తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

'AIతో ఉద్యోగాలు ఉఫ్​.. అది నిజమే'.. బాంబు​ పేల్చిన చాట్​జీపీటీ సీఈవో - ఆర్టిఫిషియల్‌ ఇంటిలెజెన్స్‌ వార్తలు

AI Job Loss Predictions : ఆర్టిఫిషియల్‌ ఇంటిలెజెన్స్.. సాంకేతిక రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఈ సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయనే ఊహాగానాలు అమెరికా నుంచి ఉత్తర కొరియా వరకు వినిపిస్తున్నాయి. ఆ ప్రచారం నిజమేనని చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్‌ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ కూడా అంగీకరించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు మాయం అవుతాయని ఆయన బాంబు పేల్చారు.

ai job loss predictions
ai job loss predictions

By

Published : Jul 30, 2023, 7:14 AM IST

AI Job Loss Predictions : కొత్త సాంకేతిక వచ్చిన తొలినాళ్లలో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు రేకెత్తడం సహజం. ప్రస్తుతం చాట్‌జీపీటీ తరహా ఆర్టిఫిషియల్‌ ఇంటిలెజెన్స్‌పైనా అదే తరహా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ రూపకర్త, చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ సంస్థ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల ఉద్యోగాలు మాయం అవుతాయని ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు.

AI job Loss Statistics : కృత్రిమ మేథ కేవలం మనిషికి అనుబంధంగా పనిచేస్తుందని, ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదంటూ చేస్తున్న వాదనలను ఆల్ట్‌మన్‌ తోసిపుచ్చారు. ఉద్యోగాలు కచ్చితంగా ప్రభావితమవుతాయని ఆల్ట్‌మ్యాన్ చెప్పారు. గతేడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీ అనూహ్య ఆదరణ సొంతం చేసుకుందని ఆయన తెలిపారు. చాట్‌జీపీటీ ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. అలాగని ఏఐ టూల్స్‌ అన్నీ పరిపూర్ణం కావని, వాటికీ కొన్ని పరిమితులు ఉన్నాయని వివరించారు. మానవులపై ఏఐ ప్రభావం పూర్తిగా సానుకూలంగా ఉండకపోవచ్చని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు.

AI Job Loss ChatGpt CEO : ప్రస్తుతం ఉన్న చాట్‌జీపీటీ కన్నా శక్తివంతమైన ఏఐని అభివృద్ధి చేయగల సత్తా ఓపెన్‌ఏఐకి ఉన్నా... ఇప్పటికిప్పుడే విడుదల చేసేందుకు తాము సుముఖంగా లేమని తెలిపారు. ప్రజలు కూడా అందుకు సిద్ధంగా లేరని, తద్వారా తలెత్తే పరిణామాలను ఊహించడం కూడా కష్టమని ఆల్ట్‌మన్‌ చెప్పారు. ఏఐ అభివృద్ధి సమాజంలో మనిషికి సవాల్‌గా మారకూడదని అభిప్రాయపడ్డారు. మానవ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటూ ఉద్యోగాలకు అంతరాయం ఏర్పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై నిరంతర పర్యవేక్షణ, నియంత్రణ అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

AI Job Loss Reddit : కృత్రిమ మేధతో చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయని ఇటీవలేఅంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్ మన్ శాక్స్ బాంబు పేల్చింది. కృత్రిమ మేధ సాంకేతికతలో వస్తున్న కొత్త ఒరవడులు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది. ఆర్థిక ప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావం ముప్పు పేరుతో చేసిన పరిశోధనా అంశాలను గోల్డ్‌మన్ శాక్స్ వెల్లడించింది. చాట్​జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్.. అంచనాల మేరకు పనిచేస్తే శ్రామికరంగంలో ఒడిదొడుకులు ఉంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావం గణనీయంగా పడే జాబ్స్ ఏవనేది ఓ సారి తెలుసుకోవాలంటే ఈ లింక్​పైక్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details