తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

పాత టీవీలను స్మార్ట్​టీవీలుగా మార్చుకునే ఛాన్స్.. రూ.1500లకే బంపర్ ఆఫర్ - ఎయిర్​టెల్ సెట్​టాప్ బాక్స్ ప్రైజ్ న్యూస్

ఎయిర్​టెల్ ఇండియా సరికొత్త ఆఫర్​తో ముందుకొచ్చింది. సాధారణ టీవీలను రూ.1500లకే స్మార్ట్ టీవీలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అదెలాగో తెలుసుకుందాం రండి..

Airtel Can Convert Your TV into Smart TV for Just Rs 1500
పాత టీవీలను స్మార్ట్​టీవీలుగా మార్చుకునే అవకాశం

By

Published : Dec 28, 2022, 3:09 PM IST

ఎయిర్​టెల్ కస్టమర్లకు గుడ్​న్యూస్! సాధారణ టీవీలను కేవలం రూ.1500లకే స్మార్ట్ టీవీలుగా మార్చుకునే అవకాశాన్ని ఎయిర్​టెల్ అందిస్తోంది. ఎయిర్​టెల్ ఎక్స్​ట్రీమ్​ బాక్స్​ ద్వారా పాత టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వినోదం కోసం కుటుంబ సమేతంగా టీవీ చూసే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ ప్రకటించింది. ఓటీటీల వినియోగం పెరిగినప్పటికీ ఇలాంటి కుటుంబాలు ఇంకా ఉన్న నేపథ్యంలో.. వారికి స్మార్ట్ వినోదం పరిచయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఏంటీ ఎక్స్​ట్రీమ్ బాక్స్?
ఎయిర్​టెల్ ఎక్స్​ట్రీమ్​ బాక్స్.. ​పాత టీవీలలోనే నేరుగా ఓటీటీ కంటెంట్​ను ప్రసారం చేస్తుంది. దీని ద్వారా స్మార్ట్​ టీవీలు అవసరం లేకుండానే.. సాధారణ టీవీలలో ఓటీటీలోని సినిమాలు, షోలను ఆస్వాదించవచ్చు. ఎక్స్​ట్రీమ్ బాక్స్ అసలు ధర రూ.2,650. అయితే తమ వినియోగదారులకు ఈ ఎక్స్​ట్రీమ్​ బాక్స్​ను కేవలం రూ.1500లకే అందిస్తోంది ఎయిర్​టెల్. ఈ ఎక్స్​ట్రీమ్​ సెటప్ బాక్స్ ద్వారా.. సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్, ఈరోస్ నౌ, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి అనేక ఓటీటీ ప్లాట్​ఫామ్​లోని కంటెంట్​ను చూడవచ్చు.

ఎయిర్​టెల్ ఎక్స్​ట్రీమ్​ బాక్స్ టాప్ ఫీచర్స్:

  • 5000కు పైగా యాప్స్​కు సపోర్ట్ చేస్తుంది.
  • క్రోమ్​క్యాస్ట్ సౌకర్యం
  • 500కు పైగా టీవీ ఛానల్స్
  • సెర్చ్ విత్ గూగుల్ అస్సిస్టెంట్
  • ఆండ్రాయిడ్ టీవీ 9

ఈ ఫీచర్లతో పాటు.. 4కే రిజల్యూషన్ కంటెంట్​ను ఈ సెటప్ బాక్స్ అందిస్తుంది. ఈ బాక్స్​ను కంపెనీ వెబ్‌సైట్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా దగ్గర్లోని ఎయిర్​టెల్ రిటైల్ స్టోర్​కు వెళ్లినా.. ఈ సెటప్ బాక్స్ దొరుకుతుంది. కాగా, ఇలాంటి ఫీచర్లతోనే మార్కెట్లో మరో సెటప్ బాక్స్ అందుబాటులో ఉంది. 'టాటా ప్లే బింజ్+' పేరుతో టాటా స్కై కంపెనీ ఇలాంటి ఓటీటీ సెటప్ బాక్స్​ను అందిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details