Apple Event 2023 : ఐఫోన్ 15 లాంఛ్‌కు అంతా రెడీ!.. యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ కూడా.. ధర ఎంతంటే? - యాపిల్ సాఫ్ట్వేర్స్
Apple Event 2023 In Telugu : యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 12న సరికొత్త ఐఫోన్ 15, యాపిల్ వాచెస్, ఎయిర్‌పాడ్స్‌ను ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమం కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు జరగనుంది. పూర్తి వివరాలు తెలుసకుందాం.
Apple Event 2023 :యాపిల్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12 రాత్రి 10.30 గంటలకు యాపిల్ కంపెనీ తన సరికొత్త ఐఫోన్ 15, స్మార్ట్‌వాచెస్, లేటెస్ట్ ఎయిర్‌పాడ్స్‌ను ఆవిష్కరించనుంది. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని కుపెర్టినో వద్ద ఉన్న యాపిల్ కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించనున్నారు.
సరికొత్త సాఫ్ట్వేర్స్ కూడా! Apple New Software Update 2023 :యాపిల్ కంపెనీ ఈ కార్యక్రమంలో ఐఫోన్, ఐపాడ్, యాపిల్ వాచ్ కోసం రూపొందించిన సరికొత్త iOS 17, iPadOS 17, WatchOS 10ల గురించి, అలాగే త్వరలో రానున్న సాఫ్ట్వేర్ అప్డేట్ల గురించి తెలియజేయనుంది.
60 శాతం రెవెన్యూ వీటి నుంచే! Apple Revenue Sources : యాపిల్ కంపెనీకి ప్రధానంగా ఐఫోన్, ఐపాడ్, స్మార్ట్‌వాచ్‌ల నుంచే దాదాపు 60 శాతం వరకు రెవెన్యూ వస్తుంది. అలాగే యాపిల్ మ్యూజిక్ లాంటి డిజిటల్ సర్వీస్‌ల ద్వారా కూడా మంచి రెవెన్యూనే జనరేట్ అవుతుంది.
చైనా నుంచి ఇబ్బందులు Apple Vs China : యాపిల్ కంపెనీకి ప్రధానంగా చైనా నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చైనాలో ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో యాపిల్ ప్రొడక్టుల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. దీనికి తోడు చైనా ప్రజల్లోనూ అమెరికన్ టెక్నాలజీపై అపనమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ తన అమ్మకాలను మరలా పెంచుకోవడం కోసం వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా సరికొత్త ఐఫోన్‌ను తీసుకువస్తోంది. యాపిల్ కంపెనీ ఐఫోన్ ఛార్జింగ్ అండ్ డేటా పోర్ట్‌ను యూఎస్బీ-సీ స్టాండర్డ్‌కు మార్చింది. దీనివల్ల పాత ఐఫోన్ యూజర్లు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఐఫోన్ 15 మోడల్స్ IPhone 15 Launch Date :యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఐఫోన్ 15 మోడల్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా ఐఫోన్15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అనే నాలుగు సరికొత్త ఫోన్లను తీసుకువస్తోంది. (వాస్తవానికి చాలా మంది ఊహించినట్లు ఇది ఆల్ట్రా ఐఫోన్ మోడల్ మాత్రం కాదు.)
ఐఫోన్ 15
IPhone 15 Model 2023 :ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ అనేవి బేస్ మోడల్స్. వీటిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మాదిరిగా అల్యూమినియం సైడ్స్, గ్లాస్ బ్యాక్ ఉంటాయి. కానీ ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ లాంటి హై-ఎండ్ ఫోన్లను మాత్రం సరికొత్త డిజైన్‌తో, సూపర్ ఫీచర్లతో తీసుకువస్తున్నారు. ముఖ్యంగా వీటిని స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం లాంటి లోహాలతో రూపొందించారు.
