ప్రస్తుతం మార్కెట్లో దొరికే కురగాయలు, ఆకుకూరలపై ఎక్కువగా క్రీమిసంహారక మందులు ఉంటున్నాయి. కానీ పైకి అవి ఉన్నట్లు కనిపించవు! వాటిని మనం ఎంత శుభ్రం చేసుకున్నా కొన్నిసార్లు ఆ మందుల అవశేషాలు ఉండిపోతుంటాయి. అలాంటప్పుడే ఇంట్లోనే దొరికే కొన్నివస్తువులతో వాటిని ఎలా శుభ్రం(kitchen tips) చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో రైస్ వైన్ వెనిగర్, బాల్స్మిక్ వెనిగర్, యాపిల్ సిడార్ వెనిగర్, సింథటిక్ వెనిగర్ అని పలు రకాల వెనిగర్లు(vinegar uses) లభ్యమవుతుంటాయి. వీటిలో చవకగా దొరికే సింథటిక్ వెనిగర్‌ను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. దానిని వస్తువులు, కూరగాయలు, ఆకుకూరలు క్లీనింగ్ కోసం కూడా వాడొచ్చు.