ఈ ఏడాది సెప్టెంబరులో ఐఫోన్ 13ను విడుదల చేసిన యాపిల్ (Apple) త్వరలో మరో కొత్త ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసురానున్నట్లు సమాచారం. ఐఫోన్ ఎస్‌ఈ సిరీస్‌లో మూడో జనరేషన్ ఐఫోన్ ఎస్‌ఈ3ని 2022 ప్రథమార్థంలో విడుదల చేయాలని యాపిల్ భావిస్తోందట. గతేడాది కూడా యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ2ను ఏప్రిల్‌లో విడుదల చేసింది. అదే తరహాలో ఎస్‌ఈ3ను కూడా 2022 మార్చి నెల చివర్లో కానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ విడుదల చేస్తారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించి ఫీచర్స్ ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి అవేంటో చూద్దామా..
ఐఫోన్ ఎస్‌ఈ3 ఫీచర్స్
Iphone se 3 features:ఐఫోన్ ఎస్‌ఈ3లో 4.7 అంగుళాల హెచ్‌డీ రెటీనా డిస్‌ప్లే ఉంటుందట. ఇందులో యాపిల్ 5ఎన్‌ఎమ్ ఏ15 బయోనిక్ చిప్ ఉపయోగించినట్లు సమాచారం. ఈ ఫోన్‌లో 5జీ కనెక్టివిటీ కూడా ఇస్తున్నారు. దీనికోసం క్వాల్‌కోమ్ ఎక్స్60 5జీ మోడెమ్‌ను ఉపయోగించారని తెలుస్తోంది. ఐఓఎస్ 15తో ఈ ఫోన్ పనిచేస్తుందట. టచ్ ఐడీ, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఐఫోన్ 13 తరహాలోనే ఈ ఫోన్‌లో కూడా సరికొత్త కెమెరా ఫీచర్స్‌ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. పాత్ ఎస్‌ఈ మోడల్‌లో ఉన్నట్లుగానే ఈ ఫోన్‌లో కూడా రెండు కెమెరాలు ఉంటాయట. వెనుక 12ఎంపీ, ముందు 7ఎంపీ కెమెరాలు అని సమాచారం. ఎస్‌ఈ3 మోడల్‌కు సంబంధించి బ్యాటరీతోపాటు ఇతర ఫీచర్లకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. ఐఫోన్ ఎస్‌ఈ3 ధర రూ. 30 వేల నుంచి రూ. 35 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
ఇవీ చూడండి: