చప్పిడి చేపలు అంటే చప్పగా ఉంటాయేమో అనుకునేరు. అదేం లేదు. అదిరిపోయే రుచి (fish recipes preparation) వీటి సొంతం. మామూలుగా అయితే పచ్చి చేపని (sea food varities) తెచ్చుకున్న వెంటనే (sea food recipes) వండుకోవాల్సిందే. లేదంటే నిల్వ చేయడం కోసం ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఎండు చేపలు కొనుక్కోవాలి. కానీ ఈ చప్పిడి చేపలు ఫ్రిజ్లో పెట్టకపోయినా కూడా వారం రోజుల వరకూ ఏం కావు. అదే వీటి ప్రత్యేకత.
తూర్పుగోదావరి జిల్లా మడ అడవుల్లో దొరికే మడ కర్రల పైనా, చెరకు పిప్పిపైనా గడ్డిని ఉంచి వీటిని ప్రత్యేకంగా కాలుస్తారు. తేమ పోయి వీటికి ఒక రకమైన ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఓ మోస్తరు పరిమాణంలో ఉండే కట్టిపరిగ, ఇసుకదొందులు, కొయ్యింగ చేపల్ని ఈ పద్ధతిలో కాలుస్తుంటారు. వీటిని వండుకోవడం కూడా సులభం. పైన పొట్టు తేలిగ్గా వచ్చేస్తుంది. వీటిని ముక్కలుగా కోసుకుని మునక్కాడ, కోడిగుడ్డు, చిక్కుడుకాయ కాంబినేషన్తో వండుకుంటే ఆ రుచే వేరని అంటారు స్థానికులు. విడిగా కూడా వండుకోవచ్చు. ఇగురు కూరలు బాగుంటాయి. అయితే వీటిని కాల్చడం ప్రత్యేకమైన కళ. పండి పల్లం, పి.గన్నవరం వంటి ప్రాంతాల్లో కాల్చిన చేపలకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. వీటినే ఆర్చిన చేపలని, పొగబెట్టిన చేపలనీ కూడా అంటారు. ముల్లు తీసేసి పిట్టులా కూడా వండుకోవచ్చు.
కట్టిపరిగల ఇగురు
కావాల్సినవి: