తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మీ ఫోన్ 'డబుల్ స్పీడ్'​తో పనిచేయాలా?.. సింపుల్​గా ఈ సెట్టింగ్స్ మార్చేస్తే చాలు! - ఆండ్రాయిడ్ డెవలపర్ ఆప్షన్స్ సెట్టింగ్స్

మీ మొబైల్ రెట్టింపు వేగంతో పనిచేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? మీ ఫోన్ పెర్ఫార్మెన్స్ మరింత వేగంగా ఉండాలని భావిస్తున్నారా? అయితే ఈ టిప్స్, టెక్నిక్స్ పాటిస్తే చాలు! మునుపటి కంటే మీ మొబైల్ డబుల్ స్పీడ్​తో పనిచేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.

Change this Android setting to boost your phone speed
Change this Android setting to boost your phone speed

By

Published : Apr 23, 2023, 8:15 AM IST

ఇంటర్నెట్ విప్లవం అనంతరం స్మార్ట్ ఫోన్​ల వినియోగం తారాస్థాయికి చేరుకుంది. చిన్న పిల్లాడి నుంచి బామ్మ వరకు అందరూ మొబైల్స్​ను వాడుతున్నారు. వీటిలో దాదాపు 95 శాతం వరకు ఆండ్రాయిడ్ ఫోన్​లే ఉంటాయి. ఐఓఎస్ ఆధారిత యాపిల్ ఫోన్​లు ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఆండ్రాయిడ్ ఫోన్​లు వాడుతున్న కొద్దీ వాటిల్లో వేగం తగ్గుతుంది. రానురానూ మొబైల్ నెమ్మదిస్తుంది. ఒక్కోసారి తీవ్రంగా మొరాయిస్తుంది. ఎక్కువ యాప్స్ ఇన్ స్టాల్ చేయడం వల్ల, ఎడతెరపి లేకుండా వాడటం లేదా ఇతరత్రా సాంకేతిక కారణాల వల్ల మొబైల్స్ మొరాయిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు పాటించడం ద్వారా ఫోన్​ల వేగాన్ని మరింత పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఫోన్​లు ఎక్కువగా వాడేవారిలో యువత అధికంగా ఉన్నారు. వీరికి మొబైల్ వినియోగంపై కాస్త పరిజ్ఞానం ఉంటుంది. అయితే కుటుంబసభ్యుల్లో కాస్త వయసు మీరిన వారికి వీటి గురించి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఫోన్ల వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఫోన్​లు మరింత ఫాస్ట్​గా పనిచేయాలంటే యానిమేషన్ స్పీడ్​ను అడ్జస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత శామ్​సంగ్, వన్​ప్లస్, మోటోరోలా, గూగుల్ ఫోన్లతో పాటు మిగతా వాటికీ పనిచేస్తుందని అంటున్నారు.

యానిమేషన్ స్పీడ్​ను మార్చండిలా..

  • యానిమేషన్ స్పీడ్ సెట్టింగ్స్​ను మార్చాలంటే ముందుగా 'డెవలపర్ ఆప్షన్స్'​లోకి వెళ్లాలి.
  • ఇందులో 'లిస్ట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్', 'యూఐ స్పెసిఫిక్ సెట్టింగ్స్' ఉంటాయి. అయితే, ఇవి డెవలపర్స్ కోసం మాత్రమే ఉంటాయి.
  • 'డెవలపర్' ఆప్షన్​ను ఎనేబుల్ చేయాలంటే సెట్టింగ్స్​లోకి వెళ్లాలి.
  • స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే 'అబౌట్ ఫోన్' ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఈ ఆప్షన్ లోకి వెళ్లి 'సాఫ్ట్​వేర్ ఇన్​ఫర్​మేషన్'ను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత 'బిల్డ్ నంబర్' అనే ఆప్షన్ మీద 7 సార్లు క్లిక్ చేయాలి.
  • ఒకవేళ మీరు మొదటిసారి గనుక ఇలా చేస్తుంటే ఇంకెన్ని సార్లు ట్యాప్ చేయాలో అదే చూపిస్తుంది. ఇది పూర్తయితే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోతుంది.
  • ఆ తర్వాత 'డీఫాల్ట్ సెట్టింగ్స్' పేజీలోకి వెళ్లి డెవలపర్ ఆప్షన్స్​ను ఓపెన్ చేయాలి.
  • డెవలపర్ మోడ్​లో ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో 'డ్రాయింగ్ సెక్షన్'లోకి వెళ్లాలి.
  • ఆ ఆప్షన్ కనిపించేంత వరకు స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండాలి.
  • అందులోకి వెళ్తే మూడు 'యానిమేషన్ స్కేల్ సెట్టింగ్స్' కనిపిస్తాయి.
  • 'విండో యానిమేషన్ స్కేల్'ను అడ్జస్ట్ చేయడం ద్వారా యాప్స్, విండో పాప్-అప్స్ వేగాన్ని పెంచొచ్చు.
  • హోమ్ స్క్రీన్ ప్యానెల్స్ నుంచి యాప్స్ మధ్య వేగంగా మారేందుకు 'ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్'ను అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది.
  • యాప్స్, ఫోన్ అన్ లాకింగ్ యూజర్ ఇంటర్ ఫేస్ యానిమేషన్స్​ను మార్చాలంటే.. 'యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్'ను సెట్ చేసుకోవాలి.
  • ప్రతి ఆప్షన్ మీద క్లిక్ చేసి స్కేల్ రేటింగ్​ను 1 ఎక్స్ (డీఫాల్ట్)గా ఉన్నదాన్ని 0.5 ఎక్స్​కు మార్చుకోవాలి.
  • మీరు సంఖ్యా విలువను ఎంత తక్కువకు మార్చితే యానిమేషన్ వేగం అంత పెరుగుతుంది.
  • మీ మొబైల్​లో అసలు యానిమేషన్స్ వద్దనుకుంటే వాల్యూను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details