యూత్‌ను ఆకట్టుకోవడానికి మరో కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్. కొత్తగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే 18-24 మధ్య ఉన్న వయసు గల వారికి 50శాతం రాయితీ అందిస్తోంది. ఏడాది, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ప్రైమ్ వీడియో, మ్యూజిక్, ఫ్రీ డెలివరీ వంటి సదుపాయాలను పొందేందుకు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు.. ఏడాదికి రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడు నెలల కాలానికి రూ.329 చెల్లించాలి. యూత్ ఆఫర్ కింద దీన్ని సగం ధరకే పొందాలంటే యూజర్.. ఆధార్/పాన్/ ఓటర్ ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్ వాటిల్లో ఏదైనా గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫీని కూడా పంపించాల్సి ఉంటుంది.