భవిష్యత్(amazon gadgets sale 2021) అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త గృహ పరికరాలను అందుబాటులోకి తెచ్చింది అమెజాన్. ఇవి కొత్త చరిత్రను సృష్టించినా ఆశ్యర్యపోనవసరం లేదు! అవి ఏంటంటే...
ఆస్ట్రో ఆసరా!
ఇదో రోబో(astro robot). చాలా భిన్నమైంది. ఇంటి మీద ఓ కన్నేసి ఉంచటానికి, కుటుంబంతో సన్నిహితంగా మెలగటానికి దీన్ని రూపొందించారు. అలెక్సా చేసే పనులన్నింటినీ ఆస్ట్రో(astro robot amazon price) చేస్తుంది. మరి దీని ప్రత్యేకత ఏంటి? ఇది అలెక్సా మాదిరిగా ఒకదగ్గరే ఉండదు. ఇంట్లో మనల్ని వెన్నంటి వస్తుంది. మెట్లు కూడా ఎక్కగలదు! రింగ్ సెన్సర్‌తో (కెమెరా) చుట్టుపక్కల ప్రాంతాలను స్కాన్ చేస్తుంది. ఇంట్లో వదిలిపెడితే ఎంచక్కా కాపలా కాసేస్తుంది. దీనికి 12ఎంపీ కెమెరాతో కూడిన పెరిస్కోప్ ఉంటుంది మరి. ఇది 42 అంగుళాల ఎత్తువరకు లేవగలదు. దీంతో టేబుళ్ల వంటి ఎత్తు ఫర్నిచర్ మీదున్న వస్తువులనూ చూడగలదు. ఆస్ట్రో కెమెరాతో వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. అనుసంధానించిన ఫోన్ యాప్ ద్వారా ఇంట్లో ఏం జరుగుతోందో చూడొచ్చు. టెలిస్కోపిక్ గొట్టానికి ఉండే చిన్న మైకులతో మనం చెప్పే ఆదేశాలను ఇట్టే గ్రహిస్తుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 2 గంటల సేపు వీడియో కాల్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పనులైతే ఇంకాస్త ఎక్కువ సేపే చేసి పెడుతుంది. ఛార్జింగ్ నిండుకుంటుంటే దానంతటదే ఛార్జింగ్ డాక్‌కు వెళ్లిపోతుంది. ఇది సెకనుకు మూడు అడుగుల వేగంతో ముందుకు వెళ్తుంది. దీనికి వెనకవైపున రెండు కిలోల బరువును మోసే ఏర్పాటు కూడా ఉంటుంది. అంటే ఏదైనా వస్తువును దీని మీద పెడితే ఇంట్లో ఎక్కడికైనా తీసుకొచ్చేస్తుందన్నమాట. హద్దులు నిర్ణయిస్తే ఆస్ట్రో ఆ భాగంలోనే సంచరిస్తుంది. వాటిని దాటి బయటకు వెళ్లదు. వద్దనుకుంటే మైకు, కెమెరాలను ఆఫ్ చేసుకోవచ్చు.
గ్లో ప్రకాశం!
ఇంటి నుంచే చదువులు కొనసాగుతున్న తరుణంలో రూపొందించిన పరికరమిది. పేరు గ్లో. నిజానికిదో స్మార్ట్ డిస్‌ప్లే గ్యాడ్జెట్. దృఢమైన స్టాండ్‌లో పెద్ద ట్యాబ్లెట్ అమరికతో కూడిన ఇందులో ఇన్‌బిల్ట్‌గా ప్రొజెక్టర్, సెన్సర్లు కూడా ఉంటాయి. చూడటానికి పెద్ద సెల్‌ఫోన్‌లా కనిపించినప్పటికీ.. దీంతో పెద్దవాళ్లతో పిల్లలు తేలికగా అనుసంధానం కావొచ్చు. పిల్లలకు వీడియో కాల్ చేసినంత మాత్రాన సరిపోతుందా? అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఆడుకోవాలని ఉండదూ? గ్లోతో అలాంటి కొరత తీరిపోతుంది. ఎక్కడో దూరంగా ఉండే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో.. ఆఫీసుకు వెళ్లిన అమ్మానాన్నలతో ఆడుకోవచ్చు, బొమ్మలు గీసుకోవచ్చు. కలిసి పాఠాలు చదువుకోవచ్చు. గ్లో పరికరం ప్రొజెక్టర్ ముందుండే మ్యాట్ మీద ఆయా అంశాలను ప్రొజెక్ట్ చేస్తుంది. అవతలి నుంచి వీడియో కాల్‌లో మాట్లాడుతున్న పెద్దవాళ్లు ఐఓఎస్‌లోని గ్లో యాప్ లేదా ఆండ్రాయిడ్, కిండిల్ ఫైర్ పరికరాల ద్వారా పిల్లలతో కలిసి ఆయా పనులు చేసుకోవచ్చు. ఉదాహరణకు- తాతయ్య పిల్లలకు కథలను చదివి వినిపించొచ్చు. తాతయ్య అక్కడ్నుంచే పేజీని తిప్పితే ఇక్కడా పేజీ మారిపోతుంది. గ్లో పరికరానికి అడుగున ఉండే ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ పిల్లల వేళ్లు మ్యాట్ మీద ఎక్కడున్నాయనేది గుర్తిస్తాయి. పిల్లలు ఎవరెవరితో కాంటాక్ట్ అవ్వాలనేది జాబితాలోంచి ఎంచుకోవచ్చు. దీంతో జాబితాలో లేనివారితో సంభాషించటానికి వీలుండదు.
ఎకో చిత్రం!
అటు ఫొటో ఫ్రేమ్(echo show specifications). ఇటు టీవీ. ఇలా కళాత్మకంగా రకరకాలుగా అలరించేదే ఎకో షో 15(echo show special deal). అన్నింటినీ.. అంటే క్యాలెండర్ అపాయింట్‌మెంట్లు, స్టికీ నోట్ రిమైండర్‌లు, షాపింగ్ జాబితాలు ఒకేచోట చూడాలని కోరుకునే వారికోసం దీన్ని రూపొందించారు(echo show amazon). చూడటానికి ఫ్రేమ్ మాదిరిగా కనిపించే దీన్ని గోడకు తగిలించుకోవచ్చు. కావాలంటే టేబుల్ మీద అమర్చుకోవచ్చు. పెద్ద తెర ఉండటం వల్ల ఒకేసారి చాలా పనులు చేసుకోవచ్చు. ఉదాహరణకు- ఒకవైపు సినిమా చూస్తూనే మరోవైపు సెక్యూరిటీ కెమెరా దృశ్యాలను పరిశీలించొచ్చు. వంటింట్లో టీవీ మాదిరిగానూ ఉపయోగించుకోవచ్చు. డిజిటల్ ఫ్రేమ్‌గా ఉపయోగించుకోవాలనుకుంటే ల్యాండ్‌స్కేప్ మోడ్‌లోకి మార్చుకుంటే సరి. ముందు భాగాన ఉండే 5ఎంపీ కెమెరాను వీడియో కాల్స్ కోసమూ వాడుకోవచ్చు.
ఇదీ చూడండి: రూ.15వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!