How to remove virus from pc for free : కంప్యూటర్ల పాలిట వైరస్లు ఒక పీడకలగా మనం చెప్పవచ్చు. ఇవి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కీలకమైన ఫైల్స్, డేటా కోల్పోవడానికి కారణమవుతాయి. మరీ ముఖ్యంగా మన ప్రైవసీకి భంగం కలిగిస్తాయి. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కనిపెట్టిందే యాంటీ వైరస్.
యాంటీ వైరస్లు వాస్తవానికి చాలా సమర్థవంతంగా వైరస్‌లను ఎదుర్కొంటాయి. కానీ వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని ఎఫర్ట్ చేయలేరు. కానీ వీటిని కొనుగోలు చేయలేని వారు చింతించాల్సిన పనిలేదు. వైరస్‌లను పూర్తిగా నిరోధించే అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
I. విండోస్ డిఫెండర్‌ను టర్న్ ఆన్ చేసుకోండి
windows defender for antivirus : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మంచి యాంటీ వైరస్ల ఖరీదు చాలా ఎక్కువ. కానీ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తూ ఉంటే కనుక అందులో బిల్ట్-ఇన్ యాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదే విండోస్ డిఫెండర్. దీనిని కచ్చితంగా టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇది వైరస్‌లను, మాల్వేర్లను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
విండోస్ డిఫెండర్‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
How to enable windows defender : విండోస్ డిఫెండర్‌ను యాక్టివేట్ చేయడం చాలా సులభం.
- ముందుగా మీ కంప్యూటర్లోని start బటన్‌ను క్లిక్ చేసి, Windows security అని టైప్ చేయాలి.
- వెంటనే windows security app ఓపెన్ అవుతుంది. అప్పుడు దానిలోని virus & threat protection పై క్లిక్ చేయాలి.
- వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ సెట్టింగ్స్‌లో Manage settings పై క్లిక్ చేయాలి.
- తరువాత Real-time protection ని టర్న్ ఆన్ చేసుకోవాలి. దీని కోసం మీరు మీ అడ్మినిస్ట్రేటర్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, కన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అంతే!
- విండోస్ డిఫెండర్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ, మీ పీసీని రెగ్యులర్‌గా స్కాన్ చేస్తూ ఉంటుంది. వైరస్, మాల్వేర్ అటాక్స్ నుంచి మీ కంప్యూటర్ను కాపాడుతుంది.
II. వైరస్ రిలేటెడ్ బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్‌ను నిరోధించండి
Virus related background processes : సాధారణంగా వైరస్లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. ఇవి సిస్టమ్ రిసోర్స్‌లను ఉపయోగించుకుంటూ ఉంటాయి. హానికరమైన పనులను చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ కంప్యూటర్ పనితనాన్ని, జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని మాయం చేస్తాయి. కొన్ని సార్లు హ్యాకర్లకు మీ సున్నితమైన సమాచారాన్ని అందిస్తాయి. కానీ మరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ చేసే వైరస్‌లను చాలా సులువుగా నిరోధించవచ్చు.
- మీ కంప్యూటర్ సెర్చ్ బాక్స్‌లో Task Manager అని టైప్ చేయండి.
- వెంటనే మీకు టాస్క్ మేనేజర్లో Processes or Details టాబ్ ఓపెన్ అవుతుంది. అందులో ఏమైనా అనుమానాస్పదంగా ప్రాసెసెస్ జరుగుతూ ఉంటే, దానిపై క్లిక్ చేసి End task నొక్కండి. అంతే! బ్యాక్ గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి.
III. అన్నోన్ స్టార్టప్ ప్రోగ్రామ్‌లను డిజేబుల్ చేయండి!
How to disable unknow startup programs : మీ కంప్యూటర్ దిగువ భాగంలో చాలా ఐకాన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి ఎలాంటి హాని కలిగించని యాప్స్‌లాగా కనిపిస్తాయి. కానీ ఇవి మీ కంప్యూటర్లోని డేటాను చాలా సులువుగా తస్కరిస్తూ ఉంటాయి. మీ బ్రౌజింగ్ హిస్టరీపై గూఢచర్యం చేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు మీ కంప్యూటర్ పనితనం మందగించేలా చేస్తాయి. అందుకే ఇలాంటి తెలియని, ఉపయోగపడని యాప్‌లను వెంటనే డిజేబుల్ చేసేయాలి. ఇందుకోసం..
- కీబోర్డ్‌లోని Ctrl+Alt+Deleteని క్లిక్ చేయాలి. తరువాత టాస్క్ మేనేజర్‌ను ఓపెన్ చేయాలి.
- దీనిలో startup టాబ్‌పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి. అప్పుడు మీకు చాలా పేర్లు, ఐకాన్లు కనిపిస్తాయి. వాస్తవానికి మీరు కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు ఇవి ఆటోమేటిక్‌గా లాంఛ్ అయిపోతూ ఉంటాయి. కనుక మీరు ఏదైనా ఐకాన్ అనుమానాస్పదంగా ఉన్నట్లు అనిపిస్తే, వెంటనే దానిని Disable చేసేయండి.
- ఇలానే అక్కడ కనిపిస్తున్న అన్ని ఐకాన్స్‌ను చూసి, వాటిలో ఏది డేంజర్ అనిపిస్తే, వాటిని డిజేబుల్ చేసేయండి.
- అవసరంలేని యాప్‌లను డిజేబుల్ చేసిన తరువాత, టాస్క్ మేనేజర్‌ను క్లోజ్ చేసేయండి. తరువాత మీ కంప్యూటర్ను రీస్టార్ట్ చేయండి.
- ఇప్పుడు మరలా మీ కంప్యూటర్ను ఆన్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ చాలా వేగంగా, స్మూత్‌గా పనిచేస్తున్నట్లు గమనిస్తారు.