తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

అక్టోబర్​లో మార్కెట్లోకి అమెజాన్​ బ్రాండ్ టీవీలు - అమెజాన్ ఫైర్ టీవీ ఓమ్నీ సిరీస్

అమెజాన్​ బ్రాండ్​ టీవీలు త్వరలోనే మార్కెట్​లోకి రానున్నాయి. అమెజాన్ ఫైర్ టీవీ ఓమ్నీ సిరీస్​, అమెజాన్ ఫైర్ టీవీ 4సిరీస్​ అనే రెండు వేరియంట్లను తీసుకురానుంది ఆ సంస్థ. వాయిస్​ కంట్రోల్​తోనే టీవీలను ఆపరేట్​ చేసేలా వీటిని రూపొందించింది అమెజాన్. మరి వీటి ఫీచర్లు, ధర ఎంత ఉందో తెలుసుకోండి.

Amazon TVs
అమెజాన్​ బ్రాండ్ టీవీలు

By

Published : Sep 11, 2021, 7:00 AM IST

ఇప్పటికే అనేక వ్యాపారాల్లో ఉన్న దిగ్గజ సంస్థ అమెజాన్.. సొంత బ్రాండ్ టీవీలను తీసుకొస్తున్నట్లు గురువారం ప్రకటించింది. రెండు వేరియంట్లలో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. ఒకటి హైఎండ్ అమెజాన్ ఫైర్ టీవీ ఓమ్నీ సిరీస్ కాగా, రెండోది అందుబాటు ధరలో ఉండే అమెజాన్ ఫైర్ టీవీ 4సిరీస్. రూ.27వేల నుంచి రూ.80వేల రేంజ్​లో వీటిని అక్టోబర్​ను మార్కెట్లోకి తీసుకురానుంది.

ఇప్పటివరకు టీవీల్లో ప్లగ్​ఇన్​ చేసుకునే స్ట్రీమింగ్ స్టిక్స్​ను మాత్రమే అమెజాన్ అమ్మింది. తోషిబా, ఇన్​సిగ్నియా లాంటి సంస్థలతో అమెజాన్ ఫైర్​ ఇంటర్​ఫేస్​తో టీవీ సెట్స్​ను రూపొందించడానికి కలిసి పనిచేసింది. దాని ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో సహా ఇతర స్ట్రీమింగ్ సేవలను వాయిస్ కంట్రోల్​ ద్వారా యాక్సెస్ చేయొచ్చు.

త్వరలోనే సొంతంగా టీవీలు..

ప్రస్తుతానికి డిజైన్, తయారీలో థర్డ్​ పార్టీ సహకారం తీసుకుంటున్న అమెజాన్.. త్వరలోనే సొంతంగా టీవీలను తయారు చేసుకోవాలని భావిస్తోంది. తద్వారా ఫైర్​ టీవీ సాఫ్ట్​వేర్​ను అలెక్సా వాయిస్​ కంట్రోల్​తో మెరుగ్గా ఇంటిగ్రేట్​ చేస్తామని చెబుతోంది. అంతేకాక, పోటీదారులను ఇరకాటంలో పెట్టేలా సొంతంగా ధరలను నిర్ణయించే స్వేచ్ఛ కూడా లభిస్తుంది.

అమెజాన్ ఫైర్ టీవీ ఓమ్నీ సిరీస్​

అమెజాన్ ఓమ్నీ సిరీస్
  • హైయర్-ఎండ్ అమెజాన్ ఫైర్ టీవీ ఓమ్నీ సిరీస్​ ఐదు సైజుల్లో రాబోతోంది. 43 అంగుళాలు- రూ.30వేలు ($409.99), 50 అంగుళాలు-రూ.37,500 ($509.99), 55 అంగుళాలు-రూ.41వేలు ($559.99), 65 అంగుళాలు-రూ.61వేలు ($829.99), 75 అంగుళాలు-రూ.80వేలు ($1,099.99).
  • 'ఫైర్​ టీవీ క్యూబ్​' లాగానే రీమోట్​ వాడకుండా వాయిస్​తోనే ఈ టీవీని కంట్రోల్ చేయొచ్చు. మనకు నచ్చిన టీవీ షో, సినిమా, మ్యూజిక్ పెట్టమని, వాతావరణ సమాచారం కోరడం, ఇంట్లోని స్మార్ట్ పరికరాలను కంట్రోల్ చేయడం, టీవీ చూస్తుండగానే స్మార్ట్​ హోమ్​ కెమేరాలను తెరపై చూడటం లాంటివెన్నో ఈ టీవీలో ఉంటాయి.
  • డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియో సపోర్ట్
  • ఇంట్లోని ఎకో స్పీకర్లను ఆటోమెటిక్​గా గుర్తించి, వాటిని స్టీరియో లేదా సరౌండ్ సౌండ్ టీవీ స్పీకర్స్​గా వాడొచ్చు.
  • 65, 75 అంగుళాల వెర్షన్​లలో మరింత కలర్​ఫుల్​ డాల్బీ విజన్ హెచ్​డీఆర్

అమెజాన్ ఫైర్ టీవీ 4 సిరీస్​

అమెజాన్ ఫైర్ టీవీ 4 సిరీస్
  • 43 అంగుళాలు-రూ.27వేలు ($369.99), 50 అంగుళాలు- రూ.34,500 ($469.99), 55 అంగుళాలలో-రూ.38వేలు ($519.99) అమెజాన్ ఫైర్ టీవీ 4 సిరీస్​ విడుదలకానుంది.
  • వీటిల్లో మోడర్న్​ లుక్​ ఉండకపోవచ్చు. వెబ్​ క్యామ్​ సదుపాయం కూడా లేకపోవచ్చు.
  • వాయిస్​ రీమోట్​లోని అలెక్సా బటన్​ నొక్కిన తర్వాతే 4సిరీస్​ను అలెక్సాతో ఇంటిగ్రేట్ చేయవచ్చు. ఓమ్నీ సిరీస్​ టీవీల్లో లాగా 4సిరీస్​లో నేరుగా టీవీతో మాట్లాడే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే కొన్ని సినిమాలు, టీవీ షోలు లాంటివి ప్లే చేయమని, స్పోర్ట్స్​ స్కోర్లు, వాతావరణ సమాచారం అడిగే అవకాశం ఉంది.
  • హెచ్​ఎల్​జీ, హెచ్​డీఆర్​10 లాంటి ఆధునిక సాంకేతికతో 4సిరీస్​ వస్తోంది. అయితే వీటిలో ఓమ్నీలోలాగా డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదని సమాచారం.

ఇదీ చూడండి:Amazon Alexa: ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ అలెక్సా

ABOUT THE AUTHOR

...view details