యాపిల్.. ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐఫోన్ నుంచి ఐప్యాడ్ వరకు ఎన్నో ప్రాడక్ట్స్తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది యాపిల్. తాజాగా.. మరో ప్రాడక్ట్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సంస్థ సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అదే యాపిల్ ఐప్యాడ్ ప్రో 2021. ఇది ఈ నెలలోనే విడుదలవుతుందని పలు నివేదికలు చెబుతుండటం యాపిల్ ప్రేమికులకు మరింత సంతోషాన్నిచ్చే విషయం.
యాపిల్ ఐప్యాడ్ ప్రో 2021...
ఈ యాపిల్ ఐప్యాడ్ ప్రో 2021కు ఓ ప్రత్యేకత ఉందని తెలుస్తోంది. దీనికి మినీ-ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుందని సమాచారం. ఈ నెల రెండో భాగంలో దీనికి సంబంధించి ప్రకటన వస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి.