ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో కలిసి అంతరిక్షయానానికి వెళ్లేందుకుసిద్ధమైన వ్యక్తిఆ యాత్రను విరమించుకున్నారు. ఆన్లైన్ బిడ్డింగ్‌లో దాదాపు 28 మిలియన్ డాలర్లు (రూ.206 కోట్లు) చెల్లించిన అతను.. అంతరిక్ష ప్రయాణానికి సమయం లేదని చెబుతున్నాడట. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కారణంగానే ఈ యాత్ర చేయలేకపోతున్నట్లు అతను చెప్పారని, అందువల్ల ప్రయాణ తేదీని పొడిగించాలని కోరుతున్నారని 'బ్లూ ఆరిజిన్' ఓ కథనంలో వెల్లడించింది.
ఇక కష్టమే..
బిడ్డింగ్ గెలుచుకున్న వ్యక్తి ట్రిప్‌కు నిరాకరించినందున 18 ఏళ్ల ఆలివర్ డెమెన్ అనే యువకుడు ఈ యాత్రలో భాగం అవుతాడని బ్లూ ఆరిజిన్ ప్రకటించింది. దీనితో అంతరిక్షయానం చేయనున్న చిన్న వయస్కుడిగా డెమెన్ రికార్డులకెక్కనున్నాడు. ఇదే యాత్రలో బెజోస్‌తో పాటు ప్రయాణించనున్న మరో వ్యక్తి.. 82 ఏళ్ల వాలీ ఫంక్ అంతరిక్షంలో విహరించనున్న పెద్ద వయస్కుడిగా నిలిచిపోనున్నారు.
వీరిద్దరితో పాటు బెజోస్, అతని సోదరుడు మార్క్‌లు న్యూ షెపర్డ్ రాకెట్‌లో నింగిలోకి వెళతారు. అమెరికాలోని టెక్సాస్ లాంచ్ ప్యాడ్ నుంచి జులై 20న బయలుదేరనున్న ఈ ప్రయోగ కార్యక్రమం https://www.blueorigin.com లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇవీ చదవండి: