తెలంగాణ

telangana

ETV Bharat / priya

'దమ్‌ కా నల్లి'.. ఇది మటన్​ను మించి! - mutton items preparation

మటన్​తో ఎప్పుడూ సాధారణ కర్రీ చేసుకోకుండా ఈ సారి ప్రత్యేక వంటకమైన దమ్ కా నల్లి ట్రై చేయండి. మటన్ ఎముకలు, టొమాటో గుజ్జుతో పసందైన వంటకాన్ని సిద్ధం చేసుకోండి.

food
మటన్

By

Published : Nov 11, 2020, 2:05 PM IST

మటన్​తో నోటికి రుచిగా ఏదైనా చేసుకోవాలనుకుంటే దమ్​ కా నల్లి సరైన ఛాయిస్. చాలా సింపుల్​గా, తక్కువ సమయంలో ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు.

కావల్సినవి:

మటన్‌ ఎముకలు- పన్నెండు, నూనె - అరకప్పు, ఉల్లిపాయలు - నాలుగు, టొమాటో గుజ్జు - అరకప్పు, కొత్తిమీర - కట్ట, ఉప్పు - తగినంత, పసుపు - అరచెంచా, దాల్చినచెక్క - పెద్ద ముక్క, యాలకులు - ఐదు, లవంగాలు - ఏడు, బిర్యానీ ఆకులు - నాలుగు, అల్లం - పెద్ద ముక్క, వెల్లుల్లి రెబ్బలు - పది, కారం - మూడు చెంచాలు, గరంమసాలా - చెంచా.

తయారీ:

పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు వేయాలి. అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.అవి గోధుమరంగులోకి వచ్చాక అల్లం,వెల్లుల్లి ముద్దా, కారం, తగినంత ఉప్పూ, మటన్‌ ఎముకలు కాసిని నీళ్లూ పోసి మూత పెట్టేయాలి. ఆ ఎముకలు సగం ఉడికాక టొమాటో గుజ్జు కలపాలి. కాసేపటికి అవి పూర్తిగా ఉడుకుతాయి అప్పుడు గరంమసాలా, కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి.

ABOUT THE AUTHOR

...view details