తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఆధార్​తో లింక్​ అయిన మొబైల్​ నంబర్​ తెలియదా?.. చెక్​ చేసుకోండిలా!

ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌ను ఎలా తెలుసుకోవాలి? అనే సందేహాం చాలా మందికి ఉంటుంది. ఇకపై ఆన్‌లైన్ ద్వారా సులువుగా ఇంట్లోనే ఆధార్‌తో లింక్​ అయిన మొబైల్ నెంబర్ వివరాలను మనం తెలుసుకోవచ్చు. అదెలా అంటే?

You Can Now Easily Verify Your Mobile Number, Email ID Linked to Aadhaar
You Can Now Easily Verify Your Mobile Number, Email ID Linked to Aadhaar

By

Published : May 10, 2023, 10:24 AM IST

గుర్తింపు కార్డుల్లో ఆధార్ అనేది ప్రతిఒక్కరికీ అవసరం. మన దేశంలో అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఆధార్ కార్డు లేనిది ఏ పని కూడా జరగడం లేదు. బ్యాంక్‌ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి సిమ్ కార్డు తీసుకునే వరకు ఏ పనికైనా ఆధార్ అనేది అవసరమే. దీంతో అవసరమైనప్పుడు అందుబాటులో ఉండేలా ఎప్పుడూ ఆధార్‌ను మన జేబులో ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆధార్ సేవలను మరింత సులభతరం చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆధార్ సేవలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొచ్చింది. తాజాగా యూఐడీఏఐ మరో కొత్త సౌకర్యం తీసుకొచ్చింది. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ధ్రువీకరించుకునే వెసులుబాటు కల్పించింది.

ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ విషయంలో కొంతమందికి గందరగోళంగా ఉంటుంది. లింక్ చేసుకున్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ వివరాలు తెలియక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఓటీపీ అవసరమైన సమయంలో వేరే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెళ్లడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి చెక్ పట్టేందుకు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని ధ్రువీకరించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చింది.

యూఐడీఏఐ తీసుకొచ్చిన ఈ సదుపాయం ద్వారా ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్​ నెంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా సులువుగా ఈ పని చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఆధార్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది.

ఎలా చెక్ చేసుకోవాలి.?

  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా ఎం-ఆధార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి
  • వెబ్‌సైట్ లేదా యాప్‌లో వెరిఫై ఈమెయిల్/మొబైల్ ఆప్షన్ ఎంచుకోవాలి
  • మీ ఆధార్, మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీతో పాటు క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ మీద క్లిక్ చేయాలి.
  • మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఇప్పటికే ధ్రువీకరించి ఉన్నట్లయితే.. 'మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్ ఇప్పటికే మా రికార్డులతో ధ్రువీకరించబడింది' అని చూపిస్తుంది.

మొబైల్ నెంబర్‌ను అప్డేట్ చేసుకోవడం ఎలా?
ఒకవేళ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని కొత్తగా ఆధార్‌తో అనుసంధానం చేయాలంటే.. వినియోగదారుడు ఆన్‌లైన్‌లో చేసుకోవడానికి వీలు పడదు. అందుకోసం దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కేంద్రానికి వెళ్లి సంబంధిత దరఖాస్తు ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా సిబ్బంది మీ ఆధార్‌కు మొబైల్, ఈమెయిల్ ఐడీని అనుసంధానం చేస్తారు.

ఇప్పటికే ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ లేదా మెయిల్ ఐడీని మార్చుకోవాలనుకున్నా.. ఆన్‌లైన్‌లో సాధ్యపడదు. ఇందుకోసం కూడా ఆధార్ కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఆధార్ కేంద్రం సిబ్బంది మీ వివరాలను ధ్రువీకరించి అప్పుడు కొత్త మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీని అప్డేట్ చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details