తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మరణం ఎప్పుడో చెప్పే ఏఐ టూల్! 78% పర్ఫెక్ట్​ ప్రిడిక్షన్! ఎలా పనిచేస్తుందంటే? - ఎప్పుడు చనిపోతారో చెప్పే ఏఐ టూల్

AI Death Predictor Tool Life2vec : ఏ వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు? తన జీవితం మొత్తంలో ఎంత సంపాదిస్తాడు? ఏ మనిషి జీవితకాలం ఎంత? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. కానీ వీటికి శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు! సైన్స్​కు టెక్నాలజీ జోడించి మరణాన్ని అంచనా వేసే ఏఐ టూల్​ను రూపొందించారు. 78 శాతం కచ్చితత్వంతో ఇది పనిచేస్తుందని తేలింది. ఈ టూల్ ఎలా పనిచేస్తుందంటే?

ai death predictor tool denmark
ai death predictor tool denmark

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 5:30 PM IST

AI Death Predictor Tool Life2vec :మరణాన్ని అంచనా వేసే క్యాల్​క్యులేటర్​ను శాస్త్రవేత్తలు రూపొందించారు. మనుషులు ఎంత కాలం జీవిస్తారు? ఎంత సంపాదిస్తారు? అనే విషయాలను మెరుగ్గా అంచనా వేయగలిగే అల్గారిథమ్​ను తయారు చేశారు. వ్యక్తుల వివరాలు, అలవాట్లు, పద్ధతులు తదితర సమాచారాన్ని ఉపయోగించుకొని మరణాన్ని అంచనా వేసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్​ను సిద్ధం చేశారు. ఇది 78 శాతం కచ్చితత్వంతో పని చేస్తోందని తాజా పరిశోధనలో తేలింది.

డెన్మార్క్, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి 'లైఫ్​2వెక్' అనే ఏఐ మోడల్​ను రూపొందించారు. ఇది చాట్​జీపీటీ తరహాలో పనిచేస్తుంది. ఇతర మోడళ్ల తరహాలో కాకుండా చాట్​బాట్ మాదిరిగా యూజర్లతో నేరుగా సంభాషించి సమాచారం సేకరిస్తుంది. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్​ను ఉపయోగించి ఈ ఏఐ మోడల్​కు విస్తృతమైన డేటాను అందించారు. ఆదాయం, వృత్తి, నివాసం ఉండే చోటు, ప్రెగ్నెన్సీ హిస్టరీ, గాయాలు తదితర సమాచారంతో కూడిన 60 లక్షల మంది వ్యక్తుల వివరాలను దీనికి ఇచ్చారు. ఓ వ్యక్తి ఎంత త్వరగా చనిపోయే అవకాశం ఉంది? వారి జీవిత కాలంలో సంపాదించే ఆదాయం ఎంత? వంటి విషయాలను ఇది అంచనా వేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఈ మోడల్ ప్రకారం ఈ కింది లక్షణాలు ఉన్నవారు త్వరగా చనిపోయే అవకాశం ఉంది

  • మగవారు
  • మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
  • నైపుణ్యం కలిగిన వృత్తిలో ఉన్నవారు

ఎక్కువ కాలం జీవించేందుకు కారకాలు ఇవే!

  • అధిక ఆదాయం
  • నాయకత్వ బాధ్యతల్లో ఉండటం

78 శాతం మంది విషయంలో సరైన ప్రిడిక్షన్!
2008 నుంచి 2016 మధ్య డేటాతో దీనికి ట్రైనింగ్ ఇచ్చారు. లక్షల మందికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఆ సమాచారం ఆధారంగా 2020 నాటికి ఎంత మంది చనిపోయి ఉంటారన్న విషయం చెప్పాలని ఏఐని శాస్త్రవేత్తలు అడిగారు. ఇందులో 78 శాతం మంది విషయంలో ఏఐ మోడల్ అంచనాలు సరైనవే అని తేలింది. ఈ పరిశోధనా ఫలితాలు 'నేచర్ కంప్యుటేషనల్ సైన్స్' జర్నల్​లో పబ్లిష్ అయ్యాయి. అయితే, వ్యక్తిగత ఫలితాలను ఈ పరిశోధనలో భాగమైన వారెవరికీ చెప్పలేదు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్

