తెలంగాణ

telangana

50 Crore Worth Drugs seized at Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో.. రూ.50 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 3:57 PM IST

Updated : Sep 2, 2023, 9:58 PM IST

50 crore Cocaine seized in Hyderabad
50 Crore Drugs seized at Shamshabad

15:52 September 02

Drugs

50 Crore Worth Drugs seized at Shamshabad Airport: హైదరాబాద్​లోని శంషాబాద్​ విమానాశ్రయంలో డీఆర్​ఐ అధికారులు భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఎయిర్‌ పోర్టులో అధికారులు మాటు వేసి కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్​, దిల్లీ నుంచి డ్రగ్స్​ తీసుకువస్తున్న ముఠాను ​అరెస్ట్​ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి డ్రగ్స్​ను నాలుగు మహిళా హ్యాండ్‌ బ్యాగుల్లో బ్రౌన్​ టేప్​తో చుట్టి చెక్​ ఇన్​ సూట్​కేసు అడుగు భాగంలో దాచిపెట్టాడు. ఆ ప్రయాణికుడు లావోస్​ నుంచి సింగపూర్​, హైదరాబాద్ మీదుగా దిల్లీ వెళ్తున్నాడు.

5KG cocaine Seized in Hyderabad : హైదరాబాద్​లోని శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ అధికారులకు పక్కా సమాచారం రావడంతో ప్రయాణికులపై నిఘా పెట్టారు. దీంతో డ్రగ్స్​ తీసుకు వెళ్తున్న వ్యక్తిని గుర్తించి.. తనిఖీ చేశారు. దీంతో నిందితుడి దగ్గర భారీ స్థాయిలో డ్రగ్స్​ను అధికారులు గుర్తించారు. అనంతరం నిందితుడి దగ్గర ఉన్న రూ.50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్​ చేశారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు డీఆర్ఐ అధికారులు తరలించారు.

Gold Smuggling in Hyderabad : శంషాబాద్ ఎయిర్​పోర్టులో 1.27 కోట్ల విలువైన బంగారం సీజ్

Drugs and Gold Cases atShamshabad Airport in Hyderabad :గత కొన్ని రోజులుగా శంషాబాద్​ విమానాశ్రయంలో అధికారులు అధిక మొత్తంలో నిషేధ వస్తువులను తరలిస్తున్న వ్యక్తులను పట్టుకుంటున్నారు. వారి నుంచి భారీ మొత్తంలో రవాణా చేస్తున్న సరుకును స్వాధీనం చేసుకుంటున్నారు. ఎంత మంది పట్టుబడినా.. నిందితులు మాత్రం డ్రగ్స్​, బంగారం.. తదితర వాటిని తరలించడం ఆపడం లేదు. రోజు రోజుకూ నిందితుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది.

ఇలా గతంలో అక్రమంగా రవాణా చేస్తూ దొరికిన నిందితుల్లో కొందరు.. ఆగస్ట్​ ఆరో తేదీన ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.2.29 కోట్లు విలువైన 3743 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దుబాయ్​ నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆగస్ట్​ 4న ఓ ప్రయాణికుడు చీరలో పెట్టుకుని 461 గ్రాముల బంగారాన్ని తరలిస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.28 లక్షలు ఉంటుందని తెలిపారు. జులై 18న కువైట్​ నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికుల దగ్గర నుంచి సుమారు కోటి విలువైన రూ.1.725 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జులై 12న నలుగురు వ్యక్తల దగ్గర నుంచి రూ.1.27కోట్లు విలువ చేసే 2.1 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇలాంటి కేసులు కొనసాగితే భవిష్యత్​ తరాల పరిస్థితి ఏమిటని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Generic Medicine NMC Guidelines : 'ఆ మందులు రాయకుంటే డాక్టర్ల లైసెన్స్​ రద్దు'.. NMC కీలక ఆదేశాలు

Two Persons Arrested Supplying Drugs In Hyderabad : త్వరలో సిక్స్ ప్యాక్ కావాలనుకునే వారే వీరి టార్గెట్.. నిషేధిత ఇంజెక్షన్లు విక్రయించే ముఠా అరెస్ట్

Drugs Usage in Hyderabad : వామ్మో.. హైదరాబాద్‌లో అంతమంది డ్రగ్స్‌ వినియోగిస్తున్నారా!

Last Updated : Sep 2, 2023, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details