Apple iPhone 15 Series Sale : అదిరిపోయే ఆఫర్స్, డిస్కౌంట్స్‌తో.. ఐఫోన్ 15 సిరీస్ సేల్ ప్రారంభం - ఐఫోన్ 15 డిస్కౌంట్స్
Apple iPhone 15 Series Sale : యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 22న ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్స్ సహా.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా లాంటి ఈ-కామర్స్ సైట్స్‌లో కూడా వీటిపై బెస్ట్ ఆఫర్స్, డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Apple iPhone 15 Series Sale : యాపిల్ కంపెనీ.. ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలను శుక్రవారం (సెప్టెంబర్ 22) ప్రారంభించింది. దీనితో ఉదయం 8 గంటల నుంచే యాపిల్ స్టోర్ల ముందు ఐఫోన్ అభిమానులు బారులు తీరారు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి సీన్స్ మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ భారత్‌లోనూ ఇప్పుడు ఈ ట్రేండ్ బాగా పెరిగింది. ముంబయి, దిల్లీ లాంటి నగరాల్లో ప్రజలు యాపిల్ స్టోర్స్ దగ్గర భారీగా బారులు తీరారు.
భారత్‌లో ఐఫోన్ ధరలు Prices Of All iPhone Models :
iPhone 15 Price :
మోడల్
వేరియంట్
ధర
ఐఫోన్ 15
128 జీబీ
రూ.79,900
ఐఫోన్ 15
256 జీబీ
రూ.89,900
ఐఫోన్ 15
512 జీబీ
రూ.1,09,900
iPhone 15 Plus Price :
మోడల్
వేరియంట్
ధర
ఐఫోన్ 15 ప్లస్
128 జీబీ
రూ.89,900
ఐఫోన్ 15 ప్లస్
256 జీబీ
రూ.99,900
ఐఫోన్ 15 ప్లస్
512 జీబీ
రూ.1,19,900
iPhone 15 Pro Price :
మోడల్
వేరియంట్
ధర
ఐఫోన్ 15 ప్రో
128 జీబీ
రూ.1,34,900
ఐఫోన్ 15 ప్రో
256 జీబీ
రూ.1,44,900
ఐఫోన్ 15 ప్రో
512 జీబీ
రూ.1,64,900
ఐఫోన్ 15 ప్రో
1 టీబీ
రూ.1,84,900
iPhone 15 Pro Max Price :
మోడల్
వేరియంట్
ధర
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
256 జీబీ
రూ.1,59,900
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
512 జీబీ
రూ.1,79,900
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
1 టీబీ
రూ.1,99,900
Latest Apple Products :యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 12న వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్, యాపిల్ వాచ్ 9 సిరీస్, వాచ్ ఆల్ట్రా 2లను విడుదల చేసింది. తాజాగా ఈ ఐఫోన్ సిరీస్‌లోని ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సేల్‌ను ప్రారంభించింది.
యూఎస్బీ-సీ టైప్ ఛార్జింగ్ IPhone USB-C type charging : యాపిల్ ఈ సారి యూఎస్బీ-సీ టైప్ ఛార్గింగ్ ఫెసిలిటీని తీసుకొచ్చింది. దీనితో పాటు డైనమిక్ ఐలాంట్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఐఫోన్ 15 సిరీస్ ఫీచర్స్ IPhone 15 Features :
ఐఫోన్ స్క్రీన్ :ఐఫోన్ 15లో 6.1 అంగుళాల స్క్రీన్ ఉంది. కాగా, ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల స్క్రీన్‌ను అమర్చారు.
ఐఫోన్ డిస్ప్లే :ఐఫోన్ 15లో ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ప్లే ఉంది. ఇది సాధారణంగా 1,600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో డాల్బీ విజన్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే సన్‌లైట్‌లో కూడా స్పష్టంగా చూసేందుకు వీలుగా గరిష్ఠంగా 2000 నిట్స్ బ్రైట్నెస్ వరకు సపోర్ట్ చేస్తుంది.
ఐఫోన్ 15 కెమెరా :ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లలో 48 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే పోట్రైట్ మోడ్‌లోనూ సరికొత్త మార్పులు తీసుకువచ్చారు. దీని ద్వారా హై క్యాలిటీ ఫొటోలు తీసుకోవడానికి వీలవుతుంది.
ఐఫోన్ 15 కలర్ వేరియంట్స్ : ఐఫోన్ 15 పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ఫీచర్స్ : ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో A17 ప్రో చిప్ అమర్చారు. వాస్తవానికి ఇలాంటి చిప్‌లను హై-ఎండ్ పీసీల్లో ఉపయోగిస్తారు. కనుక ఇది ఫోన్ పెర్ఫార్మెన్స్, స్పీడ్‌ను బాగా పెంచుతుంది.
యూఎస్బీ-సీ పోర్ట్ : ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో యూఎస్బీ-సీ పోర్ట్‌ను ఏర్పాటుచేశారు. అలాగే కొత్తగా యాక్షన్ బటన్‌ను అమర్చారు. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన విధంగా షార్ట్‌కట్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే కెమెరా, ఫ్లాష్‌లైట్ సహా వివిధ ఫీచర్లను సులువుగా ఆపరేట్ చేసుకోగలుగుతారు.
ఐఫోన్ 15 బెస్ట్ ఆఫర్స్ : IPhone 15 Offers And Discounts :యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌పై మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ అందిస్తోంది.
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేస్తే.. రూ.6000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లను కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందుతుంది.
మీ దగ్గర ఉన్న పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. ఐఫోన్స్ మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఐఫోన్ 14, ఐఫోన్14 ప్లస్ ఫోన్లపై రూ.4,000; ఐఫోన్ 13పై రూ.3,000; ఐఫోన్ ఎస్ఈపై రూ.2,000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
యాపిల్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కూడా బంపర్ ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా 'ట్రేడ్-ఇన్' ఆప్షన్ కింద కొన్ని ఎలిజిబుల్ స్మార్ట్‌ఫోన్స్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. గరిష్ఠంగా రూ.55,700 వరకు అదనపు డిస్కౌంట్ అందిస్తోంది.
నోట్: యాపిల్ స్టోర్స్, యాపిల్ సర్టిఫైడ్ రీసెల్లర్స్ దగ్గర మాత్రమే కాదు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా లాంటి ఈ-కామర్స్ సైట్స్, స్టోర్స్‌ల్లో కూడా యాపిల్ ప్రొడక్టులపై.. ముఖ్యంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ : ప్రముఖ సినిమా నటుడు మాధవన్ ఐఫోన్ 15ను కొనుగోలు చేశారు. భారత్‌లో తయారైన తొలి ఐఫోన్‌ను సొంతం చేసుకున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ.. తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.