Long Lasting Battery Phone 2023 : ప్రస్తుతం మనం స్మార్ట్ ఫోన్ లేనిదే ఉండలేని స్థితికి వచ్చేశాం. ఈ మధ్య కాలంలో ఎక్కడికెళ్లినా చార్జర్, పవర్ బ్యాంక్‌ను తప్పనిసరిగా వెంట తీసుకెళుతున్నారు కొందరు. అది కొంచెం దూరమైనా సరే. దీనికి కారణం వారి ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం లేదా తక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండటమే. మెసేజ్, కాల్స్ దగ్గర్నుంచి గేమ్స్ ఆడటం, ఎడిటింగ్ చేసేవరకు మొబైల్లో ఏం చేయాలన్నా.. ఛార్జింగ్ కచ్చితంగా ఉండాలి. మనకెంత మంచి ఫోన్ ఉన్నా సరే.. అందులో సరైన బ్యాటరీ బ్యాకప్ లేకపోతే వృథానే.
మరి ఇలాంటి బాధలు తొలగాలంటే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేయాలి. అన్ని మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా గేమ్స్ ఆడేవారు, ఫోన్లో ఫొటోలు, వీడియోలు ఎడిటింగ్ చేసే వారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నాయి. మరి ఈ ఏడాది రిలీజైన అలాంటి టాప్ 5 మొబైల్స్ ఇవి.
1. Asus ROG Phone 7 Ultimate
ఈ మధ్య కాలంలో వచ్చిన లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఫోన్లలో ఇదొకటి. 65W స్పీడ్ ఛార్జర్‌తో వచ్చిన ఈ ఫోన్‌ను.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 18.5 గంటలు పనిచేస్తుంది. దీనికి కారణం ఇందులో ఉన్న 6000 mAh గల బ్యాటరీ సామర్థ్యం. Snapdragon 8 Gen CPUతో రావడం వల్ల గేమ్స్ ఆడటం, ఫొటోలు, వీడియోలు ఎడిటింగ్ చేసేవారికి ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్.
2. Apple I Phone 14 Pro Max
యాపిల్ ఫోన్ అనగానే సరిగా ఛార్జింగ్ ఆగదు అనే ఒక అపవాదు ఉంది. వాటన్నింటికి ఈ ఫోన్‌తో సమాధానం చెప్పింది ఆ కంపెనీ. ఇటీవల విడుదల చేసిన ఈ ఫోన్లో బ్యాటరీ బ్యాకప్ బాగుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. సుమారు 13.5 గంటలకు పైగా వాడుకోవచ్చు. దీంతో పాటు పవర్ మేనేజ్మెంట్ చేసే A16 Bionic Processor కూడా బ్యాటరీ లాంగ్ లైఫ్‌కు కారణం. ఇప్పటి దాకా వచ్చిన మోడళ్లలో బ్యాటరీ పరంగా ఇదే బెస్ట్ ఫోన్.