Apple New Update Features: ఐఫోన్ యూజర్స్‌కు గుడ్ న్యూస్. కరోనా దృష్ట్యా ఐఫోన్ యూజర్స్ కోసం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ్ టెక్ దిగ్గజం యాపిల్. ఐఫోన్ వినియోగదారులు ఫేస్‌మాస్క్ ధరించినా ఫేస్ఐడీ ద్వారా స్క్రీన్ అన్‌లాక్ అయ్యే కొత్త అప్డేట్ ఐఓస్ 15.4ను సోమవారం విడుదల చేసింది. యూజర్స్ మాస్కు ధరించినా కూడా.. స్క్రీన్ అన్‌లాక్ అవుతుందని పేర్కొంది.
ఈ ఫీచర్‌ను ఎలా సెట్ చేయాలి?
ఈ ఫీచర్‌ను పొందాలంటే ఐఓఎస్ 15.4ను అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెట్టింగ్స్>ఫేస్ ఐడీ& పాస్వర్డ్>యూజ్ ఫేస్ ఐడీ విత్ ఏ మాస్క్ ఆఫ్షన్కు వెళ్లాలి.
అప్పుడు మీ ఫేస్‌ను అన్ని కోణాల్లో స్కాన్ చేస్తుంది. ఆ సమయంలో మీరు మాస్కు ధరించాల్సిన అవసరం లేదు.
ఫేస్ ఐడీ విత్ గ్లాసెస్ ఎలా సెట్ చేయాలి?
కళ్లద్దాలు ధరించినా స్క్రీన్ అన్‌లాక్ అయ్యే విధంగా యాపిల్ ఫోన్లలో మరో ఫీచర్ కూడా ఉంది.
- సెట్టింగ్స్>ఫేస్ఐడీ&పాస్‌కోడ్>యాడ్ గ్లాసెస్‌కు వెళ్లాలి.
ఈ అప్డేట్తో పాటు మరికొన్ని ఫీచర్స్‌ను తీసుకొచ్చింది యాపిల్. అవేంటో చూద్దాం..
- 'ఎయిర్ ట్యాగ్'(వ్యక్తిగత వస్తువుల ట్రాకింగ్ పరికరం)లో భద్రతా మెసేజ్‌లు,
- న్యూ సిరి వాయిస్
- ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు సమయం, తేదీకి సంబంధించి ఫీచర్స్ అప్డేట్స్
- టాప్ టూ పే ఆన్ ఐఫోన్(యాపిల్ పే ద్వారా లావాదేవీలు)
- యూనివర్సల్ కంట్రోల్(ఐపాడ్, మ్యాక్ నుంచి ఫైల్స్ షేరింగ్)
- నోట్స్ యాప్ నుంచి ఫైల్స్‌ను డైరెక్ట్‌గా వేరే చోటుకు సేవ్ చేసే అవకాశం
- షేర్‌ప్లే(వేగంగా సాంగ్స్, ఇతర కంటెంట్‌ను బదిలీ చేయడం)
- ఫేస్ టైం కంటెంట్
ఇదీ చూడండి:వాట్సాప్ గ్రూప్ చాట్‌లో పోల్స్ ఫీచర్.. అసలేంటిది?