తెలంగాణ

telangana

ETV Bharat / priya

Chettinad Chicken Recipe : సండే స్పెషల్.. నోరూరించే చెట్టినాడ్ చికెన్ - చికెన్‌ షమీ కబాబ్‌ తయారీ విధానం

Chettinad Chicken Recipe : కార్తికమాసం ముగియడం ఆలస్యం... ఆదివారంతో సంబంధం లేకుండా చికెన్ తినాలనుకుంటారు మాంసం ప్రియులు. అలాగని ఎప్పుడు ఒకేమాదిరిగా వండితే ఏ మాత్రం ఇష్టపడరు. అందుకే రొటీన్​గా కాకుండా చికెన్ రెసిపీలను ఈ సారి కొత్తగా ట్రై చేయండి.

chicken variety dishes
chicken variety dishes

By

Published : Dec 5, 2021, 11:56 AM IST

Chettinad Chicken Recipe : ఆదివారంతో సంబంధం లేకుండా నాన్​వెజ్​ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు మాంసం ప్రియులు. అందులో ఎక్కువమంది ఇష్టపడేది చికెన్​. అయితే చికెన్​తో ఎన్నో వెరైటీలు చేయవచ్చు. మరెన్నో రుచులు తయారు చేసుకోవచ్చు. కుదిరినప్పుడల్లా అలాంటి వెరైటీ వంటకాలను... ఇలా కొత్త రుచుల్లో వండేయండి మరి.

చికెన్‌ షమీ కబాబ్‌..

కావలసినవి :

Chicken Shami Kabab : చికెన్‌కీమా: అరకేజీ, సెనగపప్పు: కప్పు, ఉల్లిపాయముక్కలు: కప్పు, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, అల్లం: ఒకముక్క, దనియాలపొడి: చెంచా, ఉప్పు: తగినంత, జీలకర్ర: చెంచా, ఎండుమిర్చి: రెండు, యాలకులు: మూడు, దాల్చినచెక్క: ఒకముక్క, మిరియాలు: అరచెంచా, గుడ్లు: రెండు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: అరకప్పు, పుదీనా ఆకుల తరుగు: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం :

సెనగపప్పును ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత సెనగపప్పును విడిగా ఓ గిన్నెలో వేసుకుని గుడ్లు, నూనె, కొత్తిమీర, పుదీనా తప్ప మిగిలిన పదార్థాలు వేసుకుని బాగా కలిపి పదినిమిషాలు కుక్కర్‌లో వేసి ఉడికించాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో గుడ్ల సొన, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి బాగా కలిపి చిన్న కబాబ్‌లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పెనంమీద రెండుమూడు చొప్పున ఉంచి... నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.

చెట్టినాడ్‌ చికెన్‌..

కావలసినవి చికెన్‌ :

Chettinad Chicken Curry : అరకేజీ, వెల్లుల్లిరెబ్బలు: పది, ఉప్పు: తగినంత, అల్లం: చిన్నముక్క, పచ్చిమిర్చి: రెండు, పెరుగు: అరకప్పు, పసుపు: టేబుల్‌స్పూను, నిమ్మరసం: టేబుల్‌స్పూను గ్రేవీకోసం: ఉల్లిపాయలు: రెండు, టొమాటోలు: రెండు, అల్లంవెల్లుల్లిముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు రెబ్బలు: మూడు, నూనె: పావుకప్పు. మసాలాకోసం: దనియాలు: మూడుటేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: మూడు, జీలకర్ర: చెంచా, దాల్చినచెక్క: ఒక అంగుళం ముక్క, అనాసపువ్వు: ఒకటి, మిరియాలు: రెండు చెంచాలు, యాలకులు: అయిదు, లవంగాలు: నాలుగు, సోంపు: చెంచా, తాజాకొబ్బరితురుము: పావుకప్పు కొత్తిమీర: కట్ట.

తయారీ విధానం:

Chettinad Chicken Recipe in Telugu : ముందుగా వెల్లుల్లిరెబ్బలు, అల్లం, పచ్చిమిర్చిని మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో పెరుగు, పసుపు, నిమ్మరసం, చికెన్‌ ముక్కలు వేసుకుని అన్నింటినీ బాగా కలిపి అరగంటసేపు పక్కన పెట్టేయాలి. మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలను నూనె లేకుండా వేయించుకుని ఆ తరువాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి కరివేపాకు వేయించి, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి కూడా వేగాక టొమాటో ముక్కలు కూడా వేయించి, చికెన్‌ ముక్కలు వేసి కాసిని నీళ్లు పోయాలి. చికెన్‌ మెత్తగా ఉడికాక తగినంత ఉప్పు, ముందుగా చేసుకున్న మసాలా వేసి బాగా కలిపి పది నిమిషా లయ్యాక కొత్తిమీర చల్లి దింపేయాలి.

చికెన్‌65..

కావలసినవి:

CHicken 65 Recచికెన్‌ ముక్కలు: అరకేజీ, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, పెరుగు: రెండు చెంచాలు, నిమ్మరసం: రెండు చెంచాలు, కరివేపాకు తరుగు: చెంచా, ఎండుమిర్చి: నాలుగు, పసుపు: పావుచెంచా, మిరియాలు: అరచెంచా, సోంపు: పావుచెంచా, దాల్చినచెక్క: ఒకముక్క, జీలకర్ర: కొద్దిగా, ఉప్పు: తగినంత, గుడ్డు: ఒకటి(తెల్లసొన మాత్రమే), బియ్యప్పిండి: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: చికెన్‌ముక్కలపైన అల్లంవెల్లుల్లి ముద్ద, పెరుగు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి, పసుపు, మిరియాలు, సోంపు, దాల్చినచెక్క, జీలకర్ర మిక్సీలో వేసి మెత్తగా చేసుకుని ఈ పొడిని కూడా చికెన్‌ముక్కలపైన వేసి మరోసారి కలపాలి. మరో కప్పులో గుడ్డుసొన, బియ్యప్పిండి, కరివేపాకు తరుగు వేసి కలిపి పెట్టుకోవాలి. చికెన్‌ ముక్కల్ని బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి.. కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

పుదీనా చికెన్‌..

కావలసినవి చికెన్‌:

Pudina Chicken : అరకేజీ, ఉల్లిపాయలు: రెండు, పెరుగు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: కప్పు, పుదీనా ఆకులు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, అల్లం: చిన్నముక్క, వెన్న: టేబుల్‌స్పూను, కసూరీమేథీ: టేబుల్‌స్పూను, వెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: అరచెంచా, గరంమసాలా: చెంచా, జీలకర్రపొడి: అరచెంచా, యాలకులు: రెండు, నూనె: పావుకప్పు.

తయారీ విధానం:

Chicken Variety Recipes : ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కొత్తిమీర, పుదీనా మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి వెన్న, నూనె వేయాలి. వెన్న కరిగాక ఉల్లిపాయముక్కలు, యాలకులు వేయించి.. చికెన్‌ ముక్కలు వేయాలి. తరువాత కసూరీమేథీ తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ కలిపి పావుకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. చికెన్‌ పూర్తిగా ఉడికిందనుకున్నాక కసూరీమేథీ వేసి బాగా కలిపి దింపేయాలి. ఇది అన్నంలోకే కాదు, రోటీల్లోకీ బాగుంటుంది.

ఇదీ చదవండి:సాయంత్రం వేళ.. 'చికెన్​ కీమా పరోటా' చేసేయండిలా..

ABOUT THE AUTHOR

...view details