రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఆల్వీ పాలక్ రెసిపీ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేయండి...
ఆలూ-పాలక్‌తో కొత్తగా.. నోరూరించేలా! కావాల్సినవి..
- ఆలూ - కేజీ,
- ఆవనూనె - మూడుటేబుల్‌స్పూన్లు,
- పాలకూర కట్టలు - పది,
- అల్లంవెల్లుల్లి ముద్ద - టేబుల్‌స్పూను,
- ఎండుమిర్చి - పది,
- పసుపు - టేబుల్‌స్పూను,
- సోంపుపొడి - టేబుల్‌స్పూను,
- యాలకులు - ఆరు,
- దాల్చినచెక్క - ఒకటి పెద్దది,
- టొమాటో గుజ్జు - ఒకటిన్నర కప్పు,
- ఉప్పు - తగినంత.
తయారీ
ఎండుమిర్చిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి తర్వాత మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆలూ చెక్కు తీసి నీళ్లలో వేసి ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో ఆవనూనె వేడిచేసి అల్లంవెల్లుల్లి ముద్ద వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ముందుగా చేసుకున్న ఎండుమిర్చి పేస్టు, టొమాటో గుజ్జూ, అందులో కాసిని నీళ్లూ, పసుపూ, సోంపుపొడీ, యాలకులూ, దాల్చిన చెక్కా, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి. అందులో ముందుగా మగ్గించి పెట్టుకున్న ఆలూ ముక్కలూ, పాలకూర తరుగు కూడా వేసి కలిసి మూత పెట్టేయాలి. కాసేపటికి పాలకూర ఉడుకుతుంది. అప్పుడు దింపేయాలి. అంతే... ఆల్వీపాలక్ సిద్ధం.
ఇదీ చదవండి: 'మెక్సికన్ చంకీ సల్సా' ఇంట్లోనే చేసుకోండిలా...