AI Usage In Samsung S24 Series : భవిష్యత్ అంతా కృత్రిమ మేథస్సు-ఏఐదే. అంతటా వినిపిస్తున్న మాట ఇది. దిగ్గజ సంస్థల నుంచి సామాన్య జనం వరకు అంతా AI జపమే చేస్తున్నారు. ప్రజల జీవితాల్లో పెను మార్పులకు ఏఐ బాటలు వేస్తుందని అంచనాలు వేస్తున్నారు. పెద్దగా శ్రమలేకుండా పనిచేసే వెసులుబాటు లభిస్తుందని మైక్రోసాఫ్ట్ మద్దతిస్తున్న ఓపెన్ AI నిరూపిస్తోంది. ఇదే ఒరవడిని టెక్ సంస్థల నుంచి గాడ్జెట్ల తయారీ సంస్థల వరకు అన్నీ అందిపుచ్చుకుంటున్నాయి.
గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ కూడా ఆ జాబితాలో చేరింది. తాజాగా గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24 Series Launch) సిరీస్ ఫోన్లను విడుదల చేసిన శాంసంగ్, AIను జోడించి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఎస్24, ఎస్24+, ఎస్24 అల్ట్రా పేరిట తీసుకొచ్చిన మూడు కొత్త ఫోన్లలో ఫ్రాసెసర్ల నుంచి కెమెరా వరకూ ఎన్నో ఆధునిక పరికరాలను సమకూర్చింది. సిమ్, ఇంటర్నెట్ లేకుండా మొబైల్‌లో టీవీ ప్రసారాలు అయ్యే ఫీచర్లు తెచ్చింది. గెలాక్సీ S24లో సొంతంగా అభివృద్ధి చేసిన అనేక AI ఫీచర్లతో శామ్‌సంగ్ ఆశ్చర‌్య పరుస్తోంది. గూగుల్‌పై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తోంది.
లైవ్‌లోనే 13 భాషలు, 17 మాండలికాల్లో
ఏదైనా ఇమేజ్ లేదా వీడియో చూస్తున్నప్పుడు అందులో నచ్చిన అంశం లేదా భాగాన్ని సర్కిల్ చేస్తే దాని గురించి సమగ్ర వివరాలను అందించే కొత్త టూల్‌ను S24 ఫోన్లలో శామ్‌సంగ్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ కాల్ వింటున్నప్పుడే లైవ్‌లోనే 13 భాషలు, 17 మాండలికాల్లోకి భాషను అనువదించే ఫీచర్‌ను AI ద్వారా సమకూర్చింది.