"పరిశోధనకు సంబంధించిన మరిన్ని ఫలితాలను షేర్ చేసే దిశగా యాక్టివ్​గా పనిచేస్తున్నాం. ఇందుకోసం మరింత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. పరిశోధనలో పాల్గొన్నవారి ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏఐ మోడల్​ కోసం ఉపయోగించిన వ్యక్తిగత వివరాలేవీ సాధారణ ప్రజలకు లేదా కంపెనీలకు అందుబాటులో ఉంచలేదు."
-సునే లేహ్​మన్, పరిశోధకుడు, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్​కు చెందిన నెట్​వర్క్స్ అండ్ కాంప్లెక్స్ సిస్టమ్స్​ విభాగ ఆచార్యుడు

'లైఫ్2వెక్​'కు సమాచారాన్ని సెంటెన్స్​ల రూపంలో ఇచ్చారు శాస్త్రవేత్తలు. సమాచారానికి టోకెన్ నంబర్లు కేటాయించారు. వృత్తి, ఆదాయం, హెల్త్, జీవిత సంఘటనలు సహా మనిషి జీవితంలో సంభవించే అన్ని వ్యవహారాలకు ఒక్కో టోకెన్ నంబర్​ను ఇచ్చి ఏఐ టూల్​ను ట్రైన్ చేశారు. వీటన్నింటిని ద్వారా ఇతరుల జీవితకాలాన్ని లెక్కగడుతుంది ఈ ఏఐ టూల్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

పర్సనాలిటీ టెస్ట్ కూడా
వ్యక్తుల పర్సనాలిటీని సైతం ఇది అంచనా వేస్తుంది. ఇందుకోసం పది అంశాలను ఇచ్చి పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది. 'కొత్త ప్రదేశాలకు వెళ్తే నేను మొదట చేసేది మిత్రులను చేసుకోవడమే', 'గ్రూప్ మీటింగ్​లలో అరుదుగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను' వంటి సెంటెన్స్​లు ఇచ్చి, వీటికి మీరు ఎంత వరకు అంగీకరిస్తారు అని అడుగుతుంది. ప్రశ్నలకు మనుషులు ఇచ్చే సమాధానాలను బట్టి వారి వ్యక్తిత్వాలపై అంచనాకు వస్తుంది.

"ఏఐని ట్రైన్ చేయడానికి ఇచ్చిన డేటా మొత్తం డెన్మార్క్​కు చెందినదే. కాబట్టి ఇతర ప్రాంతాల్లో నివసించే వారి విషయంలో ఈ ప్రిడిక్షన్స్ అంత కచ్చితత్వంతో ఉండకపోవచ్చు. నిజానికి తాము ఎప్పుడు చనిపోతున్నామనే విషయాన్ని ఎవరూ తెలుసుకోవాలని కూడా అనుకోరు."
-సునే లేహ్​మన్, పరిశోధకుడు

జీవితంలో జరిగబోయే సంఘటనలను, మనుషుల ప్రవర్తనను ముందుగానే అంచనా వేసే ఇలాంటి టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని లేహ్​మన్ చెప్పారు. సోషల్ మీడియా యూజర్ల ప్రవర్తనను టెక్ కంపెనీలు ట్రాక్ చేస్తుంటాయని వివరించారు. యూజర్ల ప్రొఫైళ్లను అత్యంత కచ్చితత్వంతో పసిగట్టి, భవిష్యత్​ ప్రవర్తనను అంచనా వేస్తుంటాయని పేర్కొన్నారు. 'ఏఐ ద్వారా ఏం అభివృద్ధి చేయాలనే విషయంలో ఈ ప్రాజెక్ట్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇలాంటి వాటిపై చర్చలు మరింత జరగాలి. తద్వారా టెక్నాలజీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో, ఈ తరహా అభివృద్ధి మనకు అవసరమో కాదో తెలుస్తుంది' అని లేహ్​మన్ అంటున్నారు.

చంపేస్తానని చాట్​బాట్ వార్నింగ్.. జర్నలిస్టుకు పెళ్లి ప్రపోజల్.. ఎందుకిలా? ఏఐతో డేంజరేనా?

Artificial Intelligence in Our Daily Life : మీ ఇంట్లోకి.. నట్టింట్లోకి "AI".. వదిలించుకోవడం అసాధ్యం..!

ABOUT THE AUTHOR

...view details