చల్లని వేళ... వేడివేడిగా సూప్ తాగితే కడుపుతో పాటు మనసూ నిండిపోతుంది. అందుకే శాకాహారులు ఎంతో ఇష్టపడే టర్కిష్ సూప్‌ను మీ ఇంట్లోనే ఇలా చేసుకోండి...
కావాల్సినవి
- ఎర్ర పప్పు - కప్పు
- వెజిటబుల్ స్టాక్ - నాలుగు కప్పులు
- ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
- బంగాళాదుంప ముక్కలు - అర కప్పు
- కారం - టీస్పూన్
- ఉప్పు - టీస్పూన్
తయారీ
ముందుగా ఎర్ర పప్పును కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద పాత్రలో పప్పుతో పాటు బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కారం వేసి ఆఖరున వెజిటబుల్ స్టాక్ కూడా పోసేయాలి. ఆ తర్వాత దీన్ని మరిగించుకోవాలి. మరుగుతుండగా మంట తగ్గించుకొని సగం వరకూ మూత పెట్టి ఉడికించుకోవాలి. దీన్ని ఓ అరగంట పాటు ఉడికించుకొని ఆ తర్వాత ఉప్పు వేయాలి. ఇందులోంచి పైపైన ఉన్న నీటిని తీసి పక్కన పెట్టుకొని, అడుగున ఉన్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటినీ తిరిగి కలుపుకొని మరికాసేపు మరగబెట్టుకుంటే సరి.. టర్కిష్ సూప్ సిద్ధమవుతుంది.
ఇదీ చదవండి:బేక్ చేయకుండా కేక్ చేసుకోండిలా...