గుత్తివంకాయ.. ఈ పేరు వినగానే మాసాలా కర్రీ, పులుసు ఇలా రకరకాల వంటలు గుర్తొస్తాయి. చాలా మంది బాగా ఇష్టంగా తింటుంటారు. మరి వెల్లుల్లి వంకాయ పులుసు గురించి తెలుసా? ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచి దీని సొంతం. దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే..
ముందుగా రోలులో వెల్లుల్లి వేసి దంచుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడెక్కాక దంచుకున్న వెల్లులి, ధనియాలు, శెనగపప్పు, ఎండుమిర్చి, పుట్నాలు, జీలకర్ర, కల్లుప్పు వేసి వేయించాలి. ఇందులో వేయించిన ఉల్లిపాయలను కలిపి ముద్ద చేసుకోవాలి. అప్పుడీ వెల్లుల్లి మసాలా ముద్దను గుత్తివంకాయలో పెట్టి వేడినూనెలో వేయించుకోవాలి.