ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో ఉచిత వీడియో స్ట్రీమింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మినీ టీవీ పేరుతో ఈ సేవలను అందిస్తోంది. వెబ్ సరీస్‌లు, కామెడీ షోలు, కుకింగ్ సహా వివిధ ఇతర వీడియోలను ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా చూసేందుకు వీలుంది.
ETV Bharat / science-and-technology
అమెజాన్ షాపింగ్ యాప్‌లో ఫ్రీగా వెబ్ సిరీస్‌లు! - అమెజాన్ మినీ టీవీలో వీడియోలు చూడటం ఎలా
భారత్‌లో యూట్యూబ్ తరహా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. మినీ టీవీ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ఉచితంగా వీడియోలు చూసే వీలుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే మినీ టీవీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ మినీ టీవీ
అమెజాన్ షాపింగ్ యాప్‌లో మినీ టీవీ బ్యానర్‌పై క్లిక్ చేయడం ద్వారా వీడియోలను చూసే అవకాశం ఉంది. వీడియోల మధ్యలో ప్రకటనలు వస్తాయని స్పష్టం చేసింది అమెజాన్. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రమే మినీ టీవీ సేవలు వినియోగించుకునే వీలుంది. ఐఓఎస్, వెబ్ యూజర్లకు త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.