ప్రీమియం మొబైల్ తయారీ సంస్థ యాపిల్.. తన తరువాత ఐఫోన్ 14 (Iphone 14 Design) విషయంలో సమూల మార్పులకు తెరతీసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి డిజైన్ విషయంలో మార్పులు చేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఐఫోన్ 13 సిరీస్‌లో.. ఎస్ అప్‌గ్రేడ్‌ను తలపిస్తుండగా, తాజా సమాచారం యాపిల్ ప్రియులకు శుభవార్తే.
ఇదే విషయాన్ని బ్లూమ్‌బర్గ్ న్యూస్‌లెటర్‌లో కూడా పేర్కొంది. ప్రముఖ టెక్ నిపుణుడు మార్క్ గుర్మాన్ ఈ విషయాన్నే వెల్లడించారు. 2022లో యాపిల్ ఐఫోన్ 14 (Iphone 14 Design) పూర్తిస్థాయిలో రీ డిజైన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులోనూ కేవలం ఎంట్రీ లెవల్, ప్రో మోడల్స్ మీద మాత్రమే యాపిల్ ఇంజినీర్లు పని చేస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు యాపిల్ తీసుకొచ్చిన మినీ వెర్షన్ అనేది ఇకపై విడుదల కాకపోవచ్చని పేర్కొన్నారు.
అయితే యాపిల్ ఎప్పటిలాగానే నాలుగు మోడళ్లను విడుదల చేస్తుంది. వాటిలో రెగ్యులర్ సైజ్ మోడల్, రెండు ప్రో మోడల్స్, ఒకటి ఐఫోన్ 14 మ్యాక్స్. ప్రస్తుతం యాపిల్ తీసుకొచ్చిన యాపిల్ 13లోని మినీ మోడలే చివరి మినీ మోడల్ కానుంది. దీని అమ్మకాలు తక్కువగా ఉండడం వల్ల మినీకి ఇక చెక్ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు.