ETV Bharat / science-and-technology
Switching Android To Iphone : ఈ 10 పాయింట్స్ తప్పకుండా తెలుసుకోండి..! లేదంటే ఇబ్బందే.. - android to iphone
Switching Android To Iphone : చాలా మంది యాపిల్ ఫోన్లు వాడాలనుకుంటారు. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా ఆ కంపెనీ ఉత్పత్తి చేసిన ఇతర వస్తువులను కూడా వాడటానికి ఆసక్తి చూపిస్తారు. మీరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి యాపిల్‌కు మారాలనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఈ 10 విషయాలు తెలుసుకోవాల్సిందే.
ఆండ్రాయిడ్ నుండి ఐఓఎస్ మారడం ఎలా
ప్రస్తుత కాలంలో యాపిల్ ఫోన్లు వాడాలని చాలా మంది అనుకుంటారు. ధర ఎక్కువే అయినప్పటికీ.. సెక్యూరిటీ, బ్రాండ్ విలువ లాంటి కొన్ని కారణాల వల్ల వాటిని ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తారు. అప్పటిదాకా ఆండ్రాయిడ్ ఫోన్ వాడి.. ఐఓఎస్‌కు మారితే అంతా గందరగోళంగా ఉంటుంది. మీరు కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటే మారే ముందు ఈ 10 విషయాలు తప్పకుండా తెలుసుకోండి.
- డేటా బదిలీ
ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కు మారినప్పుడు మీ ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, డాక్యుమెంట్లు ఇతర ఫైల్స్ బదిలీ చేయడం కష్టం. అదే మీరు అప్పటికే ఐఫోన్ కలిగి ఉండి కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ అయితే మాత్రం అదంతా సెట్ చేయడానికి తక్కువ సమయమే పడుతుంది. కంప్యూటర్ విషయంలోనూ అంతే. విండోస్ నుంచి మ్యాక్ బుక్కు ఫైల్స్ బదిలీ కష్టం. - ఐఓఎస్‌ను ఉపయోగించడం చాలా సులభం
జనాలు యాపిల్‌ను ఇష్టపడటానికి గల కారణం.. ప్రొడక్ట్ డిజైన్‌తో పాటు దాని సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం చాలా సులభం. ఆండ్రాయిడ్‌లో ఒక బ్రాండ్ నుంచి మరొక బ్రాండ్‌కి మారిన ప్రతిసారీ ఆ సాఫ్ట్‌వేర్‌ను వాడటం అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. కానీ ఐఫోన్లలో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఫోన్లు అప్‌గ్రేడ్ అవుతున్న ప్రతిసారీ తాజా వెర్షన్‌ను ఉపయోగించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. - ఫైల్ నిర్వహణ కష్టం
డేటా ట్రాన్స్ఫర్ లాగే ఫైల్ మేనేజ్మెంట్ కూడా కష్టం. ఆండ్రాయిడ్‌లో మీరు ఫైల్, ఫోల్డర్ల మేనేజ్ మెంట్, బ్యాకప్ తదితర వాటిని సులభంగా చేసుకునే వారు. కానీ ఐఓఎస్‌లో ఇది అంత సులభం కాదు. కొన్ని రివ్యూల ప్రకారం.. యాపిల్ ఫోన్లలో ఐ క్లౌడ్ నుంచి మీ ఐఫోన్‌కు ఫైళ్లను డౌన్లోడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. - ఆండ్రాయిడ్ ఫీచర్లు కోల్పోవడం
ఆండ్రాయిడ్ వినియోగదారుడిగా ఆ ఫోన్లు వాడుతున్నప్పుడు కొత్త ఫీచర్లు పొందటానికి అలవాటైన మీరు.. ఐఫోన్లలో దాన్ని మిస్ అవుతారు. ఆండ్రాయిడ్‌తో పోలిస్తే.. యాపిల్‌లో తక్కువ ఫీచర్లు ఉంటాయి. కంపెనీ వాటిని తీసుకురావటంలో నిదానంగా వ్యవహరిస్తుంది. దీంతో ఈ విషయంలో మీకు నిరాశ కలగవచ్చు. - కెమెరా క్వాలిటీ
నేడు మధ్య తరగతి ఆండ్రాయిడ్ ఫోన్లు అందించే కొన్ని కెమెరా ఫీచర్లు ఐఫోన్లలో ఉండవు. ఇందులో తక్కువ మెగా పిక్సల్ కలిగిన కెమెరాలు ఉంటాయి. కానీ.. వేగవంతమైన షట్టర్ స్పీడ్, ఉత్తమమైన నాణ్యతతో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. - సాఫ్ట్వేర్ అప్డేట్లు తొందరగా పొందవచ్చు
ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ తయారీదారులు కొత్త సాఫ్ట్వేర్ అప్‌డేట్ ఇవ్వడానికి సమయం తీసుకుంటారు. గూగుల్, శాంసంగ్ వంటి కంపెనీలు ఈ విషయంలో ముందున్నా.. ఇతర సంస్థలు నెమ్మదిగా ఉంటాయి. అదే ఐఫోన్లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. కంపెనీ సాఫ్ట్వేర్ ను విడుదల చేసిన వెంటనే మీరు తాజా అప్డేట్లను పొందవచ్చు. - రకరకాల కంపెనీల గ్యాడ్జెట్స్ వాడలేరు
ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగించేటప్పడు అవి వేరే కంపెనీ అయినా.. ఇయర్ ఫోన్ లాంటి వస్తువుల్ని ఇతర కంపెనీవి వాడే స్వేచ్ఛ ఉండేది. కానీ యాపిల్‌లో అలా కాదు. మీరు ఐఫోన్‌కు మారిన తర్వాత మీకు నచ్చినా.. నచ్చకపోయినా ఎయిర్ పాడ్స్, ఎయిర్ ట్యాగ్స్ వంటి ఆపిల్ ఉత్పత్తుల్నే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. - ఉత్తమమైన కస్టమర్ సర్వీసు అనుభవం
చాలా మంది వినియోగదారులకు మంచి కస్టమర్ కేర్ సర్వీసు అనుభవం కావాలి. ఆండ్రాయిడ్ తయారీదారులు తమ లైనప్ల్లో అనేక ఫోన్లను విక్రయించడం వల్ల సేవల్లో జాప్యం అవుతుంది. కానీ ఈ విషయంలో యాపిల్ పరిస్థితి అలా ఉండదు. కాబట్టి కస్టమర్ల సమస్యలు పరిష్కరించడంలో ఆలస్యం ఉండదు. - మెసేజింగ్ ఎక్స్‌పీరియెన్స్
ఆండ్రాయిడ్‌లో మెసేజింగ్ అనుభవం కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మొబైల్ తన సొంత ఫ్రీ ఇన్‌స్టాల్డ్ యాప్‌ను ఉపయోగిస్తుంది. ఫోన్ మారేకొద్దీ ఆ అనుభవం మారుతుంది. అదే యాపిల్‌లో అయితే.. ఈ విషయంలో మంచి ఫీచర్ ఉంటుంది. ఉపయోగించే వారికి సౌకర్యంగానూ ఉంటుంది. - ఆప్టిమైజ్డ్ యాప్స్, గేమ్స్
యాపిల్ ఏటా కొన్ని ఫోన్లు మాత్రమే విడుదల చేస్తుంది. కాబట్టి దాని డెవలపర్స్ అందులో ఆప్టిమైజ్డ్ యాప్స్, గేమ్స్ తయారు చేస్తారు. దీని వల్ల వాటి వినియోగం సులభమవుతుంది.
యాపిల్ ఉత్పత్తులు వాడటానికి కొన్ని విషయాల్లో రాజీ అవసరం. మీరు దానికి సిద్ధమైతే ఉపయోగించవచ్చు.