ఒకప్పుడు ఫోన్లో మాట్లాడుకునే సదుపాయం మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాదు ఫోన్లోనే అన్ని పనులు అయిపోతున్నాయి. ఫోన్ మాట్లాడుకోవటం నుంచి బిల్లులు చెల్లించటం, ప్రభుత్వ సేవల పొందటం అన్ని ఫోన్ ద్వారా జరుగుతున్నాయి. పెరిగిన సాంకేతికతో టెలికాం రంగంలో మార్పులు రావటం వల్ల ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం కొనసాగుతోంది. కొన్ని రోజుల్లో వర్చువల్ ప్రపంచం ఆవిష్కృతం కాబోతుంది. దీనికి 5జీ తోడ్పడనుంది. టెలికాం రంగంలో ప్రస్తుతం 4జీ యుగం నడుస్తోంది. దీనికంటే ముందు 1జీ, 2జీ, 3జీ సాంకేతికలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
1జీ
ఇది 1980లలో ప్రారంభమైంది. ఇది మొదటి సెల్ ఫోన్ టెక్నాలజీ. ఈ తరం ఫోన్లలో బ్యాటరీ లైఫ్ చాలా తక్కువగా ఉండేది. ఫోన్ కాల్స్ వాయిస్ క్లారిటీ కూడా తక్కువగా ఉండేది. కాల్స్‌కు సంబంధించి సెక్యూరిటీ కూడా చాలా తక్కువ. కాల్ డ్రాపింగ్ కూడా ఉండేది. ఈ తరంలో ఇంటర్నెట్ స్పీడ్ 2.4కేబీపీఎస్ల నుంచి 14.4 కేబీపీఎస్ వరకు ఉండేది. ఈ తరంలో కేవలం మాట్లాడుకునేందుకే వీటిని ఉపయోగించారు.
2జీ
సెల్ ఫోన్లకు సంబంధించి ప్రధానమైన అప్‌గ్రేడ్ ఇది. అప్పటి వరకు ఉన్న అనలాగ్ రేడియో సిగ్నల్స్ స్థానంలో డిజిటల్ రేడియో సిగ్నల్స్ ఈ తరంలో ఉపయోగంలోకి వచ్చాయి. ఇందులో సీడీఎంఏ, జీఎస్ఎం ప్రామాణికతలు ఉండేవి. ఈ తరంలో వాయిస్తో పాటు ఇంటర్నెట్కు సంబంధించి సేవలు ప్రధానంగా ఉండేవి. 1జీ నుంచి 2జీకి మారటం వల్ల ఎస్ఎమ్ఎస్, కాన్పరెన్స్ కాల్, కాల్ హోల్డ్ తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. 2జీలో డాటా స్పీడ్ 50కేబీపీఎస్ నుంచి 1ఎంబీపీఎస్ వరకు ఉండేది. 2జీ తర్వాతా 2.5జీ, 2.75జీ లాంటివి వచ్చాయి. ఎస్ఎమ్ఎస్, పిక్చర్ మెస్సేజ్, ఎమ్ఎమ్ఎస్ లాంటి వాటి కోసం డాటా సర్వీసులు ఉండేవి.