తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఈ 8 యాప్స్​ మీ ఫోన్​లో ఉన్నాయా? వెంటనే డిలీట్​ చేయండి.. లేకపోతే! - ప్లే స్టోర్​ మాల్​వేర్​

ప్లేస్టోర్​ యూజర్లకు గూగుల్​ హెచ్చరికలు జారీ చేసింది. ఎనిమిది ఆండ్రాయిడ్​ యాప్స్​లో కొత్త మాల్​వేర్​ను గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈ యాప్‌లను 30 లక్షల మందిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారని, వారంతా వెంటనే డిలీట్ చేసుకోవాలని సూచించింది.

malware in playstore
malware in playstore

By

Published : Jul 15, 2022, 9:25 PM IST

New Malware Playstore Apps: ఆండ్రాయిడ్ యాప్స్‌లో మరో మాల్‌వేర్‌ కలకలం రేపుతోంది. ఆటోలికోస్‌ అనే పేరుతో మరో కొత్త మాల్‌వేర్‌ను ప్లేస్టోర్‌లోని ఎనిమిది ఆండ్రాయిడ్‌ యాప్స్‌లో గుర్తించినట్లు గూగుల్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూజర్లకు గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. మాల్‌వేర్‌ ఉన్నట్లు చెబుతున్న యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి నిషేధించినట్లు తెలిపింది. ఇప్పటికే ఈ యాప్‌లను 30 లక్షల మందిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు గుర్తించామని, వారంతా వెంటనే వాటిని డిలీట్ చేయాలని సూచించింది. రివైవె, బ్రాటా వంటి బ్యాంకింగ్ మాల్‌వేర్‌ల తర్వాత ఆండ్రాయిడ్​లో అత్యంత ప్రమాదకరమైన మాల్‌వేర్‌గా సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు వీటిని అభివర్ణిస్తున్నారు.

ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత మాల్‌వేర్ ఫోన్‌లోని ఎస్సెమ్మెస్‌లు, ఇతర మెసేజ్‌లను చదివేందుకు అనుమతి కోరుతుంది. తర్వాత వాటిలోని సమాచారంతో యూజర్‌కు నకిలీ యూఆర్‌ఎల్‌తో కూడిన మెసేజ్‌లను పంపుతుంది. యూజర్‌ వాటిపై క్లిక్ చేసిన వెంటనే ప్రీమియం సర్వీసులు సబ్‌స్క్రైబ్ చేస్తుంది. దీంతో యూజర్‌ ప్రమేయం లేకుండా వారి ఖాతాల నుంచి నగదు హ్యాకర్స్‌ ఖాతాలను బదిలీ అవుతుందని సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు తెలిపాయి. గూగుల్ ఈ యాప్‌లను నిషేధించినప్పటికీ.. వీటిలో రెండు యాప్‌లు ఇప్పటికీ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

  • వ్లోగ్‌ స్టార్‌ వీడియో ఎడిటర్‌ (Vlog Star Video Editor - com.vlog.star.video.editor)
  • క్రియేటివ్‌ 3డీ లాంచర్ (Creative 3D Launcher - app.launcher.creative3d)
  • వావ్‌ బ్యూటీ కెమెరా (Wow Beauty Camera - com.wowbeauty.camera)
  • గిఫ్‌ ఎమోజీ కీబోర్డ్‌ (Gif Emoji Keyboard - com.gif.emoji.keyboard)
  • ఫ్రీగ్లో కెమెరా 1.0.0 (Freeglow Camera 1.0.0 - com.glow.camera.open)
  • కోకో కెమెరా వీ1.1 (Coco Camera V1.1 - com.toomore.cool.camera)
  • రేజర్‌ కీబోర్డ్‌ (Razer keyboard &Theme by rxcheldiolola)
  • ఫన్నీ కెమెరా (Funny Camera by Kelly Tech)

ఈ జాబితాలో చివరి రెండు యాప్‌లు ఇప్పటికీ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు చెబుతున్నాయి. యూజర్లు వీటితో అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

ఇదీ చదవండి:ఆ యాప్‌ వాడితే ఇబ్బందులే.. యూజర్లకు వాట్సాప్‌ వార్నింగ్​

ABOUT THE AUTHOR

...view details