సైజు సంగతేంటి? IPhone 15 Size :ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌ల్లో.. 6.1 అంగుళాల నుంచి 6.7 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. అయితే ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ డిస్ప్లే మాత్రం కాస్త పెద్దగా ఉండే అవకాశం ఉంది. అలాగే వీటి స్క్రీన్ బోర్డర్స్ 1/3వ వంతు సన్నంగా ఉంటాయి. ఇందుకు అనుగుణంగా ఫోన్ బెజిల్స్ కూడా మరింత సన్నంగా ఉంటాయి. యాపిల్ ఇప్పుడు లో-ఇంజిక్షన్ ప్రెజర్ ఓవర్మౌల్డింగ్ (LIPO) అనే పద్ధతి ఉపయోగించి తమ ప్రొడక్టులను తయారుచేస్తోంది.
డ్యూరబిలిటీ IPhone 15 Durability : ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌లను స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం లాంటి ధృఢమైన, తేలికైన లోహాలతో చేయడం వల్ల వాటి బరువు బాగా తగ్గుతుంది. మరోవైపు వాటి జీవితకాలం కూడా బాగా పెరుగుతుంది.
చిప్ సంగతేంటి? IPhone 15 Chipset : ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌లలో A17 చిప్‌ను ఇన్స్టాల్ చేశారు. దీని వల్ల ఈ హైఎండ్ ఫోన్ల ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది. కానీ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లలో మాత్రం ఇంకా పాత A16 చిప్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు.
కెమెరా IPhone 15 Camera Features :యాపిల్ కంపెనీ సాధారణంగా ఐఫోన్ కెమెరాను ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తూనే ఉంటుంది. తాజా 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్‌ను 48 మెగాపిక్సెల్కు అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే టెలిఫొటో, ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరాలను కూడా పొందుపరచడం జరిగింది. వీటి ద్వారా 3X నుంచి 6X వరకు జూమ్ చేసి పిక్చర్స్‌ను తీయవచ్చు.
బెస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ IPhone 15 Tracking Features :యాపిల్ కంపెనీ తన లేటెస్ట్ ఐఫోన్లలో 'U2' ఆల్ట్రావైడ్ బ్యాండ్ సెమీకండక్టర్‌ను పొందుపరిచింది. దీని ద్వారా మీ ఫోన్ లొకేషన్‌ను చాలా కచ్చితంగా తెలుసుకోవచ్చు. అంటే ఒక వేళ మీ ఫోన్ ఎక్కడైనా పోయినా.. Find My App ద్వారా చాలా సులువుగా దానిని ట్రాక్ చేయవచ్చు.
యూఎస్బీ - సీ IPhone USB C Cable: యాపిల్ ఈ సరికొత్త ఐఫోన్లు అన్నింటిలోనూ యూఎస్బీ-సీ వైర్డ్ ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ కేబుల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే చాలా వేగంగా డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
కలర్ వేరియంట్స్ IPhone 15 Color Options : సాధారణంగా ఐఫోన్స్.. పింక్, బ్లాక్, వైట్, బ్లూ, యెల్లో రంగుల్లో లభిస్తాయి. కానీ ఐఫోన్ ప్రో మోడల్స్.. గ్రే, బ్లాక్, డార్క్ బ్లూ, వైట్ కలర్స్లోనూ అందుబాటులో ఉంటాయి.
ప్రకృతి రక్షణ కోసం!!! IPhone 15 Leather Case : యాపిల్ కంపెనీ ఇప్పుడు లెదర్ ఫోన్ కేసులను ఇవ్వడం మానేసింది. ప్రకృతి సమతౌల్యతను కాపాడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఐఫోన్ 15 ధరలు Iphone 15 Price :
ఫోన్
ధర
ఐఫోన్ 15
రూ.79,000
ఐఫోన్ 15 ప్లస్
రూ.89,900
ఐఫోన్ 15 ప్రో
రూ.1,29,900 + రూ.10,000 (బహుశా)
ఐఫోన్ 15
రూ.1,39,900 + రూ.10,000 (బహుశా)
నయా యాపిల్ వాచ్‌లు Apple Watch Series 9 Launch : యాపిల్ కంపెనీ తన యాపిల్ వాచ్ సిరీస్ 9లో భాగంగా 41మి.మీ, 45మి.మీ సైజ్ వాచ్‌లను తీసుకువస్తోంది. అలాగే సెకెండ్ జనరేషన్ ఆల్ట్రా వాచ్‌లను 49మి.మీ సైజ్‌లో రూపొందించింది. అయితే ఇవి గతేడాది తీసుకువచ్చిన మోడల్స్ మాదిరిగానే ఉండనున్నాయి.
