కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రం హోంలోనే కొనసాగుతున్నారు. విద్యార్థులు కూడా ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మందికి ఎదురవుతున్న సమస్య..' మా కంప్యూటర్ (లేదా) ల్యాప్‌టాప్ స్పీడ్ తగ్గుతోంది..!' అని. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? చిన్న చిన్న సెట్టింగ్స్‌తోనే మీ కంప్యూటర్ స్పీడ్‌ను పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
రెగ్యూలర్‌గా యాప్స్..
మన అవసరాల కోసం ఎన్నో యాప్స్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. మరికొన్ని యాప్స్ మన సిస్టమ్‌లో లోడ్ అయి ఉంటాయి. కంప్యూటర్ కొన్న కొత్తలో ఉన్న స్పీడ్.. తర్వాత ఉండకపోవటానికి కారణం ఇదే. అందుకే మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్‌ను క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలి. ఎప్పుడూ వినియోగించని యాప్స్‌ను డిలీట్ చేయాలి. మీకు కావాలన్నప్పుడు మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవచ్చన్న సంగతి గుర్తుంచుకోండి.
స్టోరేజ్ స్పేస్‌పై ఓ కన్నేయండి..
కంప్యూటర్లో స్టోరేజ్ స్పేస్ లేకపోయినా వేగం తగ్గిపోతుంది. వినియోగించని యాప్స్‌ను తొలగించటమే కాకుండా.. సిస్టమ్‌లో సరిపడా స్టోరేజ్ ఉండేట్టు చూసుకోవాలి. హార్డ్ డ్రైవ్‌లో కనీసం 20 శాతం స్టోరేజ్ స్పేస్ ఉండేలా చూసుకోవటం ఉత్తమం. పాత డాక్యూమెంట్లు, ఫైల్స్‌ను క్లౌడ్‌లోకి లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్‌లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అంతేకాక ఎంతో ముఖ్యమైన ఫైల్స్‌ను బ్యాకప్ కింద రెండు కాపీలు పెట్టుకుంటే మంచిది.
డిఫాల్ట్ సెట్టింగ్స్‌ను పరిశీలించుకోవాలి..
చాలా యాప్స్, ప్రోగ్రామ్స్‌లో కొన్ని సెట్టింగ్స్ డిఫాల్ట్లోకి వెళ్లిపోతుంటాయి. డిఫాల్ట్లో ఉన్న యాప్స్ మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. దీనివల్ల కంప్యూటర్ స్పీడ్ తగ్గి.. స్లోడౌన్ సమస్యలు ఎదురవుతాయి. ఇంకొన్ని యాప్స్ పరిధికి మించి ఎక్కువ డేటా, స్పేస్‌ను తీసుకుంటాయి. వాటిని వెతికి యాప్‌ను క్లీనప్ చేయాలి. అలాంటి యాప్స్‌ను సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిసేబుల్ చేసుకోవాలి.
ఇవీ చదవండి:ఒంటరితనం వల్లే ఇంటర్నెట్ అతి వినియోగం!
యాప్స్ అప్డేట్ చేయటం..