంటారు. దీని వల్ల మీరు ఆర్థికంగా, మానసికంగానూ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
వెంటనే అప్డేట్ చేసుకోవాలి!
Apple Software Update 2023 :ఐఫోన్, యాపిల్ వాచ్, టీవీ, మ్యాక్ బుక్‌లోని భద్రతాపరమైన లోపాలను సరిదిద్దాలంటే.. యూజర్లు వెంటనే తమ డివైజ్‌లను అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా తాజాగా విడుదలైన watchOS, tvOS, macOS అప్డేటెడ్ వెర్షన్లను ఇన్స్టాల్ చేసుకోవాలి.