యాపిల్ వాచ్
స్పీడ్ పెంచారు! Apple Watch Speed :యాపిల్ కంపెనీ ఈసారి తమ వాచ్‌ల పెర్ఫార్మెన్స్పై దృష్టిసారించింది. ముఖ్యంగా ప్రాసెసింగ్ స్పీడ్, అక్యూరసీ పెంచడానికి ఓ సరికొత్త చిప్‌ను దీనిలో పొందుపరిచింది. ఐఫోన్ 15 మాదిరిగానే.. ఈ యాపిల్ వాచ్‌ల్లోనూ U2 ఆల్ట్రావైడ్ బ్యాండ్ చిప్‌ను ఏర్పాటుచేసింది.
హార్ట్ రేట్ సెన్సార్ Apple Watch Heart Rate Sensor : యాపిల్ తన సరికొత్త వాచ్‌ల్లో ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్‌ను పొందుపరిచింది. దీని ద్వారా యూజర్లు తమ హృదయస్పందనలను చెక్ చేసుకునే వీలు కలుగుతుంది.
న్యూ టెక్నాలజీతో.. Apple New Technology 2023 : యాపిల్ సిరీస్ 9 వాచ్‌లను 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో.. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సెకెండ్ జనరేషన్ ఆల్ట్రా ప్రాసెసింగ్ కూడా వచ్చే ఏడాది ప్రారంభించనుంది.
పర్యావరణ పరిరక్షణ కోసం!!! Apple Environment Policy 2023 : యాపిల్ ఈ సారి జంతు చర్మాలతో చేసిన వాచ్ బ్యాండ్లను నిలిపివేసింది. ఇప్పటికే 90 శాతం వరకు వీటి ఉత్పత్తిని ఆపేసింది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఎయిర్‌పాడ్స్ Apple Airpods Latest Model 2023 :యాపిల్ కంపెనీ తన సరికొత్త ఐఫోన్, ఐపాడ్ల్లో యూఎస్బీ-సీ పోర్ట్ తెచ్చింది. కనుక వాటి యాక్సెసరీస్‌ను కూడా అందుకు అనుగుణంగా రూపొందిస్తోంది. అందులో భాగంగా ముందుగా ఎయిర్‌పాడ్స్ ప్రోలో యూఎస్బీ-సీని తీసుకువచ్చింది. వచ్చే ఏడాది ఎయిర్‌పాడ్, ఎయిర్‌పాడ్ మ్యాక్స్ల్లోనూ దీనిని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సరికొత్త ఎయిర్‌పాడ్స్‌లో ఎలాంటి హార్డ్‌వేర్ మార్పులు చేయలేదు గానీ.. మంచి ఫీచర్స్‌ను మాత్రం పొందుపరిచారు. ముఖ్యంగా ఆటోమేటిక్ డివైజ్ స్విచ్ఛింగ్ సహా స్వయంచాలితంగా మ్యూట్, అన్‌మ్యూట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు.. ఆటోమేటిక్‌గా ఫోన్లోని శబ్ధాలు మ్యూట్ అవుతాయి.
యాపిల్ ఎయిర్‌పాడ్స్
యాపిల్ ఇంకా ఈ ఎయిర్‌పాడ్స్‌లో బాడీ టెంపరేచర్ సెన్సార్, న్యూ హియరింగ్ టెస్ట్ సిస్టమ్‌ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. బహుశా తరువాత వచ్చే మోడల్స్‌లో వీటిని పొందుపరిచే అవకాశం ఉంది.