తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Adobe photoshop: సరికొత్త ఫీచర్లతో అడోబ్​- ఐపాడ్​, డెస్క్​టాప్​లలో మార్పులు

ఫొటో ఎడిటింగ్​ చేయాలంటే టక్కున గుర్తొచ్చే సాఫ్ట్​వేర్​.. అడోబ్​ ఫొటోషాప్ (Adobe Photoshop). యూజర్​ ఫ్రెండ్లీగా ఉంటూ సులువుగా అర్థమయ్యేలా ఉండటం వల్ల దీన్ని ఉపయోగించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. తాజాగా ఐపాడ్​తో పాటు డెస్క్​టాప్​ వర్షన్లలో సరికొత్త ఫీచర్స్​ను (Photoshop 2021 New Features) తీసుకొచ్చింది అడోబ్​. వినియోగదారులకు మరింత చేరువయ్యేలా ఇవి ఉన్నాయి. అవేంటనేది మీరూ తెలుసుకోండి.

Adobe Photoshop
అడోబ్ ఫొటోషాప్​

By

Published : Aug 20, 2021, 7:50 PM IST

ఫొటో ఎడిట్‌ చేయాలన్నా.. ఫొటోలకు మెరుగులద్దలన్నా.. వాటిని ఆకర్షణీయంగా మార్చుకోవాలనుకున్నా.. ఎక్కువమంది ఉపయోగించేది అడోబ్ ఫొటోషాప్ (Adobe Photoshop) ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌. యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో ఫొటో ఎడిటింగ్‌, టెంప్లేట్ తయారీకీ ఈ సాఫ్ట్‌వేర్ అనుకూలంగా ఉండటం వల్ల ఎంతో మంది దీనిని ఉపయోగిస్తుంటారు. అందుకే అడోబ్ సంస్థ ఈ సాఫ్ట్‌వేర్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని (Photoshop 2021 New Features) పరిచయం చేస్తుంటుంది. తాజాగా ఈ సాఫ్ట్‌వేర్‌లో ఐపాడ్, డెస్క్‌టాప్ వెర్షన్‌లో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

అడోబ్ ఫొటోషాప్​
అడోబ్ ఫొటోషాప్

ఐపాడ్ వెర్షన్‌లో యాపిల్‌ పెన్సిల్‌తో హీలింగ్ బ్రష్‌ను ఉపయోగించి మనం ఎడిట్ చేస్తున్న ఫొటోలో నచ్చినచోట పెయింట్ చెయ్యొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ డెస్క్‌టాప్ యూజర్స్‌కి అందుబాటులో ఉంది. దీని సాయంతో యూజర్స్ టెక్చర్‌, లైటింగ్, ట్రాన్పరెన్సీ, షేడింగ్‌ని మెరుగుపరుచుకోవచ్చు. అలానే మ్యాజిక్‌ వాండ్ టూల్ సాయంతో షేప్ సరిగాలేని, ఫ్లాట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫొటోలోని ఆబ్జెక్ట్‌లను టోన్, కలర్ సాయంతో ఎంచుకోవచ్చు. యూజర్స్‌ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ టూల్‌ను తీసుకొచ్చినట్లు అడోబ్ తెలిపింది. ఇందులోని సబ్జెక్ట్ సెలక్షన్, రిఫైన్ ఎడ్జ్‌ టూల్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తాయని వెల్లడించింది. వీటితోపాటు ఐపాడ్‌ వెర్షన్‌లో కాన్వాస్‌ ప్రొజెక్షన్ టూల్‌ను తీసుకొస్తున్నారు. దీంతో యూజర్‌ తాము ఎడిట్ చేస్తున్న డాక్యుమెంట్‌ లేదా ఫొటోను పెద్ద స్క్రీన్లపై ఇతరులతో పంచుకోవచ్చు. కార్యాలయాలు, తరగతి గదుల్లో శిక్షణ సమయాల్లో ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

అడోబ్ ఫొటోషాప్
అడోబ్ ఫొటోషాప్

డెస్క్‌టాప్ వెర్షన్‌లో స్కై రీప్లేస్‌మెంట్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు. ఇందులోని గెట్ మోర్ స్కైస్ ద్వారా యూజర్‌ నైట్‌ సీన్స్‌, ఫైర్ వర్క్స్‌, సన్‌సెట్స్‌ వంటి 5,000 రకాల హై-క్వాలిటీ ప్రిసెట్స్‌ ఎంచుకునేందుకు, ఇంపోర్ట్‌ చేసేకునేందుకు ఈ ఫీచర్‌ సాయపడుతుందని అడోబ్ తెలిపింది. అలానే బేజియర్ హ్యాండిల్ మూవ్‌మెంట్ టూల్‌కు కొత్త హంగులు జోడించారు. టూల్‌ని వేగంగా సెలెక్ట్ చేసి త్వరితగతిన పని పూర్తి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అడోబ్ తెలిపింది. కంట్రోల్ + ఎఫ్‌ లేదా కమాండ్ + ఎఫ్ సాయంతో దీనిని యాక్సెస్‌ చెయ్యొచ్చు. వీటితోపాటు యూజర్స్‌ డాక్యుమెంట్స్‌కి ఇమేజ్ స్టైల్‌ని జోడించేందుకు వీలుగా న్యూరల్ ఫిల్టర్స్‌ని ఈ వెర్షన్‌లో పరిచయం చేస్తున్నట్లు అడోబ్‌ వెల్లడించింది. త్వరలోనే అడోబ్‌ ఫొటోషాప్ బీటా వెర్షన్‌ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా యూజర్స్ తమ విలువైన అనుభవాలు, అభిప్రాయాలు, సూచనలను ఫొటోషాప్ టీమ్‌కి తెలియజేయవచ్చని పేర్కొంది.

ఇదీ చదవండి:జియో-గూగుల్​ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర తక్కువే!

ABOUT THE AUTHOR

...view details